»   » చైతన్యకు 49.... సమంతకు 51

చైతన్యకు 49.... సమంతకు 51

Posted By:
Subscribe to Filmibeat Telugu

అక్కినేని నాగేశ్వరరావు తన మనవడు నాగచైతన్యకు హీరోగా చేసిన ఏ మాయ చేసావే చిత్రం గురించి, అందులో హీరో, హీరోయిన్స్ నటన గురించి మీడియాతో మాట్లాడారు. తనని వీరి నటనకు మార్కులు వేయమంటే...చైతన్యకు 49....సమంతకు 51వేస్తానని అన్నారు. అలాగే ప్రతి నటుడిలోనూ ఏవో కొన్ని లోపాలుంటాయి. 'లేవు' అనుకోవడం మూర్ఖత్వం. ఆ లోపాల్ని సరిదిద్దుకుంటూ చైతన్య ముందుకు సాగిపోవాలి. తనది ప్రేమిస్తున్నానని వెంటపడే పాత్ర. అలా ప్రేమించడం తేలిక. కానీ ప్రేమను అంగీకరించాలా? వద్దా? అని సతమతమయ్యే సమంత పాత్ర గొప్పది. సమంత ముఖంపై చర్మం చాలా పలచగా ఉంది. అందుకే తను పలికించాలనుకున్న భావాలను తేలికగా పలికించగలుగుతోంది. కృషి చేస్తే సావిత్రి అంత గొప్ప నటి కాగలదు అని చెప్పుకొచ్చారు. ఇక ఈ చిత్రం పెడదారులు పట్టిన ఈ పరిశ్రమను ఓ దారిలో పెట్టడానికి ఈ సినిమా ప్రయత్నించినట్టు అనిపించిందన్నారు ఆయన.

Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu