twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నేను కాదు..ఆమే ఎవర్ గ్రీన్:అక్కినేని నాగేశ్వరరావు

    By Srikanya
    |

    నేటికీ నన్ను ఎవర్‌గ్రీన్‌ అంటున్నారు. కానీ 60 సంవత్సరాల వయసులో కూడా చెక్కుచెదరని అందంతో హుషారుగా నర్తించే హేమమాలినే గొప్పవారు. ఈ అవార్డుకు కావాల్సిన అన్ని అర్హతలు ఆమెకున్నాయి అన్నారు అక్కినేని నాగేశ్వరరావు. తాజాగా ప్రముఖ నటి హేమమాలిని అక్కినేని నాగేశ్వరరావు జాతీయ పురస్కారానికి ఎంపికయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇలా స్పందించారు. అలాగే ''నేను దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డు స్వీకరించాక నా మదిలో కలిగిన ఆలోచనకు కార్యరూపమే ఈ అవార్డు. ఫాల్కే పురస్కారానికున్న నియమ నిబంధనలే దీనికి ఉన్నాయి అన్నారు.

    ఇక బాలీవుడ్‌ నటుల్లో మీకు స్ఫూర్తి ఎవరని మీడియా వారు అడిగిన ప్రశ్నకు సమాధానంగా ''నన్ను ఎవరైనా స్ఫూర్తిగా తీసుకున్నారో లేదో తెలియదు కానీ నాకు మాత్రం అశోక్‌కుమార్‌ అంటే అభిమానం. ఆయన సహజమైన నటనంటే ఇష్టమ''ని చెప్పా రు. ఈ నెల 26న హైదరాబాద్‌లో నిర్వహించే ఓ కార్యక్రమంలో హేమ మాలినికి ఈ అవార్జుని అందజేస్తారు.

    అవార్డు కమిటీ ఛైర్మన్‌ టి.సుబ్బరామిరెడ్డి మాట్లాడుతూ ..దేవానంద్‌, షబానా అజ్మీ, లతా మంగేష్కర్‌ లాంటి ప్రముఖులకు ఈ పురస్కారాన్ని అందజేశాం. గత మూడు దశాబ్దాలుగా హేమమాలిని తనదైన నటనతో తెరపై ఓ ముద్రను వేశారు. నాట్యకారిణిగానూ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకొన్నారు. ఆ సేవలకు గుర్తింపుగా ఈ అవార్డును అందజేయబోతున్నామని అన్నారు.

    English summary
    The Dream Girl of Indian cinema Hema Malini has been chosen for the prestigious Akkineni Nageswara Rao Award for the year 2011.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X