»   » అక్ష ఆశలన్నీ రాధ పైనే : బాహుబలి తో యుద్దం గెలుస్తుందనే ఆశ అట

అక్ష ఆశలన్నీ రాధ పైనే : బాహుబలి తో యుద్దం గెలుస్తుందనే ఆశ అట

Posted By:
Subscribe to Filmibeat Telugu

యంగ్ హీరోలు నిఖిల్, రామ్‌తో 'యువత', 'కందిరీగ' లాంటి హిట్స్ ఇచ్చినా అక్ష టాలీవుడ్‌లో బిజీ కాలేకపోయింది. అసలు అప్పట్లో తెలుగులో మరిన్ని సినిమాలు చేయడం ఖాయమని అనుకున్నారు. కానీ ఎందుకనో ఆశించిన స్థాయిలో ఆమెకి అవకాశాలు దక్కలేదు. దాంతో తమిళ .. మలయాళ .. హిందీ సినిమాలపై దృష్టి పెట్టింది. ఆఫర్లు లేక గ్యాప్ రావడంతో అక్షని తెలుగు ప్రేక్షకులు ఆల్మోస్ట్ మర్చిపోయారు.

ఫస్ట్ టైం పోలీస్ క్యారెక్టర్

ఫస్ట్ టైం పోలీస్ క్యారెక్టర్

ఇప్పుడు అక్ష చేతిలో "రాధ" ఉంది ఇప్పుడు శర్వానంద్ వరుస హిట్ లతో కాస్త దూకుడు గానే ఉన్నాడు. అందుకే ఈ సారినా కెరీర్ కొంచం గాడిలో పడుతుందనే ఆశతో ఉందట. ఈ మూవీలో శర్వానంద్ ఫస్ట్ టైం పోలీస్ క్యారెక్టర్ ట్రై చేస్తున్నాడు. ఈ మూవీలో అక్షకి ఆఫర్ రావడంతో ఫుల్ ఖుషీగా వుంది. అయితే అక్షది ఇందులో లీడ్ రోల్ కాదని తెలుస్తోంది.

శర్వానంద్ సరసన

శర్వానంద్ సరసన

ఈ నేపథ్యంలోనే ఆమెకి శర్వానంద్ సరసన 'రాధ' సినిమాలో ఛాన్స్ తగిలింది. అయినా అసలు ఆఫర్లే లేని అక్షకి బిగ్ ప్రొడ్యూసర్.. సక్సెస్‌ఫుల్ హీరో మూవీలో చిన్న రోల్ అయినా బంపర్ ఆఫర్ కిందే లెక్క. ఈ నెల 12వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది. ఈ సినిమాలో తన పాత్ర ఎంతో కొత్తగా ఉంటుందని అక్ష చెప్పింది.

మరింత గ్లామర్ గా

మరింత గ్లామర్ గా

ఈ తరహా పాత్రను తాను ఇంతవరకూ చేయలేదని అంది. తాను ఈ సినిమాలో సంప్రదాయ బద్ధంగా కనిపించినా, పాటలో మాత్రం మరింత గ్లామర్ గా కనిపిస్తానని చెప్పింది. ఈ సినిమా తరువాత తెలుగులో తనకి మరిన్ని అవకాశాలు రావడం ఖాయమనే ఆశాభావాన్ని వ్యక్తం చేసింది.

మే 12న

మే 12న

‘శతమానం భవతి' వంటి జాతీయ అవార్డు సినిమాతో మంచి జోష్ మీద ఉన్న యువ హీరో శర్వానంద్ ఈ సమ్మర్‌లో సందడి చేయడానికి సిద్ధమయ్యాడు. శర్వానంద్ హీరోగా నటించిన ‘రాధ' విడుదలకు సిద్ధమైంది. మే 12న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

 సాహసమే

సాహసమే

అయితే ప్రస్తుతం తెలుగు తెరలపై ‘బాహుబలి ది కన్‌క్లూజన్' దండయాత్ర కొనసాగిస్తోంది. ఇలాంటి సమయంలో ‘రాధ' సినిమా విడుదలకు నిర్మాతలు ధైర్యం చేయడం సాహసమే అని చెప్పాలి. మరీ ఇంత స్ట్రగుల్ లోనూ రాధ గనక హిట్ టాక్ తెచ్చుకుంటే ఖచ్చితంగా అది అక్ష కి ప్లస్సే అవుతుంది....

English summary
The ‘Yuvatha’ actress Aksha will be seen opposite Sharwanand in his under-shoot film directed by debutant Chandra Mohan Chintada. Apparently, the action comedy features a crucial track that is to be essayed by a renowned actress.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu