»   » మతం మారిన మాట నిజమే: కమల్ హాసన్ కూతురు

మతం మారిన మాట నిజమే: కమల్ హాసన్ కూతురు

Posted By:
Subscribe to Filmibeat Telugu

కమల్ హాసన్ కూతురు శృతి హాసన్ తన తండ్రితో కలిసి 'శబాష్ నాయుడు' అనే సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. కమల్ రెండో కూతురు కూడా తండ్రితో కలిసి సినిమా చేయాలని ఆశ పడుతోంది. తన తండ్రితో పాటు ఎంటైర్ హాసన్ ఫ్యామిలీతో కలిసి సినిమా చేయాలనేది తన డ్రీమ్ అని అక్షర హాసన్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.

నటన అంటే ఎంతో ఇష్టమని, మా ఫ్యామిలీ మొత్తం కూడా ఇదే ఫీల్డులో ఉండటం కూడా ఈ రంగంపై ఆసక్తి పెరగడానికి ఓ కారణమని తెలిపారు. నటనలో పరిపూర్ణత సాధించేందుకు ప్రయత్నిస్తున్నాను, అన్ని రకాల సినిమాలు చేయాలని ఉందని అక్షర హాసన్ తెలిపారు.

Akshara Haasan about Buddhism

బుద్దిజంలోకి మారారా? అనే ప్రశ్నపై స్పందిస్తూ...'నా సోదరిలాగే నేను కూడా నాస్తికురాలినే. అయితే బుద్దిజంపై ఆసక్తితో దాన్ని ఆచరిస్తున్నాను' అని అక్షర హాసన్ తెలిపారు. కమల్ హాసన్ పొలిటికల్ ఎంట్రీ గురించి ప్రశ్నకు స్పందిస్తూ....ఆయన ఏం చేయాలనుకుంటే అది చేస్తారు, దానిపై నేను స్పందించలేను అన్నారు.

అక్షర హాసన్ ప్రస్తుతం అజిత్ హీరోగా తెరకెక్కుతున్న 'వివేకం' సినిమాలో నటిస్తోంది. ఈ చిత్రంలో అక్షర హాసన్ ఓ కీలకమైన పాత్రలో నటిస్తోంది. ఈ పాత్ర తనకు ఎంతో పేరుతెస్తుందని ఆమె తెలిపారు. ఆగష్టు 10వ 'వివేకం' రిలీజ్ కానుంది.

English summary
When quizzed about conversion to Buddhism, Akshara Haasan replied: 'Just alike My Sister, I am an atheist. But, I'm embracing buddhism out interest'.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu