»   » ఆ భయం వల్లే ఆమె పవన్‌ కళ్యాణ్ ఆఫర్‌ కాదనుకుంది!

ఆ భయం వల్లే ఆమె పవన్‌ కళ్యాణ్ ఆఫర్‌ కాదనుకుంది!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన నటించడం అంటే ఏ హీరోయిన్ అయినా ఎగిరి గంతేస్తుంది. ఆయనతో నటిస్తే, ఆ సినిమా హిట్టయితే తమ కెరీర్ గ్రాఫు బావుంటుందనేది వారి ఆశ. కెరీర్ మొదలు పెట్టినప్పటి నుండి ఒక్క హిట్టు కూడా లేని శృతి హాసన్ ‘గబ్బర్ సింగ్' హిట్ కావడంతో స్టార్ హీరోయిన్ అయిన సంగతి తెలిసిందే.

త్వరలో గబ్బర్ సింగ్-2 కూడా పట్టాలెక్క బోతోంది. ఇందులో అనీషా ఆంబ్రోస్ హీరోయిన్. వాస్తవానికి ఈ చిత్రంలో హీరోయిన్ ఆఫర్ తొలుత శృతి హాసన్ చెల్లెలు అక్షర హాసన్‌కు వచ్చిందట. అయితే నిర్మొహమాటంగా ఆమె ఈ ఆఫర్ తిస్కరించిందట. మొదట్లోనే అంత పెద్ద హీరోతో చేస్తే అంచనాలు భారీగా ఉంటాయి, అందుకు తగిన విధంగా మన పెర్ఫార్మెన్స్ లేకుంటే బ్యాడ్ ఇంప్రెషన్ పడుతుంది. అందుకే ఆ ఆఫర్ సున్నితంగా తిరస్కరించినట్లు అక్షర హాసన్ చెబుతోంది.

Akshara Haasan rejects Pawan offer

గబ్బర్ సింగ్ 2 సినిమా విషయానికొస్తే...
తాజా పరిస్థితి పరిశీలిస్తే ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా సాగుతున్నాయి. ఈ చిత్రానికి బాబీ దర్శకత్వం వహిచబోతున్నారు. ‘గోపాల గోపాల' విడుదల కావడంతో కాస్త ఫ్రీ అయిన పవన్ కళ్యాణ్....పర్సనల్‌గా ఈ చిత్రానికి సంబంధించిన ప్రొడక్షన్ పనులపై దృష్టి పెట్టారు.
ఆ మధ్య పవన్ కళ్యాణ్‌కు బ్యాక్ పోయిన్ ఉందని, శస్త్ర చికిత్స కోసం ఆస్ట్రేలియా వెలుతున్నారనే వార్తలు మీడియాలో హల్ చల్ చేసాయి. అయితే రూమర్స్ విన్న పవన్ కళ్యాణ్ నవ్వారట. అలాంటిదేమీ లేదు...నేను షూటింగుకు రెడీగా ఉన్నానని దర్శక నిర్మాతలతో చెప్పినట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని పవన్ కళ్యాణ్ ఫ్రెండ్ శరత్ మరార్ నిర్మించనున్నారు. ఫిబ్రవరిలో సినిమా ప్రారంభం కానుందని సమాచారం. తొలి షెడ్యూల్ లో హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో 10 రోజుల పాటు షూటింగ్ జరుగుతుందట.

అలియాస్ జానకి చిత్రం ద్వారా తెలుగు తెరకు హీరోయిన్ గా పరిచయం అయిన అనీషా ఆంబ్రోస్ ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటించనుంది. 'పవర్' చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అయిన బాబీ దర్శకత్వం వహించే ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ అందిస్తాడని తెలుస్తోంది. గబ్బర్ సింగ్-2 చిత్రానికి పవన్ కళ్యాణే స్టోరీ రాయడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. వాస్తవానికి స్టోరీ, స్క్రీప్టు తయారు చేయడం లాంటి టాలెంట్ పవన్ కళ్యాణ్‌లో ఎప్పటి నుండో ఉంది. గబ్బర్ చిత్రంలో హిట్టయిన అంత్యాక్షరి టీం సీన్ పవన్ కళ్యాణ్ ఆలోచనే. ఆయన ఐడియాలజీ సినిమా హిట్ కావడానికి దోహద పడ్డాయి.

గబ్బర్ సింగ్-2 చిత్రం గతంలో వచ్చిన గబ్బర్ సింగ్, దబాంగ్ చిత్రాలకుతో సంబంధం లేకుండా సరికొత్త కథతో ఆవిష్కరించబోతున్నారు. ఈ చిత్రాన్ని పవన్ కళ్యాణ్ ఫ్రెండ్ శరత్ మరార్ నిర్మించబోతున్నారు. బ్రహ్మానందం, అలీ ముఖ్య పాత్రల్లో కనిపించబోతున్నారు. అంత్యాక్షరి గ్యాంగ్ కూడా ‘గబ్బర్ సింగ్-2'లో కూడా నటించనుంది.

English summary
Akshara Haasan rejects Pawan Kalyan's Gabbar Singh 2 movies.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu