»   » కూతురు కోసం...‌: మామిడికాయలు కోసిన స్టార్ హీరో (ఫొటో)

కూతురు కోసం...‌: మామిడికాయలు కోసిన స్టార్ హీరో (ఫొటో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: బాలీవుడ్‌ స్టార్ హీరో అక్షయ్‌కుమార్‌ ఈ సమ్మర్ ని తన కూతురుతో కలిసి బాగా ఎంజాయ్‌ చేస్తున్నారు. తన చిన్న కుమార్తె నిటారాతో కలిసి చెట్టుకి ఉన్న మామిడి కాయలు కోశారు. మామిడికాయలు కోస్తుంటే బాల్యం గుర్తొస్తోంది అంటూ అక్షయ్‌ ఫొటోను ఆయన భార్య ట్వింకిల్‌ ఖన్నా ఈరోజు ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు. ఆమె చేసిన ట్వీట్ ని మీరు ఇక్కడ చూడవచ్చు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

మరో ప్రక్క అక్షయ్ కుమార్, ట్వింకిల్ ఖన్నా ఒకరిపై మరొకరు ప్రశంసలు కురిపిస్తున్నారు. మా ఆయన బంగారం అంటూ ట్వింకిల్ కితాబిస్తే.. నా భార్య నాకు సూపర్ వుమెన్ అంటూ అక్షయ్ మెచ్చుకున్నాడు.

నిన్నటి తరం బాలీవుడ్ తారలు రాజేష్ ఖన్నా, డింపుల్ కపాడియాల గారాటపట్టి ట్వింకిల్ సినిమాలకు గుడ్ బై చెప్పి 2001లో అక్షయ్ ను పెళ్లి చేసుకుంది. అక్షయ్, ట్వింకిల్ దంపతులకు ఒక కొడుకు, ఒక కుమార్తె. ప్రస్తుతం అక్షయ్‌ నటించిన 'బ్రదర్స్‌' చిత్రం ప్రేక్షకులముందుకు రావాల్సి ఉంది. 

English summary
Twinkle just shared an adorable picture of Akshay with his little girl using a stick to pick the freshest fruit from their very own mango tree. she tweeted: "Revisiting our own childhood. Plucking mangoes and seeing the wonder in her eyes.."
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu