»   » తెర మీదే కాదు...తెర వెనకా హీరోనే: జవాన్ల కుటుంబాలకు రూ.కోటి డొనేషన్

తెర మీదే కాదు...తెర వెనకా హీరోనే: జవాన్ల కుటుంబాలకు రూ.కోటి డొనేషన్

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: కేవలం తెరమీద తన ఉదాత్తను చాటుకుని శాభాష్ అనిపించుకునేందుకు తహతహలాడుతూంటారు చాలామంది హీరోలు. అయితే కొందరు మాత్రం తెరమీదే కాదు..తెర వెనక కూడా నిజ జీవిత హీరోలుగా కీర్తింపబడతారు. అటువంటి వారిలో బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ఒకరు. అక్షయ్‌ కుమార్‌ మరోసారి తన ఉదారతను చాటుకుని అందరి చేతా శభాష్ అనిపించుకుంటున్నారు.

వివరాల్లోకి వెళితే... శనివారం చత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో మావోయిస్టులు, భద్రతా బలగాలపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో 12 మంది సీఆర్పీఎఫ్‌ జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. నలుగురు జవాన్లు గాయపడ్డారు.

Akshay Kumar donates Rs 1.08cr to families of martyred CRPF jawans

ఈ ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన 12 మంది సిఆర్‌పిఎఫ్ జవాన్ల కుటుంబాలకు బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ ఆర్ధిక సాయం ప్రకటించారు. ఒక్కో కుటుంబానికి 9 లక్షల రూపాయల చొప్పున కోటీ ఎనిమిది లక్షల రూపాయల ఆర్ధిక సాయం ప్రకటించారు.

ది సీఆర్పీఎఫ్‌ (సెంట్రల్‌ రిజర్వు పోలీస్‌ ఫోర్స్‌) జవాన్ల కుటుంబాలకు రూ.1.08కోట్లను విరాళంగా ఇచ్చారు. గురువారం ఈ విషయాన్ని సీఆర్పీఎఫ్‌ ట్విటర్‌ ద్వారా వెల్లడించింది. 'నటుడు అక్షయ్‌కుమార్‌ తన నిజమైన దేశభక్తిని చాటుకున్నారు. సుక్మా దాడిలో అమరులైన 12 మంది సీఆర్పీఎఫ్‌ జవాన్ల ఒక్కో కుటుంబానికి రూ.9లక్షలు విరాళంగా ఇచ్చారు. ఆయనకు సీఆర్పీఎఫ్‌ సెల్యూట్‌ చేస్తోంది' అంటూ ట్వీట్‌ చేశారు.

కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ సైతం ఈ విషయమై ట్వీట్ చేసి ప్రశంసలు కురిపించారు.

English summary
Bollywood star Akshay Kumar has donated Rs nine lakh to each of the families of twelve CRPF men martyred in an ambush by Maoists in Sukma, Chhattisgarh last week.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu