»   » ఇక్కడ చిరంజీవి, అక్కడ అక్షయ్ కుమార్

ఇక్కడ చిరంజీవి, అక్కడ అక్షయ్ కుమార్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: ఏ.ఆర్‌.మురుగదాస్‌ దర్శకత్వంలో విజయ్‌ హీరోగా తెరకెక్కి భారీ విజయాన్ని సొంతం చేసుకున్న కత్తి సినిమాను తెలుగులో చిరంజీవితో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. చిరంజీవి 150వ చిత్రంగా రూపొందుతూండటంతో, ఈ చిత్రానికి అనూహ్యంగా క్రేజ్ వచ్చింది. దాంతో బాలీవుడ్ లోనూ రీమేక్ కు రంగం సిద్దం అయ్యింది.

Akshay Kumar in Katti Remake

బాలీవుడ్‌లో రీమేక్‌ చిత్రంలో హీరోగా యాక్షన్‌ హీరో అక్షయ్‌ కుమార్‌ నటించనున్నారు. గతంలో అక్షయ్‌ మురుగదాస్‌ దర్శకత్వం వహించిన ‘హాలీడే' చిత్రంలో నటించారు. ప్రస్తుతం ఆయన శంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రోబో2.0 చిత్రంలో విలన్ పాత్రలో నటిస్తున్నారు.

Akshay Kumar in Katti Remake

తమిళంలో తెరకెక్కిన ‘కత్తి' చిత్రంలో విజయ్‌ ద్విపాత్రాభినయం చేశారు. కార్పొరేట్‌సంస్థల వల్ల రైతులు ఎలా నష్టపోతున్నారనే కథాంశం ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ నెల 22న అక్షయ్‌ కుమార్‌ నటించిన ఎయిర్‌లిఫ్ట్‌ చిత్రం విడుదల కానున్న సంగతి తెలిసిందే.

English summary
Akshay Kumar will be act in Katti hindi remake.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu