»   »  ఎక్స్ లవర్ భర్తతో కలిసి అక్షయ్ కుమార్ సొంత టీవీ ఛానల్

ఎక్స్ లవర్ భర్తతో కలిసి అక్షయ్ కుమార్ సొంత టీవీ ఛానల్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ సరికొత్త బిజినెస్ ప్రారంభించారు. సొంతగా టెలిషాపింగ్ టీవీ ఛానల్ ప్రారంభించారు. ‘బెస్ట్ డీల్ టీవీ' పేరుతో ఈ ఛానల్ ప్రారంభించారు. ఈ వ్యాపారంలో శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా కూడా భాగస్వామిగా ఉన్నారు. గతంలో అక్షయ్-శిల్ప మధ్య ఎఫైర్ ఉన్నట్లు వార్తలు ప్రచారంలో ఉన్నాయి. ఇపుడు ఆమె భర్తతో కలిసి అక్షయ్ కుమార్ వ్యాపార రంగంలోకి దిగడం గమనార్హం.

ప్రస్తుతానికి ఈ ఛానల్ హిందీలో మాత్రమే ప్రారంభం అయింది. ఇది సెలబ్రిటీ బేస్డ్ టెలిషాపింగ్ ఛానల్. అంటే పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు ఈ ఛానల్ తో ఒప్పందం కుదుర్చుకని తమ సొంత బ్రాండ్లు మార్కెట్ చేసుసుకోవచ్చు. తద్వారా లాభాల్లో వాటా తీసుకొచ్చవని అంటున్నారు. తొలి సారిగా నటి సోనాక్షి సిన్హా ఈ టీవీ ఛానల్‌తో టై అప్ అయింది.

Akshay Kumar Launches His Own TV Channel With Raj Kundra

ఈ టీవీ ఛానల్ గురించి అక్షయ్ కుమార్ మాట్లాడుతూ...‘టెలిషాపింగ్ బిజినెస్ వరల్డ్ లోనే అతి పెద్దది. రాజ్ కుంద్రా, నేను కలిసి కొత్త ఐడియాతో దీన్ని ప్రారంభించాము. ఇదో సెలబ్రిటీ బేస్డ్ టెలిషాపింగ్ ఛానల్. సెలబ్రిటీలు స్వయంగా వచ్చి తమ ప్రొడక్ట్స్ ఇక్కడ అమ్ముకోవచ్చు' అని తెలిపారు.

దీనిపై సోనాక్షి సిన్హా స్పందిస్తూ...‘నేను ఈ ఛానల్ కు బ్రాండ్ అంబాసిడర్ మాత్రమే కాదు. కో ఓనర్ కూడా. ఇంత చిన్న వయసులోనే వ్యాపార రంగంలోకి అడుగు పెట్టడం సంతోషంగా ఉంది. ఇది మంచి ఫలితాలను ఇస్తుందని నమ్ముతున్నాము' అని సోనాక్షి సిన్హా చెప్పుకొచ్చారు.

English summary
Akshay Kumar is turning into a businessman with his new venture of starting his own teleshopping channel called Best Deal TV. He is partnering with none other than Raj Kundra who is his ex flame, Shilpa Shetty's current hubby.
Please Wait while comments are loading...