»   » హీరో గారికి ఆడ గొంతు డబ్బింగ్

హీరో గారికి ఆడ గొంతు డబ్బింగ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: హీరోలు ఆడ పాత్రలు ధరించి మెప్పించే పోకడ బాలీవుడ్‌లో విజయవంతమైంది. ఈ నేపథ్యంలో అక్షయ్‌ కుమార్‌ మరో అడుగు ముందుకేశారు. ఆయన నటించే ఇట్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సినిమాలో ఆడ నేపథ్య గాయని పాడిన జానీ జానీ పాటకు అనుగుణంగా ఆయన పెదవులు కదిపినట్లు సమాచారం. అందరికీ సుపరిచితమైన నర్శరీ పద్యం జానీ జానీ ఎస్‌ పప్పా పాటకే అక్షయ్‌ హాస్యభరితంగా పెదవులు కదిపారు.

పాట సమకూర్చిన సంగీతం హిట్‌ పాటని హిట్‌ నంబర్‌లోనే ఉంచుతుందని చెప్పవచ్చు. మహిళా సాధికారత కోసం గాయని ప్రియాతో పాడించామని, పాటలో వాక్యాలు సినిమాలో అక్షయ్‌ అవతారానికి సరిగ్గా సరిపోతాయని సినిమా దర్శకులు ఫర్హాద్‌-సాజిద్‌ తెలిపారు. వచ్చే నెల 8న సినిమా విడుదల కానుంది.

Akshay Kumar lip-syncs to woman's voice for It's Entertainment

ఈ చిత్రంలో తమన్నా హీరోయిన్ గా చేస్తోంది. ఆమె మాట్లాడుతూ.. ''ఈ మధ్య 'ఇట్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌' అనే సినిమాలో చేశాను. ఈ సినిమాలో నా దగ్గర ఒక కుక్కపిల్ల ఉంటుంది. దాని పేరు ఎంటర్‌టైన్‌మెంట్‌. దానితో అలవాటైన తర్వాత ఇంటికి వచ్చాక వెలితిగా అనిపించేది. అందుకే అమ్మకు నచ్చజెప్పి ఓ కుక్కపిల్లను పెంచుకుంటున్నాను. దానికి పెబ్బెల్స్‌ అనే పేరు కూడా పెట్టాను. పెబ్బల్స్‌ ఇప్పుడు నా రాక కోసం ప్రతిరోజూ ఈగర్‌గా వెయిట్‌ చేస్తుంటే చాలా ఆనందంగా అనిపిస్తోంది'' అని చెప్పింది తమన్నా.

English summary
Akshay Kumar trying out something new - he lip-syncs to a female voice for the song "Johnny Johnny" for "It's Entertainment". The song is the first to be released from the album of the forthcoming film "It's Entertainment", which marks the directorial debut of writers Farhad-Sajid.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu