»   » ఆ ముగ్గురితో అలాంటిదేమీ లేదు.. పత్రికలు కొంపలు కూలుస్తాయ్.. అక్షయ్ సీరియస్

ఆ ముగ్గురితో అలాంటిదేమీ లేదు.. పత్రికలు కొంపలు కూలుస్తాయ్.. అక్షయ్ సీరియస్

Posted By:
Subscribe to Filmibeat Telugu

అందాల బ్యూటీ ప్రియాంక చోప్రా తాను ఎన్నడూ గొడవపడలేదని బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ స్పష్టం చేశారు. 'ప్రియాంకతో నాకు ఎలాంటి విభేదాలు లేవు. గతంలో దాదాపు ఐదు చిత్రాల్లో నటించాను. బాలీవుడ్‌లో రాణి ముఖర్జీతో తప్ప అందరితో నటించాను' అని అక్షయ్ తెలిపారు. ప్రస్తుతం హాలీవుడ్ చిత్రాలు బేవాచ్, క్వాంటికోతో బిజీగా ఉన్నారని, వీలు కుదిరితే మళ్లీ ప్రియాంకతో నటించేందుకు సిద్ధమని పేర్కొన్నారు. గతంలో ప్రియాంకతో కలిసి అందాజ్, ముఝ్ సే షాదీ కరోగి, ఐత్రాజ్, వక్త్: ది రేస్ అగెనెస్ట్ టైమ్ చిత్రాల్లో నటించారు. అక్షయ్ నటించిన జాలీ ఎల్‌ఎల్‌బీ 2 చిత్రం ఈ నెల 10న విడుదల కానున్న నేపథ్యంలో ఇటీవల ఓ టెలివిజన్ చానెల్ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Akshay Kumar Said About 'Fallout' With Priyanka Chopra, Farah Khan, Ekta Kapoor

దర్శకురాలు ఫరాఖాన్ విభేదాలు లేవు..
కొరియోగ్రాఫర్, డైరెక్టర్ ఫరాఖాన్ తో కూడా ఎలాంటి విభేదాలు లేవని, తనకు ఆమె మంచి స్నేహితురాలు అని అక్షయ్ వెల్లడించారు. ఫరా దర్శకత్వంలో తీస్‌మార్ ఖాన్ చిత్రంలో నటించారు. అలాగే ఆమె భర్త శిరీష్ కుందర్ దర్శకత్వంలో జోకర్ అనే సినిమాలోనూ నటించారు. అయితే జోకర్ ప్రమోషన్ కార్యక్రమానికి అక్షయ్ దూరంగా ఉండటంతో ఫరాఖాన్ అసహనానికి గురయ్యారు. అప్పటి నుంచి వారి మధ్య సంబంధాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి.

Akshay Kumar Said About 'Fallout' With Priyanka Chopra, Farah Khan, Ekta Kapoor

నిర్మాత ఏక్తా కపూర్‌తో గొడవుల లేవు..
బాలాజీ ఫిలిం అధినేత్రి, నిర్మాత ఏక్తా కపూర్ తో తనకు గొడవలేమి లేవని అక్షయ్ తెలిపారు. ఏక్తా నిర్మించిన వన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ ముంబై దోబారా చిత్రంలో ఆయన నటించారు. ఈ చిత్రం షారుక్ నటించిన చెన్నై ఎక్స్ ప్రెస్ చిత్రం ఒకేరోజున విజయం సాధించాయి. అయితే ఓ పక్క షారుక్ బృందం విస్త్రృతంగా ప్రచారం చేస్తుంటే.. ఈ చిత్ర ప్రమోషన్ కు హాజరుకాకపోవడం వల్ల అక్షయ్ పై ఏక్తా ఆగ్రహం వ్యక్తం చేసింది.

Akshay Kumar Said About 'Fallout' With Priyanka Chopra, Farah Khan, Ekta Kapoor

పత్రికలు కొంపలు కూలుస్తాయ్..
ప్రియాంక, ఫరాఖాన్, ఏక్తా కపూర్‌లతో ఉన్న విభేదాలపై అక్షయ్ స్పందిస్తూ.. కావాలంటే ఇప్పుడే ఫొన్ చేసి తమ మధ్య ఉన్న సంబంధాల గురించి తెలుసుకోవచ్చు' అని ఆప్ కీ అదాలత్ యాంకర్ రజత్ శర్మ తో అన్నారు. పత్రికలు చదవడం వల్ల ఇలాంటి పశ్నలు అడుతారు. అవి ఎన్నో కుటుంబాలను కూల్చాయి అని అక్షయ్ తీవ్రంగా స్పందించారు.

English summary
There's no fallout. I've worked with Priyanka in 4-5 films. I've worked with every actress, except for Rani Mukerji," Akshay said. "Don't read the magazines. They've ruined many homes. They write whatever they want to." he revealed
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu