twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కష్టాల్లో అక్షయ్ కుమార్.. పోలీసుల అదుపులో 2 గంటలు.. 2.O రిలీజ్‌కు ముందు..

    |

    బాలీవుడ్‌ నటుడు అక్షయ్ కుమార్ ఇబ్బందుల్లో ఇరుక్కుపోయాడు. చండీగఢ్ మత ఘర్షణలు చోటుచేసుకొన్న సందర్భంలో డేరా సచ్ఛ సౌదా చీఫ్ గుర్మిత్ రామ్ రహీంకు పంజాబ్ డిప్యూటీ సీఎం సుఖ్‌బీర్ సింగ్ బాదల్‌కు మధ్యవర్తిత్వం నెరిపారనే ఆరోపణలపై పోలీసులు విచారించారు. ఈ వివాదంలో అక్షయ్ కుమార్ పేరు రావడం బాలీవుడ్ వర్గాల్లో చర్చనీయాంశమైంది. వివరాల్లోకి వెళితే..

    శంకర్ సినిమాల్లోనే 2.0 చాలా చిన్నది.. రన్ టైం ఎంతో తెలుసా!శంకర్ సినిమాల్లోనే 2.0 చాలా చిన్నది.. రన్ టైం ఎంతో తెలుసా!

    రేప్‌కేసులో డేరా బాబాను..

    రేప్‌కేసులో డేరా బాబాను..

    రేప్ కేసు నుంచి డేరా బాబా తప్పించడానికి పంజాబ్ డిప్యూటీ సీఎంతో ముంబైలో బేరసారాలు నడిపాడనే ఆరోపణలు తలెత్తాయి. దాదాపు వారి మధ్య రూ.100 కోట్ల డీల్ నడిచిందనే మాట వినిపించింది. ఆ సమయంలో జైలులో ఉన్న డేరా బాబాకు 20 ఏళ్ల శిక్ష పడిన సంగతి తెలిసిందే. ఆ శిక్ష సమయంలో చంఢీగడ్, హర్యానా ప్రాంతంలో అల్లర్లు కూడా జరిగాయి. ఈ బేరసారాల విషయంలో అక్షయ్ కుమార్‌ పాత్ర ఉన్నట్టు ఆరోపణలు రావడంతో సిట్ విచారణకు పిలిచారు.

    అక్షయ్‌ కుమార్‌ను కలువలేదు

    అక్షయ్‌ కుమార్‌ను కలువలేదు

    అక్షయ్ కుమార్ వివాదంపై డిప్యూటీ సీఎం బాదల్ స్పందిస్తూ.. నేనెప్పుడూ అక్షయ్ కుమార్‌ను కలువలేదు. కాంగ్రెస్ అధికార ప్రభుత్వంపై కక్ష సాధింపు చర్య ఇది అని అన్నారు. ఈ కేసులో బాదల్‌ను నవంబర్ 16న సిట్ అధికారులు విచారించారు.

     ఛార్టెడ్ ఫ్లయిట్‌లో అక్షయ్‌ కుమార్

    ఛార్టెడ్ ఫ్లయిట్‌లో అక్షయ్‌ కుమార్

    బుధవారం ఉదయం అక్షయ్ కుమార్ ముంబై నుంచి ప్రత్యేక చార్టెడ్ ఫ్లయిట్‌లో చంఢీగడ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకొన్నారు. భారీ భద్రత మధ్య చంఢీగఢ్‌ పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లోని సెక్టర్ 9లో నేరుగా వెళ్లిపోయాడు. ఎయిర్‌పోర్టు నుంచి వచ్చేటప్పుడు మీరు కూడా నాతో రండి అని మీడియాను కోరడం గమనార్హం. ఉదయం 9.45 గంటల ప్రాంతంలో అక్షయ్ కుమార్‌ విచారణ ప్రారంభమైంది. విచారణను పూర్తిగా వీడియో చిత్రీకరించారు.

    రెండు గంటలపాటు విచారణ

    రెండు గంటలపాటు విచారణ

    అక్షయ్ కుమార్‌ను దాదాపు రెండు గంటలపాటు పోలీసులు విచారించారు. విచారణ సందర్భంగా బాదల్, డేరా బాబా మధ్య జరిగిన ఒప్పందం, వారితో సంబంధాలను సిట్ అధికారులు గుచ్చిగుచ్చి అడిగినట్టు తెలిసింది. మత ఘర్షణలు జరిగిన సందర్భంగా అక్షయ్ కుమార్ నివసించే అపార్ట్‌మెంట్‌లోనే డేరా బాబా ఉన్నారా అనే ప్రశ్నను కూడా అడిగినట్టు సమాచారం.

    రుజువులు చూపించాలని

    రుజువులు చూపించాలని

    తనపై వచ్చిన ఆరోపణలకు రుజువులు చూపించాలని పోలీసులను ప్రశ్నించినట్టు సమాచారం. ఆధారాల్లేని ఆరోపణలతో ప్రశ్నలు వేయవద్దని, తనను ప్రశ్నించవద్దని అక్షయ్ ఈ సందర్భంగా కోరినట్టు సమాచారం. తనపై వచ్చిన ఆరోపణలు ఖండించినట్టు తెలిసింది. సిక్కు మతం అంటే తనకు అత్యంత గౌరవం. దానిని అగౌరవం తెచ్చే పనులు చేయను అని పేర్కొన్నట్టు తెలిసింది.

    నవంబర్ 29న 2.O రిలీజ్

    నవంబర్ 29న 2.O రిలీజ్

    ఇదిలా ఉండగా, అక్షయ్ కుమార్ నటించిన 2.O చిత్రం నవంబర్ 29న విడుదలకు సిద్ధంగా ఉంది. వివాదాలకు ఆమడ దూరంలో ఉండే అక్షయ్ కుమార్‌పై ఆరోపణలు రావడం చర్చనీయాంశమైంది. ఈ ఆరోపణల నుంచి అక్షయ్ కుమార్ ఎలా బయటపడుతారో వేచి చూడాల్సిందేనని సినీ, రాజకీయ ప్రముఖులు అంటున్నారు.

    English summary
    Bollywood superstar Akshay Kumar was questioned by a Punjab Police special investigation team (SIT) on Wednesday. In connection with an alleged deal mediated by him between jailed Dera Sachha Sauda chief Gurmeet Ram Rahim and former Punjab Deputy Chief Minister Sukhbir Singh Badal, police sources said.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X