»   » దేముడా ..అప్పుడే 'జనతాగ్యారేజ్' పై స్ఫూఫ్,అలీని చూడండి మోహన్ లాల్ లాగ

దేముడా ..అప్పుడే 'జనతాగ్యారేజ్' పై స్ఫూఫ్,అలీని చూడండి మోహన్ లాల్ లాగ

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : బ్లాక్ బస్టర్ సినిమాలను స్ఫూఫ్ చేసే ట్రెండ్ మన సినిమాలకు ఇప్పుడు వచ్చింది కాదు..ఎప్పటినుంచో కామిడయన్స్ ఈ భాక్సాఫీస్ ఫార్ములాను వాడుతున్నారు. ముఖ్యంగా అల్లరి నరేష్ సినిమాల్లో ఈ స్ఫూఫ్ లు ఎక్కవగా కనిపిస్తున్నాయి. స్ఫూఫ్ లేనిదే ఆయన సినిమాలు ఉండటం లేదు. రీసెంట్ గా వచ్చిన సెల్ఫీ రాజా సైతం మొత్తం స్ఫూఫ్ లతో స్ఫూఫ్ రాజాగా పేరు తెచ్చుకుంది. ఇప్పుడు మరోసారి ఆయన చిత్రం ఇంట్లో దెయ్యం నాకేం భయం లో జనతాగ్యారేజ్ చిత్రం స్పూఫ్ ని చేస్తున్నారు. ఈ మేరకు షూటింగ్ జరిగింది.

ఇంట్లో దెయ్యం నాకేం భయం సినిమాలో జనతా గ్యారేజ్ కాస్త సమంత గ్యారేజ్ అయిపోయింది. మోహన్ లాల్ కాస్త భజన్ లాల్ అయిపోయాడు. భజన్ లాల్ గా అలీ తెరపై దర్శనమివ్వబోతున్నాడు. అలీ భజన్ లాల్ గెటప్ ఎలా ఉంటుందో మచ్చుకు చూపిస్తూ సెల్ఫీ తీసుకొని ఫేస్ బుక్ లో పెట్టాడు దర్శకుడు జి.నాగేశ్వరరెడ్డి. మీరు ఇక్కడ దాన్ని చూడవచ్చు. ఈ స్ఫూఫ్ తోనే ఈ సినిమాకు క్రేజ్ తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు.

 Ali as Bhajanlal in Samantha Garage

అల్లరి నరేష్ తాజా చిత్రం 'ఇంట్లో దెయ్యం.. నాకేం భయం' చిత్రం విశేషాలకు వస్తే.... అల్లరి నరేష్‌ హీరోగా జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో వచ్చిన 'సీమశాస్త్రి', 'సీమటపాకాయ్‌' చిత్రాలు హిలేరియస్‌ కామెడీతో అందర్నీ ఎంటర్‌టైన్‌ చేశాయి. 'అత్తారింటికి దారేది', 'నాన్నకు ప్రేమతో' వంటి భారీ చిత్రాలను అందించిన బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ శ్రీ వెంకటేశ్వర సినీచిత్ర ఎల్‌ఎల్‌పి పతాకంపై జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో భోగవల్లి బాపినీడు సమర్పణలో నిర్మిస్తున్న హిలేరియస్‌ ఎంటర్‌టైనర్‌ 'ఇంట్లో దెయ్యం.. నాకేం భయం'. ఈ చిత్రం షూటింగ్‌ రెండు పాటలు మినహా పూర్తయింది. వినాయక చవితి పర్వదినం సందర్భంగా ఈ చిత్రం ఫస్ట్‌ లుక్‌ను విడుదల చేస్తే మంచి రెస్పాన్స్ వచ్చింది.

నిర్మాత బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ మాట్లాడుతూ.. ''అత్తారింటికి దారేది, నాన్నకు ప్రేమతో చిత్రాల తర్వాత మా బేనర్‌లో వస్తున్న ఫుల్‌ లెంగ్త్‌ ఎంటర్‌టైనర్‌ ఇది. ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్‌తోపాటు హార్రర్‌ టచ్‌తో అందర్నీ అలరించే చిత్రంగా ఇది రూపొందుతుంది. రెండు పాటలు మినహా షూటింగ్‌ పూర్తయింది. దసరా కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నాం. మా బేనర్‌లో ఇది మరో సూపర్‌హిట్‌ సినిమా అవుతుంది'' అన్నారు.

దర్శకుడు జి.నాగేశ్వరరెడ్డి మాట్లాడుతూ.. ''అల్లరి నరేష్‌తో చేసిన సీమశాస్త్రి, సీమటపాకాయ్‌ పెద్ద హిట్‌ అయ్యాయి. ఈ చిత్రం మా కాంబినేషన్‌లో హ్యాట్రిక్‌ మూవీ అవుతుంది. ఎంటర్‌టైన్‌మెంట్‌తోపాటు హార్రర్‌ మిక్స్‌ అయిన ఫ్యామిలీ డ్రామా ఇది. భారీ చిత్రాలు నిర్మించే ఛత్రపతి ప్రసాద్‌గారి బేనర్‌లో ఓ మంచి సినిమా చేయడం చాలా సంతోషంగా వుంది'' అన్నారు.

అల్లరి నరేష్‌, రాజేంద్రప్రసాద్‌, కృతిక, మౌర్యాని, బ్రహ్మానందం, పోసాని కృష్ణమురళి, ప్రభాస్‌ శ్రీను, షకలక శంకర్‌, చమ్మక్‌ చంద్ర, చలపతిరావు, కాదంబరి కిరణ్‌, ధన్‌రాజ్‌, ప్రగతి, రజిత, అమిత్‌, టార్జాన్‌, జయవాణి, అపూర్వ, ఆజాద్‌ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి ఈ చిత్రానికి సంగీతం: సాయికార్తీక్‌, సినిమాటోగ్రఫీ: దాశరథి శివేంద్ర, ఎడిటింగ్‌: కోటగిరి వెంకటేశ్వరరావు, మాటలు: డైమండ్‌ రత్నబాబు, పాటలు: భాస్కరభట్ల, డాన్స్‌: రాజుసుందరం, గణేష్‌, దినేష్‌, ఫైట్స్‌: సుంకర రామ్‌, ఆర్ట్‌: నారాయణరెడ్డి, సమర్పణ: భోగవల్లి బాపినీడు, నిర్మాత: బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: జి.నాగేశ్వరరెడ్డి.

  English summary
  Mohan Lal's excelled performance of Malayalam actor is being spoofed in an upcoming Telugu film 'Intlo Dayyam Nakem Bayyam' (IDNB), featuring Allari Naresh in lead role. Comedian Ali will be seen playing the hilarious Mohanlal's spoof as Bhajanlal and Janatha Garage turns 'Samantha Garage' in the film
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more