»   » చెక్క గుర్రంపై పవన్ కళ్యాణ్ మోజు: అలీ ఫన్నీ కామెంట్

చెక్క గుర్రంపై పవన్ కళ్యాణ్ మోజు: అలీ ఫన్నీ కామెంట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు అత్యంత సన్నిహితులైన యాక్టర్లలో ప్రముఖ కమెడియన్ అలీ ఒకరు. పవన్ కళ్యాణ్ సినిమాలకు సంబంధించిన ఆడియో వేడుకల్లో అలీ హడావుడి మామూలుగా ఉండదు. సర్దార్ గబ్బర్ సింగ్ ఆడియో వేడుకలో కూడా పోలీస్ గెటప్, ఎర్రకడువా, తుపాకితో వచ్చి తనదైన మార్కు చూపించారు అలీ.

సర్దార్ గబ్బర్ సింగ్ ట్రైలర్


చిరంజీవి పక్కన పవన్ కళ్యాణ్ చేతులు కట్టుకుని వినయంగా కూర్చోవడంపై అలీ స్పందిస్తూ.... పవన్ ఇపుడు ఇక్డక అలా చేతులు కట్టుకొని అమాయకంగా ఉన్నాడు కానీ అబ్బో సెట్లో మాత్రం ఇరగదీశాడని పేర్కొన్నారు. దీంతో పాటు సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాపై వచ్చిన కొన్ని రూమర్లపై కూడా అలీ కామెంట్ చేసారు.


ఫోటో గ్యాలెరీ : సర్దార్ గబ్బర్ సింగ్ ఆడియో లాంచ్


సినిమాకు స్టోరీ పవన్ కళ్యాణ్‌ రాయడంతో... డైరెక్షన్లో కూడా వేలు పెట్టారని, దర్శకుడు బాబీని పక్కనబెట్టి మరీ కొన్ని అన్నీ తానే చేసాడనే రూమర్స్ నేను విన్నాను. పవన్ అనుకుంటే డైరెక్షన్ చేయగలడు... కానీ నేను యాక్టర్‌ని నా పని నేనే చేయాలి.. వేరే వాళ్ళ పనిలో వేలు పెట్టకూడదు అని బాబీని డైరెక్టర్‌గా తీసుకువచ్చి ఈ సినిమా చేయించారు అంటూ ఆ రూమర్లకు తెరదించాను అలీ. పవన్ కళ్యాణ్ తలచుకుంటే శంకర్ లాంటి డైరెక్టర్లతో సినిమాలు చేయగలడని.. కానీ 'పవర్' అనే సినిమా తీసిన బాబీని డైరెక్టరుగా చేసి 'సర్దార్' సినిమా ఇచ్చాడన్నారు.


చెక్కగుర్రం

చెక్కగుర్రం

పవన్ కళ్యాణ్‌కి చిన్న పిల్లలు ఆడుకునే చెక్క గుర్రం అంటే చాలా ఇష్టం. షూటింగ్ కోసం నిజమైన గుర్రాలు చాలా తెచ్చారు. కానీ తాను మాత్రం చెక్కగుర్రంపై ఆడుకున్నారు అని అలీ తెలిపారు.


ప్రశ్నించాను

ప్రశ్నించాను

ఈ చెక్కగుర్రంపై ఆడుకోవడం ఏంటీ అని ప్రశ్నించాను. అపుడు పవన్ నేను చిన్నప్పుడు చెక్కగుర్రంపై ఆడుకోలేదని ఇప్పుడు ఆడుకోవాలనిపిస్తుందని అన్నట్లు అలీ తెలిపారు.


ఎర్రకండువాలకు

ఎర్రకండువాలకు

గబ్బర్ సింగ్ సినిమాతో ఎర్రకండువలకు బాగా గిరాకి పెరిగిందనీ అది పవన్ పుణ్యమే అని ‘సర్ధార్' సినిమా కోసం వాడిన కండువాలకు సర్ధార్ కండువలని, సర్ధార్ టవల్స్ అని విపరీతమైన క్రేజ్ వచ్చిందని అన్నారు.


అలీ

అలీ

సర్దార్ గబ్బర్ సింగ్ ఆడియో వేడుకలో కూడా పోలీస్ గెటప్, ఎర్రకడువా, తుపాకితో వచ్చి తనదైన మార్కు చూపించారు అలీ.అలీ

అలీ

చెక్క గుర్రంపై ఆడుతూ పవన్


English summary
Ali comments about Sardar Gabbar Singh movie and Pawan Kalyan.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu