twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అలీ తన డాక్టరేట్ అంకితమిస్తున్నదెవరికంటే?

    By Bojja Kumar
    |

    హైదరాబాద్ : హాస్య నటుడు అలీకి అకాడెమీ ఆఫ్‌ యూనివర్శల్‌ గ్లోబ్‌ పీస్‌ సంస్థ గౌరవ డాక్టరేట్‌ ప్రదానం చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ నెల 25న తమిళనాడులోని కోయంబత్తూరులో అలీ ఈ డాక్టరేట్‌ అందుకోబోతున్నారు. డాక్టరేట్ వచ్చిందని తెలియగానే ఎంతో థ్రిల్ అయ్యానని, నా పేరుకు ముందు డాక్టర్ అని చెప్పుకునేందుకు ఎదురు చూస్తున్నానని వెల్లడించారు అలీ.

    నేను ఇంత ఎత్తుకు ఎదగడానికి తన తండ్రే కారణమని, ఈ డాక్టరేట్‌ను తన తండ్రికి అంకితం ఇస్తున్నట్లు అలీ ప్రకటించారు. నటుడిగా నా అనుభవంతోపాటు గత అయిదేళ్లుగా నా తండ్రి పేరున 'మహ్మద్ బాషా చారిటబుల్ ట్రస్ట్' పేరుతో స్వచ్ఛంద సేవా సంస్థను నిర్వహిస్తున్నాను. ఆ కార్యకలాపాల్నీ గుర్తించి ఈ పురస్కారం అందిస్తున్నారు''అన్నారు అలీ.

    అలీ గురించిన వివరాల్లోకి వెళితే...బాల్యం నుంచీ కష్టాల కడలిలో ఈదిన అలీ సినిమాల్లోకి రావాలనే ఆశతో చిన్నతనంలోనే మద్రాసు వెళ్లి వేషాల వేటలో భారతీరాజా దృష్టిలో పడ్డాడు. 'సీతాకోక చిలుక'లో బాల నటుడు పాత్ర లభించడంతో 1980లో సినిమా లైఫ్‌ ప్రారంభం అయింది. బాల్యం నుంచి యవ్వనంలోకి ప్రవేశించే దశలో వేషాలు దొరకక ఇబ్బందులు పడ్డారు. చిన్న చిన్న పాత్రలు ధరించారు.

    రాజేంద్రుడు గజేంద్రుడు చిత్రంలో చేటగా పాపులర్‌ అయ్యారు. అలీబాబా అరడజను దొంగలు పేరు తెచ్చింది. 'యమలీల' ద్వారా ఎస్వీ కృష్ణారెడ్డి ఇచ్చిన హీరో పాత్ర టర్నింగ్‌ పాయింట్‌ అయింది. అక్కుంబక్కుం, పిట్టలదొర, వినోదం, తొలి ప్రేమ, అమ్మయికోసం, హలో బ్రదర్‌, సందడే సందడి, అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి, ఇడియట్‌, ఆది, అమ్మాయి బాగుంది, నా అల్లుడు, హంగామా, దేశముదురు, సీమ శాస్త్రి, బొమ్మనా బ్రదర్స్‌ చందనా సిస్టర్స్‌ వంటి చిత్రాలు పేరు తెచ్చాయి.

    English summary
    "It is because of my father (Mohammad Basha) that I got actively involved in charity and service to society. He always told me that it is one's responsibility to give something back to society and, therefore, I started an NGO in his name and have been contributing to society for the last five years," Ali told.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X