»   » వెళ్లకపోతే నాకు బలుపు అనుకుంటారు, పవన్ కళ్యాణ్ పిలవలేదు: అలీ

వెళ్లకపోతే నాకు బలుపు అనుకుంటారు, పవన్ కళ్యాణ్ పిలవలేదు: అలీ

Posted By:
Subscribe to Filmibeat Telugu
Comedian Ali Revealed The Special Bond With Pawan Kalyan పవన్ నన్ను పిలవలేదు | Filmibeat Telugu

తెలుగులో ప్రస్తుతం ఉన్న వారిలో టాప్ కమెడియన్లు ఎవరు అంటే ఆ లిస్టులో తప్పకుండా ఉండే పేరు అలీ. బాల నటుడిగా కెరీర్ మొదలు పెట్టి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుని... నటుడిగా, కమెడియన్ గా, హీరోగా అనేక రకాల పాత్రలు చేసి 40 సంవత్సరాలుగా ఇండస్ట్రీలో సక్సెస్‌ఫుల్ కెరీర్ సాగిస్తున్నారు అలీ.

అక్టోబర్ 10న అలీ 49వ వసంతంలోకి అడుగు పెడుతున్నారు. ఈ సందర్భంగా ఓ ప్రముఖ టీవీ ఛానల్‌కు ఆయన ఇంటర్వూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన వారు అడిగిన ప్రశ్నలకు ఆసక్తికరంగా సమాధానాలు ఇచ్చారు. తన సినిమా కెరీర్, రాజకీయ సంబంధమైన అంశాలు, పవన్ కళ్యాణ్ తో అనుబంధం గురించి అలీ మాట్లాడారు.

ఇన్ని సినిమాలు చేస్తానని ఎప్పుడూ అనుకోలేదు

ఇన్ని సినిమాలు చేస్తానని ఎప్పుడూ అనుకోలేదు

40 ఏళ్లు నా కెరీర్ ఇలా కొనాగుతుందని, ఇన్ని సినిమాలు చేస్తానని ఎప్పుడూ అనుకోలేదని అలీ అన్నారు. ఈ జర్నీ ఎంతో బావుందని, ఇంత గొప్ప పేరు సంపాదించుకుంటానని ఎప్పుడు కలలు కనలేదని తెలిపారు.

1100లకుపైగా సినిమాలు చేశాను..

1100లకుపైగా సినిమాలు చేశాను..

ఇప్పటి వరకు తన కెరీర్లో 1100 పైగా సినిమాలు చేశానని, అందులో 1000 సినిమాలు తెలుగులో చేశానని, ఇతర భాషల్లో 100 సినిమాలు చేశానని అలీ తెలిపారు. హిందీ, తమిళం, మలయాళం, కన్నడలో సినిమాలు చేసినట్లు అలీ తెలిపారు. ఇందులో హీరోగా 52 సినిమాలు, చైల్డ్ ఆర్టిస్టుగా 300 సినిమాలు, క్యారెక్టర్ ఆర్టిస్టుగా 600 సినిమాలు చేశానని అలీ తెలిపారు.

వెళ్లకపోతే బలుపు అనుకుంటారు

వెళ్లకపోతే బలుపు అనుకుంటారు

ఈ మధ్య మీరు కమ్యూనిటీ సమావేశాలకు వెలుతున్నారు, రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉందా? అనే ప్రశ్నకు అలీ స్పందిస్తూ.... కమ్యూనిటీ పిలిచినపుడు వెళ్లకపోతే ‘అలీని మేము ఇంత ఆదరిస్తున్నాం. మేము పిలిచినపుడు రాడేంటి? బలుపా?'... అనుకుంటారు అది నాకు అవసరమా? అని అలీ వ్యాఖ్యానించారు.

నేను అందరి వాన్ని, కొందరి వాన్ని కాదు...

నేను అందరి వాన్ని, కొందరి వాన్ని కాదు...

రాజకీయాల్లోకి రావాలంటే అలా కమ్యూనిటీ సమావేశాలకు వెళితేనే అవకాశం ఉంటుంది అనుకుంటే పొరపాటే. ఒక కమ్యూనిటీ ఓటేస్తే నాయకుడు అవ్వడం జరుగదు. నేను మా కమ్యూనిటీ మాత్రమే కాదు, అన్ని చోట్లకు వెళతాను. నేను అందరి వాన్ని, కొందరి వాన్ని కాదు... అని అలీ వ్యాఖ్యానించారు.

ఐదేళ్లకోసారి వచ్చి టోపీ వేస్తారన్న మాట నిజమే...

ఐదేళ్లకోసారి వచ్చి టోపీ వేస్తారన్న మాట నిజమే...

ఇటీవల గుంటూరులో కమ్యూనిటీ సమావేశానికి వెళ్లాను. మేము టోపీ వేసుకునేది పవిత్రమైన నమాజ్ కోసం. పొలిటీషియన్స్ ఐదేళ్లకోసారి వచ్చి మాకు టోపీ వేస్తారని చెప్పాను. పొలిటీషన్స్ మీద నాకు ఉన్న అభిప్రాయాన్ని చెప్పాను. అంతే కానీ ఒక పార్టీని ఉద్దేశించి ఎప్పుడూ చెప్పలేదు అన్నారు.

పవన్ కళ్యాణ్ తో పాలిటిక్స్ మాట్లాడను

పవన్ కళ్యాణ్ తో పాలిటిక్స్ మాట్లాడను

పవన్ కళ్యాణ్ గారితో నేను ఎంత స్నేహంగా ఉన్నప్పటికీ నేను ఆయన దగ్గర పాలిటిక్స్ గురించి మాట్లాడను. ఆయన కూడా మాట్లాడరు. షూటింగులో ఉన్నంతసేపు సరదాగా ఉంటాం. ఆయన పార్టీ పెట్టినా కూడా మీరందరూ రండి, నాకు హెల్ప్ చేయండి, నేను ఇలా ఉంటాను. ఇలా చేద్దాం అనుకుంటున్నాను అని ఎవరికీ చెప్పలేదు. మంచైనా, చెడైనా నాకే ఉండాలి. నాకు సపోర్టు చేస్తున్న వారిని ఇతర పార్టీల వారు గుర్తు పెట్టుకుంటారు, తిడతారు, హింసపెడతారు, వార్నింగులు ఇస్తారు. నా గురించి మీరు బాధ పడకూడదు. నేను పిలిచినపుడు వద్దరుగానీ, ఈ ఫైట్ ఓన్లీ సోలో ఫైట్.... అదీ పవన్ కళ్యాణ్ ఆలోచన అని అలీ తెలిపారు.

అన్నయ్య విషయంలో అలా అయింది కాబట్టే..

అన్నయ్య విషయంలో అలా అయింది కాబట్టే..

ఓసారి ఇదే విషయం అడిగితే.... అన్నయ్య చిరంజీవి గారి టైమ్ లో ఆయన ఇలాంటివి చాలా చూశారట. అందుకే ఇలాంటివి వద్దనుకుంటున్నట్లు చెప్పారు. అయన పూర్తి స్థాయిలో పార్టీ పెట్టి, నేనున్నాను రండి అంటే వెళతారు. ఎన్టీ రామారావుగారు పార్టీ పెట్టినపుడు ఆయన పిలిస్తే వెళ్లారు, అభిమానంతో, గౌరవంతో వెళ్లారు. అలాగే వైఎస్ఆర్ గారు, చంద్రబాబుగారు, ఇపుడున్న కేసీఆర్ గారు పిలిస్తే వెళ్లారు అని అలీ వ్యాఖ్యానించారు.

పవన్ కళ్యాణ్ మీద రాయి వెయ్యాలనే చూస్తారు

పవన్ కళ్యాణ్ మీద రాయి వెయ్యాలనే చూస్తారు

పవన్ కళ్యాణ్‌ అంటే ప్రపంచ వ్యాప్తంగా అందరికీ తెలుసు. అలాంటి వ్యక్తి గురించి ఓ రాయి వేస్తే అదో వివాదం అవుతుంది. ఆయన గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడితే ఫ్యాన్స్ రియాక్ట్ అవ్వడంలో తప్పేమీ లేదని అలీ వ్యాఖ్యానించారు.

సూసైడ్ ప్రయత్నం ఎప్పుడూ చేయలేదు

సూసైడ్ ప్రయత్నం ఎప్పుడూ చేయలేదు

నాకు ఇద్దరు అక్కలు, ఇద్దరు చెల్లెలు. ఇద్దరక్కలకి నాన్న పెళ్లి చేశాడు. ఇద్దరు చెల్లెళ్లకి నేను పెళ్లి చేయాలని గోల్ పెట్టుకుని ఇండస్ట్రీకి వెళ్లాను. నేను హీరో అవుతానని, కోట్లు సంపాదించాలని ఎప్పుడూ లేదు. కమెడియన్ రాజబాబుగారు నా ఇన్స్‌స్పిరేషన్. సీతాకోక చిలుకలో బాబాయ్ అనే క్యారెక్టర్ చేశాను. ఆ క్యారెక్టర్ గురించి పదేళ్లదాకా ఎవరూ మరిచిపోలేదు. ఆ టైమ్ లో డైరెక్టర్లకు కూడా నాకు ఏం క్యారెక్టర్ ఇవ్వాలని తెలియదు. ప్రతి ఆర్టిస్టుకు గ్యాప్ వస్తుంది. నేను అలా వెయిట్ చేశాను. రూము రెంటు కట్టుకోలేక బాధ పడటం, మెస్ బిల్లు కట్టుకోలేక బాధ పడటం లాంటివి తప్ప సూసైడ్ అటెమ్ట్ చేద్దాం...... లాంటి డిప్రెషన్లో ఎప్పుడూ లేదు, రాలేదు అని అలీ తెలిపారు.

రేణు దేశాయ్ సెకండ్ మ్యారేజ్ గురించి...

రేణు దేశాయ్ సెకండ్ మ్యారేజ్ గురించి...

రేణు దేశాయ్ సెకండ్ మ్యారేజ్ చేసుకోవాలని ఉందనే ఆలోచనపై ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతోంది. దీని గురించి అలీని ప్రశ్నించగా... ఆమె ఏం మాట్లాడింతో తనకు తెలియదని, నో కామెంట్ అన్నారు అలీ.

English summary
Comedian Ali revealed the special bond he shares with Pawan Kalyan, whether he plans to campaign for Jana Sena in 2019, his opinion on Renu Desai's second marriage and his rumoured suicide attempt.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu