»   » ఒప్పుకుంటుందా. : మహేష్ బాబు కి జోడీగా ముంబై భామ

ఒప్పుకుంటుందా. : మహేష్ బాబు కి జోడీగా ముంబై భామ

Posted By:
Subscribe to Filmibeat Telugu

బాలీవుడ్ హీరోయిన్లంటే మహేష్ బాబు కి ఇంట్రస్ట్ కాస్త ఎక్కువే . అతడి తొలి సినిమా హీరోయిన్ ప్రీతి జింతా . ఆ తర్వాత టక్కరి దొంగ సినిమాలో ఇద్దరు బాలీవుడ్ బ్యూటీలు లిసారే - బిపాసా బసులతో రొమాన్స్ చేశాడు ప్రిన్స్. ఆపై నాని లో అమీషా పటేల్ తో నూ అతిథి లో అమృతారావుతో నటించాడు.

ఇక ఆ తర్వాత మళ్లీ బాలీవుడ్ భామలతో నటించే అవకాశం రాలేదు మహేష్ బాబుకి. మళ్లీ ఇప్పుడు ప్రిన్స్ ఓ ముంబయి భామతో జత కట్టనున్నట్టు సమాచారం.

మురుగదాస్ తో మహేష్ సినిమా నిర్ణయం అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాని ఎన్వీ ప్రసాద్, ఠాగూర్ మధు సంయుక్తంగా నిర్మిస్తున్న విషయం కూడా విదితమే. 80 కోట్ల బడ్జెట్ తో భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ చిత్రం మహేష్ కెరీర్లో భారీ బడ్జెట్ సినిమా అయ్యే అవకాశం ఉంది. చిత్రానికి హీరోయిన్ గా బాలీవుడ్ తార ఆలియా భట్ ను ఎంపిక చేసినట్లు టాక్.

Alia as Heroine in Mahesh'snext movie

ఈ సినిమా కోసం శ్రుతి హాసన్ హీరోయిన్ అని ఇంతకుముందు ప్రచారం జరిగింది. మళ్ళీ ఏమైందో కానీ ఆలియా పేరు తెర పైకి వచ్చింది. మరి ఆలియా, శ్రుతి క్యారెక్టరే చేస్తుందా. లేక రెండో హీరోయిన్ గా నటిస్తుందా అన్నది తెలియాల్సి ఉంది. ప్రస్తుతానికైతే ఓ మాంచి రెమ్యూనరేషన్ ఫిగర్ చెప్పి.అమ్మడికి సౌత్ కు రారమ్మంటున్నారట.

అయినా మహేష్ లాంటి హీరో పక్కన సౌత్ లో ఎంట్రీ ఇచ్చే అవకాశాన్ని ఏ అమ్మాయైనా ఎందుకు వదులుకుంటుంది చెప్పండి. కాబట్టి మహేష్-ఆలియా కాంబినేషన్ కు ఫిక్స్ అయిపోవచ్చు..

English summary
Mahesh Babu Team Up with Alia Bhatt For Murugadoss New Project
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu