»   » అక్కినేని బుడ్డోడు అఖిల్ పరువు పోయినట్లయింది!

అక్కినేని బుడ్డోడు అఖిల్ పరువు పోయినట్లయింది!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : ఇప్పుడు అందరీ దృష్టీ నాగార్జున తనయుడు అక్కినేని అఖిల్ ఎంట్రీ చిత్రంపై ఉంది. ఏ తరహా చిత్రం చేయబోతున్నాడు...ఏ దర్శకుడు డైరక్ట్ చేస్తాడు..అతని సరసన చేసే హీరోయిన్ ఎవరూ..బ్యానర్ ఏది అనే అంశాలపై ఓ రేంజిలో సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అందిన సమాచారం ప్రకారం...అఖిల్ తొలి చిత్రాన్ని వైజయంతి బ్యానర్ పై అశ్వనీదత్ నిర్మించనున్నారు. గతంలో ఆయన బ్యానర్ పై లాంచ్ అయిన హీరోలంతా నెంబర్ వన్ పొజీషన్ లో ఉండటంతో సెంటిమెంటు పరంగా కలిసొస్తుందని ఈ నిర్ణయం నాగార్జున తీసుకున్నారని తెలుస్తోంది.

కాగా...అఖిల్ సరసన హీరోయిన్‌గా బాలీవుడ్ బ్యూటీ కుర్ర హీరోయిన్ అలియా భట్ ఎంపికైనట్లు వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలపై అలియా స్పందించారు. అసలు అక్కినేని అఖిల్ ఎవరో కూడా నాకు తెలియదు అంటూ స్టేట్మెంట్ ఇచ్చేసింది. మ్మ. ఇలాంటి పుకార్లతో తన పేరును జోడించద్దని మీడియాని కోరింది అలియా భట్. పాపం అఖిల్ సరసన అలియా అనే వార్తలు ఎలా మొదలయ్యాయో తెలియదు కానీ...అలియా స్టేట్మెంట్‌తో అఖిల్ పరువు పోయినట్లయింది.

Alia Bhatt Shocking Comments On Akhil

కాగా...ఇటీవల విడుదలైన 'మనం'లో తళుక్కున మెరిశాడు అఖిల్‌. ఆయన తెరపై కనిపించిన విధానం అభిమానులకే కాకుండా పరిశ్రమను సైతం విపరీతంగా ఆకట్టుకుంది. ప్రముఖ కథానాయకుడు మహేష్‌బాబు సైతం భవిష్యత్‌లో ఓ మంచి స్టార్‌గా అవతరిస్తాడని అఖిల్‌ని మెచ్చుకొన్నారు. తాజాగా అఖిల్‌ కథానాయకుడిగా తెరంగేట్రం చేయబోయే సినిమాకి సంబంధించి ప్రయత్నాలు వూపందుకొన్నట్టు తెలుస్తోంది. అఖిల్‌ ట్విట్టర్‌ ద్వారా అభిప్రాయ సేకరణ చేపట్టారు.'తాను ఎలాంటి కథలో నటిస్తే బాగుంటుందో సలహా ఇవ్వండ'ని ట్వీట్‌ చేసి అడిగారు. రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌లో నటిస్తే బాగుంటుందని కొందరంటే, యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌లో నటిస్తే బాగుంటుందని మరికొందరు తమ అభిప్రాయాన్ని చెప్పారు. ఇప్పటికే అఖిల్‌ రెండు మూడు కథల్ని ఎంపిక చేసుకొన్నారని సమాచారం.

English summary
Alia Bhatt said 'I really don't know Akhil. I am hearing that name for the first time'.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu