Just In
- 1 hr ago
‘వకీల్ సాబ్’ నుంచి సర్ప్రైజింగ్ న్యూస్: ఇందులో పవన్ కల్యాణ్ అలా కనిపిస్తాడట
- 3 hrs ago
ఆ సాంగ్ వింటే మూడు బ్రేకప్స్ గుర్తుకు వచ్చాయట.. నవీన్ పొలిశెట్టి నిజంగా ‘జాతి రత్నం’!
- 3 hrs ago
రాజేంద్ర ప్రసాద్‌కు మోడీ పేరు ఎందుకు పెట్టామంటే.. క్లైమాక్స్‌పై దర్శకుడు భవానీ శంకర్ క్లారిటీ
- 4 hrs ago
చెర్రీ కోసం అడవుల బాట పట్టిన ఉపాసన.. మెగా కోడలి పిక్స్ వైరల్
Don't Miss!
- News
కోవాగ్జిన్ మూడో దశ ఫలితాలు: 81శాతం సామర్థ్యమని భారత్ బయోటెక్ వెల్లడి
- Finance
శుభవార్త, భారీగా తగ్గిన బంగారం ధర, రూ.45,000 దిగువకు..! వెండి రూ.1500 డౌన్
- Sports
బీసీసీఐ ఫిట్నెస్ టెస్ట్ విఫలమైన రాహుల్ తెవాటియా.. ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌కు డౌటే!
- Automobiles
మెర్సిడెస్ బెంజ్ లగ్జరీ కార్ కొనుగోలు చేసిన సినీ నటి భావన
- Lifestyle
బెడ్ రూమ్ లో ఈ లోదుస్తులుంటే... రొమాన్స్ లో ఈజీగా రెచ్చిపోవచ్చని తెలుసా...
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
RRR యూనిట్‌కు భారీ షాకిచ్చిన నటి: కొత్త రిలీజ్ డేట్‌ను అలా లీక్ చేసింది.. డిలీట్ చేసే లోపే పట్టేశారుగా!
ప్రపంచమే మెచ్చిన దర్శకుడు.. ఇద్దరు టాప్ హీరోలు.. చరిత్రలోనే భారీ బడ్జెట్.. హై టెక్నికల్ వ్యాల్యూస్.. ఇదంతా ఒకే చోట ఉంటే అదే RRR (రౌద్రం రణం రుధిరం) సినిమా. తెలుగు సినీ ఇండస్ట్రీలోనే ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న చిత్రమిది. దాదాపు రెండేళ్లుగా షూటింగ్ జరుపుకుంటోన్న ఈ సినిమాపై దేశ వ్యాప్తంగా భారీ అంచనాలే ఉన్నాయి. వాస్తవానికి ఎప్పుడో రిలీజ్ కావాల్సి ఉన్నా.. అనివార్య కారణాల వల్ల ఇది వాయిదా పడుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడా అని అంతా వేచి చూస్తుండగా.. ఓ నటి ఆ తేదీని రివీల్ చేసింది. ఆ వివరాలు మీకోసం!

రియల్ హీరోలుగా మారిన టాలీవుడ్ స్టార్స్
రాజమౌళి దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటిస్తోన్న చిత్రమే RRR (రౌద్రం రణం రుధిరం). విప్లవ వీరులు అల్లూరి సీతారామరాజు, కొమరం భీం జీవిత కథల ఆధారంగా తెరకెక్కుతోంది. ఇందులో చరణ్.. అల్లూరి గానూ, తారక్.. భీంగానూ నటిస్తున్నారు. ఐదు భాషల్లో రాబోతున్న ఈ భారీ సినిమాను డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. కీరవాణి సంగీతం ఇస్తున్నారు.

రెండేళ్లు కంప్లీట్.. ఇటీవలే మొదలెట్టారుగా
ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈ సినిమా రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభమై దాదాపు రెండేళ్లకు పైగానే అవుతోంది. అయినప్పటికీ పలుమార్లు ఆటంకం ఏర్పడడం వల్ల ఈ మూవీ షూటింగ్ ఇంకా పూర్తవలేదు. అంతేందుకు ఎంతో ముఖ్యమైన కాంబినేషన్ సీన్స్‌తో పాటు ప్రీక్లైమాక్స్, క్లైమాక్స్ సీన్స్, ఇంటర్వెల్ బ్యాంగ్ కూడా చిత్రీకరించలేదు. వీటిలో ఇటీవలే క్లైమాక్స్ సీన్ షూటింగ్ మొదలైంది.

రెండు వీడియోలు.. లెక్కలేనన్ని రికార్డులు
భారీ చిత్రం కావడంతో RRR (రౌద్రం రణం రుధిరం)పై ఎన్నో అంచనాలు ఉన్నాయి. వాటికి అనుగుణంగానే చిత్ర యూనిట్ సస్పెన్స్ కొనసాగిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో మొదటిగా టైటిల్ మోషన్ పోస్టర్ రిలీజ్ అయింది. దీనికి మంచి స్పందన వచ్చింది. ఆ తర్వాత రామ్ చరణ్ ‘భీం ఫర్ రామరాజు', ఎన్టీఆర్ ‘రామరాజు ఫర్ భీం' విడుదలయ్యాయి. ఈ రెండూ రికార్డులు క్రియేట్ చేశాయి.

ప్లాన్స్ మార్చేసిన మహమ్మారి.... వాళ్లంతా
కరోనా మహమ్మారి అన్ని రంగాలను అతలాకుతలం చేసింది. మరీ ముఖ్యంగా సినీ పరిశ్రమపై ఇది తీవ్ర ప్రభావాన్ని చూపించింది. సినిమా షూటింగులు ఆగిపోవడం.. థియేటర్లు మూతపడడంతో ఎంతో నష్టం వాటిల్లింది. ఇది RRR మూవీపై భారీగా పడిందనే చెప్పాలి. దీనికితోడు, రాజమౌళి, ఆయన కుటుంబ సభ్యులతో పాటు ఇటీవల చిత్ర హీరో రామ్ చరణ్‌కు కూడా పాజిటివ్ వచ్చింది.

రెండు సార్లు వాయిదా పడిన RRR రిలీజ్
వాస్తవానికి RRRను జూలై 30, 2020న విడుదల చేస్తామని చిత్ర యూనిట్ షూటింగ్ ప్రారంభించే సమయంలోనే ప్రకటించింది. కానీ, అనుకున్న తేదీకి చిత్రీకరణ పూర్తి కాకపోవడంతో జనవరి 8, 2021న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని ప్రకటించారు. కానీ, ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఎదురైంది. దీంతో కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడై ఉంటుందా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

RRR యూనిట్‌కు భారీ షాకిచ్చిన లేడీ స్కాట్
ఈ సినిమాలో లేడీ స్కాట్‌గా చేస్తున్నారు హాలీవుడ్ నటి అలీసన్ డూడీ. తాజాగా ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో RRR అనే అకౌంట్‌ను జత చేస్తూ రిలీజ్ డేట్ అక్టోబర్ 8 అని అందులో రాసుకొచ్చింది. చేసిన పొరపాటును వెంటనే గ్రహించిన అలీసన్ డూడీ.. ఆ పోస్టును డిలీట్ చేసేసింది. అయితే, మనవాళ్లు మాత్రం అప్పటికే ఆ స్క్రిన్ షాట్స్ తీసి ఇంటర్నెట్‌లో వైరల్ చేసేశారు.