»   » కాటమరాయుడి పై కేసు, రెండువారాల బహిష్కరణ, నిర్మాతల అత్యాశపై ప్రేక్షకుడి తిరుగుబాటు

కాటమరాయుడి పై కేసు, రెండువారాల బహిష్కరణ, నిర్మాతల అత్యాశపై ప్రేక్షకుడి తిరుగుబాటు

Posted By:
Subscribe to Filmibeat Telugu

కాటమరాయుడు సినిమా టికెట్ల ధర పెంపుపై అఖిల భారత సినీ ప్రేక్షకుల వినియోగదారుల సంఘం తీవ్రంగా స్పందించింది. కేవలం వంద కోట్ల క్లబ్ లో చేరాలన్న ఆశతోనే సినిమాను సామాన్యులకు దూరం చేస్తున్నారని ఆరోపించింది. అవును మీరు చదువుతున్నది నిజం. త్వరలో విడుదల కాబోయే పవన్ చిత్రం కాటమరాయుడు నిర్మాతలు ఈ చిత్రం టికెట్లను అమాంతం పెంచేయడానికి సిద్ధం అవుతున్నారట.ఈ నేపథ్యంలో అఖిల భారత సినీ ప్రేక్షకుల వినియోగదారుల సంఘం స్పందించింది. 'కాటమరాయుడు' టికెట్ల ధరల్ని పెంచి అమ్మితే ఊరుకునేది లేదని హెచ్చరించింది.

పవన్ కళ్యాణ్, టీ శృతి హాసన్

పవన్ కళ్యాణ్, టీ శృతి హాసన్

పవన్ కళ్యాణ్, టీ శృతి హాసన్ ప్రధాన పాత్రలలో తెరకెక్కిన మోస్ట్ ఎవైటెడ్ డ్రామా చిత్రం కాటమరాయుడు. ఈ చిత్రం మార్చి 24న రికార్డ్ నంబర్ ఆఫ్ థియేటర్స్ లో విడుదల కానుంది. కేవలం తెలుగు రాష్ట్రాలలోనే కాక తమిళ నాడు, కేరళ రాష్ట్రాలలోను ఈ చిత్ర రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నారు.

ఇప్పటికే ఈ చిత్రానికి

ఇప్పటికే ఈ చిత్రానికి

ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి అడ్వాన్స్ బుకింగ్ మొదలు కాగా, టిక్కెట్స్ హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయని తెలుస్తుంది. అయితే కాటమరాయుడు క్రేజ్ ని క్యాష్ చేసుకోవాలని భావిస్తున్న చిత్ర మేకర్స్, డిస్ట్రిబ్యూటర్స్ టిక్కెట్ ప్రైస్ ని పెంచి తొలి రెండు రోజుల కలెక్షన్స్ లో రికార్డు బ్రేక్ చేయాలని భావిస్తున్నారట.

ఈ క్రమంలో పది రూపాయల

ఈ క్రమంలో పది రూపాయల

ఈ క్రమంలో పది రూపాయల టిక్కెట్ ని రూ.50, రూ.50ల టిక్కెట్ ని రూ. 200కి, రూ.150ల టిక్కెట్ ని రూ.500గా అమ్మాలని భావిస్తున్నారట. దీంతో తొలి రెండు రోజుల్లో 30 కోట్ల కలెక్షన్స్ సంపాదించడం ఖాయమని నిర్మాతలు ఓ అంచనాకు వచ్చారట.ఈ లెక్క ప్రకారం చూసుకుంటే కాటమరాయుడు సినిమా సామాన్యుడికి దూరమయినట్టే.

కాటమరాయుడు సినిమా

కాటమరాయుడు సినిమా

కాటమరాయుడు సినిమా టికెట్ల ధర పెంపుపై అఖిల భారత సినీ ప్రేక్షకుల వినియోగదారుల సంఘం తీవ్రంగా స్పందించింది. కోర్టులో కేసు వేసేందుకు కూడా వారు సిద్దమయ్యారట. రెండు వారాల పాటు ఈ సినిమాను బహిష్కరించాలని కూడా వారు పిలుపునిచ్చారు.

వినియోగదారుల సంఘం

వినియోగదారుల సంఘం

వినియోగదారుల సంఘం ఈ విషయంలో చిత్ర నిర్మాతతో ఫైట్ చేసేందుకు కూడా సిద్ధమయినట్టు సమాచారం. పెద్ద హీరోల సినిమాలు వచ్చినపుడు బ్లాక్ టికెట్ మాఫియా రంగంలోకి దిగడం.. ఇష్టానుసారం టికెట్ల రేట్లు పెంచి అమ్ముకోవడం మామూలైపోయింది. ఈ ఏడాది వేసవి సందడి తెర తీయబోతున్న ‘కాటమరాయుడు' విషయంలో టికెట్ల దందా కొంచెం పెద్ద స్థాయిలోనే ఉంటుందని భావిస్తున్నారు.

చాన్నాళ్ల పాటు థియేటర్లు

చాన్నాళ్ల పాటు థియేటర్లు

చాన్నాళ్ల పాటు థియేటర్లు కళ తప్పిన నేపథ్యంలో లేక లేక ఒక పెద్ద సినిమా వస్తుండటంతో టికెట్ల రేట్లను పెంచి అమ్ముకోవడానికి ఎగ్జిబిటర్లు ప్రయత్నించే అవకాశం ఉందని వార్తలొస్తున్నాయి.ఇక కాటమరాయుడు బెనిఫిట్ షోస్ టిక్కెట్స్ 2000 నుండి రూ.10000 వరకు అమ్మకం జరుగుతున్నట్టు తెలుస్తుంది. మరి ఈ విషయంపై చిత్ర యూనిట్ ఎలా స్పందిస్తుందో చూడాలి.

English summary
All India Cine Goers Association today took serious exception to the huge hike in the rates of the tickets of Pawan Kalyan-starrer Katamarayudu
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu