»   » సెటైర్ అంటే అలా ఉండాలి... జక్కన్న ఇచ్చిన బాలీవుడ్ పంచ్

సెటైర్ అంటే అలా ఉండాలి... జక్కన్న ఇచ్చిన బాలీవుడ్ పంచ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

'బాహుబలి  2' పట్ల అన్ని వర్గాల ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. ముఖ్యంగా బాలీవుడ్ ప్రేక్షకులు తెలుగు ఆడియన్స్ తో సమానంగా ఈ సినిమా కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. మొన్నీ మధ్య నిర్వహించిన సర్వేలో కూడా అన్ని బాలీవుడ్ సినిమాల్ని పక్కకు నెట్టి ప్రేక్షకులు ఎక్కువగా ఎదురు చూస్తున్న సినిమాల జాబితాలో బాహుబలి మొదటి స్థానంలో నిలవడమే ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం.

ఓ సౌత్ సినిమాపై ఎందుకు ఇంట్రెస్ట్

ఓ సౌత్ సినిమాపై ఎందుకు ఇంట్రెస్ట్

బాహుబలి ది బిగినింగ్ సినిమాను బాలీవుడ్ స్టార్ డైరక్టర్ అండ్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ టేకప్ చేసినప్పుడు అంతా షాకయ్యారు. హిందీలో ఎంతో క్రేజ్ పెట్టుకున్న కరణ్.. ఓ సౌత్ సినిమాపై ఎందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడని అంతా ఆరాలు తీశారు. కానీ బాలీవుడ్ లో బాహుబలి విడుదలైన తర్వాత కరణ్ ఎందుకు ఆ ప్రాజెక్టులోకి ఎంటరయ్యాడో అందరికీ అర్థమైపోయింది.


బాహుబలి షాక్ కు గురిచేసింది

బాహుబలి షాక్ కు గురిచేసింది

అవును.. బాలీవుడ్ ప్రేక్షకుల్నే కాదు.. బాలీవుడ్ ప్రముఖుల్ని కూడా బాహుబలి షాక్ కు గురిచేసింది. అంతర్జాతీయ స్థాయిలో తెరకెక్కిన గ్రాఫిక్స్, అద్భుతమైన కథనాన్ని చూసి సల్మాన్ లాంటి హీరో సైతం ఫిదా అయిపోయాడు. ఓపెన్ గా మీడియా ముందుకొచ్చి బాహుబలి టీంను మెచ్చుకున్నాడు


ఏ బాలీవుడ్ హీరోకీ ధైర్యం సరిపోవటం లేదు

ఏ బాలీవుడ్ హీరోకీ ధైర్యం సరిపోవటం లేదు

ప్రేక్షకుల్లో ఉన్న ఈ క్రేజ్ ను గుర్తించే బాలీవుడ్ డిస్ట్రిబ్యూటర్లు కూడా ముందుగా అనుకున్న థియేటర్ల సంఖ్యను ఇప్పుడు రెట్టింపు చేసుకునే ప్రయత్నాల్లో ఉన్నారట. అలాగే ఏప్రిల్ 28న ఈ సినిమాకు పోటీగా మరే హిందీ సినిమా రిలీజ్ కాకపోవడం మరో విశేషం. బాహుబలి క్రేజ్ ఎలా ఉందో చూసాక అమరేంద్ర బాహుబలి తో పోటీ పడటానికి ఏ బాలీవుడ్ హీరోకీ ధైర్యం సరిపోవటం లేదు.


ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు,

ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు,

ఇప్పటిదాకా ఏ తెలుగు సినిమాకు బాలీవుడ్ లో ఇంతటి ప్రాధాన్యత దక్కలేదని నిస్సందేహంగా చెప్పొచ్చు. ఇకపోతే దాదాపు షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు, విఎఫ్ఎక్స్ పనులు జరుపుకుంటోంది.


దిమ్మతిరిగే పంచ్

దిమ్మతిరిగే పంచ్

గతంలో బాలీవుడ్ లో బాహుబలి ప్రమోషన్స్ కి లాంగ్వేజ్ ప్రాబ్లం ని ఎదుర్కొన్న ఈ టీం...ఈసారి బాగానే పికప్ అయిందని చెప్పవచ్చు. రిపోర్టర్స్ అడుగుతున్న ప్రశ్నలకి కాస్త దూకుడుగానే దర్శకుడు రాజమౌళి సమాధానం చెప్పాడట పనిలో పనిగా దక్షిణాది సినిమా అంటే చిన్న చూపు ఉన్న బాలీవుడ్ కి మంచి దిమ్మతిరిగే పంచ్ కూడా ఇచ్చాడట..


బాలీవుడ్ ఆసక్తిగా ఎదురు చూస్తోంది

బాలీవుడ్ ఆసక్తిగా ఎదురు చూస్తోంది

ఇప్పుడు కూడా మళ్ళీ బాహిబలి రేపేసునామీ కోసం బాలీవుడ్ ఆసక్తిగా ఎదురు చూస్తోంది. ప్రమోషన్ లో భాగంగా ముంబైలో ఉన్న రాజమౌళి పలు పర్తికలకు ఇంటర్వ్యూలు ఇచ్చాడు అయితే ఇప్పుడు తెలిసిన విషయం మాత్రం కెమెరా ముందు కాక మామూలుగా చెప్పాడట రాజమౌళి..ఇంతకీ మనోడు ఏమన్నాడు అంటే....


తెలుగు సినిమాకి ఆ సత్తా ఉంది

తెలుగు సినిమాకి ఆ సత్తా ఉంది

షారుఖ్ రాయిస్ రికార్డ్ ని‘బాహుబలి - ది కంక్లూజన్' ట్రైలర్ బ్రేక్ చేసింది. ఫీలింగ్ ఎలా ఉంది? అనేది రిపోర్టర్ క్వశ్ఛన్. "ఇది ముందే తెలుసు. తెలుగు సినిమాకి ఆ సత్తా ఉంది. ప్యూచర్ ఇండస్ట్రీ సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ" అంటూ కామెంట్ చేయటంతో రిపోర్టర్ తో పాటు అక్కడ ఉన్నవారూ కూడ షాక్ అయ్యారంట. మొత్తంగా రాజమౌళి బాలీవుడ్ ఈవెంట్ కి అడుగుపెట్టడటంతోటే బాలీవుడ్ లో సినిమా పబ్లిసిటీ ఎలాచేయాలో, కాంట్రవర్సీలని ఎలా క్యాష్ చేసుకొని బిజినెస్ చేయాలో బాగానే కాచ్ చేసాడన్నమాట రాజమౌళి


English summary
All movie industry eyes in India this weekend will be turned not to Bollywood, but to Hyderabad and the release of Telugu-language epic action Baahubali. The picture is not only the biggest budget Indian film of all time, weighing in at some $40 million for two-parts, it is also shaping up to be one of the biggest movie events the country has seen in years.”
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu