త్వరలో ‘కబాలి 2’ కూడా: నిర్మాత ప్రకటనతో సినీ వర్గాల్లో హడల్
హైదరాబాద్: తమిళ అభిమానులు, తమిళ సినీ ప్రేక్షకుల అభిప్రాయం ఏమో గానీ.... తెలుగులో మాత్రం రజనీకాంత్ 'కబాలి' చిత్రానికి బిలో యావరేజ్ మార్కులే పడ్డాయి. ఈ సినిమా చూసిన వారిలో ఎక్కువ మంది నుండి అసంతృప్తే వ్యక్తం అయింది.
భారీ అంచనాలతో వచ్చిన 'కబాలి' అంచనాలను ఏమాత్రం అందుకోలేక చతికిలపడింది. అయితే కబాలి నిర్మాత కలైపులి ఎస్.థాను తన తాజా ప్రకటనలో 'కబాలి' సినిమాకు సీక్వెల్ కూడా తీయబోతున్నట్లు ప్రకటించడం చర్చనీయాంశం అయింది. ఈ విషయం విన్న వెంటనే సినీ వర్గాలు కాస్త హడలిపోయాయి.

తాజాగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో దర్శకుడు పా రంజిత్, నిర్మాత కలైపులి ఎస్ థాను స్పందించారు. కబాలి' సినిమా ముగింపు అసంపూర్ణంగా ఉందంటూ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ అభిప్రాయ పడుతున్న తరుణంలో సినిమా సీక్వెల్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు తెలిపారు.
అయితే సీక్వెల్ తీస్తే తీయండి కానీ... ఈ సారైన అభిమానులు ప్రేక్షకులు మెచ్చేలా సినిమా తీయాలని కోరుకుంటున్నారు. 'కబాలి' సినిమా తొలి భాగం ఓ మెస్తరుగా ఉన్నా... రెండో భాగం మాత్రం ప్రేక్షకులకు విసుగుతెప్పించే విధంగా ఉందని, సీక్వెల్ విషయంలో అలా చేసి మళ్లీ ప్రేక్షకులను అసంతృప్తి వ్యక్తం చేయొద్దని వేడుకుంటున్నారు.


Click it and Unblock the Notifications











