»   » ప్రాణ్... ఆల్ టైం బెస్ట్ మూవీస్ (ఫోటో ఫీచర్)

ప్రాణ్... ఆల్ టైం బెస్ట్ మూవీస్ (ఫోటో ఫీచర్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై : బాలీవడ్ లెజండరీ యాక్టర్ ప్రాణ్ శుక్రవారం ముంబైలోని లీలావతి ఆసుపత్రిలో అనారోగ్యంతో చికిత్స పొందుతూ మరణించారు. ప్రస్తుతం ఆయన వయసు 93 సంవత్సరాలు. దాదాపు 400లకు పైగా చిత్రాల్లో నటించిన ప్రాణ్ విలన్ పాత్రల్లో, బ్యాడ్ మ్యాన్ పాత్రల్లో నటించిన తనదైన శైలిలో పాత్రలకు జీవం పోసారు.

ప్రాణ్ బ్రిటిష్ ఇండియాలోని లాహోర్‌(ప్రస్తుతం పాకిస్తాన్ లో ఉంది)లో ధనవంతుల కుటుంబంలో ఫిబ్రవరి 12, 1920లో జన్మించారు. 1945లో శుక్లాను పెళ్లాడిన ఆయన దేశ విభజన తర్వాత లాహోర్ నుంచి ముంబైకి షిప్ట్ అయ్యారు. ఆ తర్వాత వీరికి ఇద్దరు కొడుకులు అరవింద్, సునీల్, కూతురు పింకీ జన్మించారు.

బాలీవుడ్లో హీరోగా కెరీర్ ప్రారంభించినప్పటికీ....విలన్ పాత్రలతో పాపులర్ అయ్యారు. 1940-47 మధ్యలో ఆయన పలు చిత్రాల్లో హీరోగా నటించారు. 1942-1991 మధ్య వచ్చిన చిత్రాల్లో విలన్ పాత్రలు పోషించారు. ఆ తర్వాత ఆయన సపోర్టింగ్ రోల్స్ చేయడం ప్రారంభించారు.

స్లైడ్ షోలో మరిన్ని వివరాలు...

1958లో విడుదలైన ‘మధుమతి' చిత్రానికి బిమల్ రాయ్ దర్శకత్వం వహించారు. ఈచిత్రానికి రచన రిథ్విక్ ఘటక్, రాజేందర్ సింగ్ బేడి. ఈ చిత్రంలో ప్రాణ్ ఒక క్రూరమైన, పొగరుబోతు క్యారెక్టర్ తనదైన శైలిలో పోషించారు. ఈచిత్రంలో ఆయన రాజా ఉగ్రనారాయణ్‌గా కనిపించారు.

1962లో కిషోర్ కుమార్, మధుబాల, హెలెన్, ప్రాణ్ ప్రధాన పాత్ర ధారులుగా రూపొందిన బాలీవుడ్ క్లాసిక్ చిత్రం ‘హాఫ్ టికెట్'. కాలిదాసు ఈచిత్రానికి దర్శకత్వం వహించారు.ఈ చిత్రంలో ప్రాణ్ సంచలనాత్మక దొంగ పాత్రలో నటించారు. ఇందులో ఆయన పాత్రపేరు రాజాబాబు అలియాస్ చాచా.

మనోజ్ కుమార్ దర్శకత్వంలో 1967లో వచ్చిన చిత్రం ఉప్‌కార్. మనోజ్ కుమార్, ఆశా పారెక్, ప్రేమ్ చోప్రా ముఖ్య తారాగణం. ఆసక్తికరంగా ఈ చిత్రంలో ప్రాణ్ పాజిటివ్ పాత్రలో నటించారు. ఈ చిత్రంలో ఆయన ఓ రైతు పాత్రలో నటించి మంచి మార్కులు కొట్టేసాడు.

అమితాబ్ బచ్చన్ హీరోగా నటించిన బాలీవుడ్ హిట్ మూవీ ‘జంజీర్'. చిత్రంలో ప్రాణ్ షేర్ ఖాన్ పాత్రలో నటించారు. ఈ చిత్రంలో ప్రాణ్ పోషిచిన పాత్రకు మంచి పేరొచ్చింది. ప్రస్తుతం ఈచిత్రానికి రీమేక్ గా రూపొందిన జంజర్ లో షేర్ ఖాన్ పాత్రను సంజయ్ దత్ పోషించారు.

మన్మోహన్ దేశాయ్ దర్శకత్వంలో వచ్చిన బాలీవుడ్ మల్టీస్టారర్ మూవీ ‘అమర్ అక్బర్ ఆంటోనీ'. అమితాబ్ బచ్చన్, వినోద్ ఖన్నా, రిషి కపూర్, పర్వీన్ బాబి, నీతు సింగ్, షబానా అజ్మి ముఖ్య పాత్రల్లో నటించారు. ఈచిత్రంలో ముగ్గురు హీరోల తండ్రి పాత్రలో నటించాడు.

1988లో వచ్చిన సూపర్ హీరో మూవీ ‘షెహన్‌షా'. తిను ఆనందన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా...అమితాబ్ బచ్చన్, జయా బాదురి, మీనాక్షి షేహాద్రి లీడ్ రోల్స్ పోషించారు. ఈ చిత్రంలో ప్రాణ్ నిజాయితీగల దొంగ పాత్రలో నటించారు. ఈ చితక్రంలో ఆయన పాత్ర పేరు అస్లామ్ ఖాన్.

English summary
Legendary actor Pran Kishan Sikand, who is popularly known by the name Pran, passed away at the Lilavati Hospital on Friday evening (July 12) following prolonged illness. He was 93.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu