»   » అల్లరి నరేష్ 'ఆకాశ రామన్న' చిత్రం ఏమైంది?

అల్లరి నరేష్ 'ఆకాశ రామన్న' చిత్రం ఏమైంది?

Posted By:
Subscribe to Filmibeat Telugu

అల్లరి నరేష్‌, శివాజి, రాజీవ్‌ కనకాల కాంబినేషన్ లో మన్యం రమేష్‌ నిర్మించిన ఆకాశ రామన్న చిత్రం ఈ శుక్రవారమే రిలీజైంది. ఫ్లాఫ్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం స్క్రీన్ ప్లే పరంగా బాగుందంటూ వినపడటం గమనార్హం. ఫ్లాష్ న్యూస్ చిత్రంతో పరిచయమైన దర్శకుడు అశోక్ డైరక్షన్ లో వచ్చిన ఈ చిత్రం 11:14 అనే హాలీవుడ్ ధ్రిల్లర్ ని కాపీ చేస్తూ తయారైంది. ఇక చిత్రంలో కథ చిత్రంగా నడుస్తుంది. కథలో భాగంగా పబ్‌కి శిష్య సమేతంగా వచ్చిన స్వామీజీ (రఘుబాబు) ఫుల్‌గా మందుకొట్టి కర్మ సిద్ధాంతం గురించి తేజా (రాజీవ్‌ కనకాల)కు బోధిస్తాడు. 'ఇది కలియుగం .ఈ జన్మలో చేసిన తప్పును ఈ జన్మలోనే అనుభవించాల్సి వుంటుంది' అని చెప్పి కారెక్కుతాడు. తేజ చూస్తుండగానే కారు కదలడం.. కంటిముందే యాక్సిడెంట్‌ అవ్వడం.. స్వామీజీ అక్కడక్కడే చనిపోవడం జరుగుతుంది. ఆ యాక్సిడెంట్‌తో కథ మొదలవుతుంది.

ఆ షాక్‌ నుంచి తేరుకుని కార్లో బయలుదేరతాడు తేజ. అర్ధరాత్రి కావొస్తోంది. మద్యం సేవించి కారు నడుపుతూ... తన ప్రియురాలు (గౌరీ పండిట్‌)తో మాట్లాడుతున్నాడు. ఇంతలో పెద్ద శబ్దం. చూసేసరికి కారు అద్దంపై ఓ బాడీ పడి, కారు లైట్‌గా డామేజ్‌ అయివుంటుంది. ఆ యాక్సిడెంట్‌ తానే చేశానని అపోహపడి ఆ శవాన్ని కారు డిక్కీలో దాచేస్తాడు తేజ. ఇంతలో పోలీసాఫీసర్‌ రావడం.. తేజాను అరెస్ట్‌ చేయడం జరిగిపోతుంది. తేజను వ్యాను ఎక్కించగానే.. అప్పటికే వ్యాన్‌లో రాణా(అల్లరి నరేష్‌), అతని ప్రియురాలు(మీరాజాస్మిన్‌) అప్పటికే అరెస్ట్‌ అయి వుంటారు. అసలు తేజ డిక్కీలో దాచిన ఆ మృతదేహం ఎవరిది?... రాణాని అతని ప్రియురాలిని ఏం తప్పు చేశారని పోలీసులు అరెస్ట్‌ చేశారు?.. వంటి ప్రశ్నలన్నిటినీ ఈ చిత్రంలో మిగతా కథ విశ్లేషిస్తుంది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu