»   »  వి.పి &పి.పి కి అల్లరి నరేష్ క్లాప్

వి.పి &పి.పి కి అల్లరి నరేష్ క్లాప్

Posted By:
Subscribe to Filmibeat Telugu

అష్టాచమ్మ ఫేం అవసరాల శ్రీనివాస్, విజయ్‌సాయి కాంబినేషన్లో 'వరప్రసాద్‌ & పొట్టిప్రసాద్‌' (వి.పి&పి.పి) అనే చిత్రం తయారుకానుంది. సత్యవారణాసి దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రంలో ప్రియాంక హీరోయిన్ గా చేస్తోంది. ఒక హీరో పొడుగు, మరో హీరో పొట్టి అనే కాన్సెప్టుతో ఈ చిత్రం కామిడీగా రూపొందిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్‌ రామానాయడు స్టూడియోలో మొదలైంది. తొలి సన్నివేశానికి అల్లరి నరేష్‌ క్లాప్‌ ఇచ్చారు. చంద్రసిద్దార్థ కెమెరా స్విచాన్‌ చేయగా, శర్వానంద్‌ తొలిషాట్‌కి గౌరవ దర్శకత్వం వహించారు.

ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో నిర్మాత హర్షరెడ్డి మాట్లాడుతూ 'తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో ఈ చిత్రం రూపొందుతోంది. ఐదు సంవత్సరాల క్రితం అనుకున్న కథ ఇప్పటికి కుదిరింది. తగిన ఆర్టిస్టలు లభించారు. రెగ్యులర్‌ షూటింగ్‌ ఈనెల 29 నుండి బెంగుళూరులో, ఆ తర్వాత షెడ్యూల్‌ హైదరాబాద్‌లో చివరి షెడ్యూల్‌ కొడైకెనాల్లో జరుపడంతో నిర్మాణం పూర్తవుతుంది. ఇద్దరు ప్రముఖ హీరోలు కూడా నటిస్తారు. వారి పేర్లు త్వరలో వెల్లడిస్తాం అని చెప్పారు. ఇక ఈ చిత్రం ఇతర పాత్రల్లో రఘుబాబు, పోసాని కృష్ణమురళి, ప్రియాఅహూజా, మాస్టర్‌ భరత్‌, మోల్కోటే చేస్తున్నారు. ఈ చిత్రానికి మాటలు: కుమార్‌ దావులూరి, ఛాయాగ్రహణం: బాల, సంగీతం: సాయికార్తీక్‌, నిర్మాత: హర్షరెడ్డి, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సత్యవారణాసి.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu