twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    చిన్న సినిమాల్లో 'గబ్బర్‌సింగ్'అంటున్నారు

    By Srikanya
    |

    హైదరాబాద్ : మా సినిమాను చిన్న సినిమాల్లో 'గబ్బర్‌సింగ్', 'దూకుడు' అంటున్నారు'' అని ఆనందంగా చెప్పారు అల్లరి నరేష్. తమిళ చిత్రం 'తమిళ్ పడమ్' ఆధారంగా అల్లరి నరేష్ హీరోగా దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు రూపొందించిన 'సుడిగాడు' సినిమా ఇటీవల విడుదలై ఘన విజయం దిశగా దూసుకుపోతోంది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఇలా స్పందించారు.

    చిత్రం కలెక్షన్స్ గురించి మాట్లాడుతూ..."ఈ సినిమా మీద అంచనాలైతే ఉన్నాయి కానీ ఈ స్థాయి కలెక్షన్లు వస్తాయని మాత్రం నేను ఊహించలేదు. ఆంధ్రప్రదేశ్‌తో పాటు ఓవర్సీస్‌లోనూ 'సుడిగాడు' పెద్ద హిట్టయింది. తొలివారంలో రూ. 8 కోట్ల షేర్ వసూలు చేసిందని తెలిసి చాలా సంతోషంగా ఉంది. సినిమాలోని వినోదం వల్లే ఆ స్థాయి హిట్టయ్యిందనేది నా అభిప్రాయం. పబ్లిసిటీకి, మౌత్ టాక్ విస్తరించడం కూడా దీనికి కారణం. ఒరిజినల్ 'తమిళ్ పడమ్' కంటే పెద్ద హిట్టయింది. ఆ సినిమా డైరెక్టర్ అముదన్‌కు అది తొలి చిత్రం. 'సుడిగాడు' రిలీజయ్యాక ఆ సినిమా హిందీ, కన్నడ రీమేక్ హక్కులు అడుగుతున్నారని ఆయన చెప్పారు.

    అలాగే ఇది నాన్నగారు బతికున్నప్పుడు ఒప్పుకున్న చివరి సినిమా. ఖర్చుకు తగ్గ విజయం అదివరకు నా సినిమాల మార్కెట్ రూ. 6 నుంచి రూ. 6.5 కోట్లుగా ఉండేది. ఈ సినిమాకి బడ్జెట్ ఎక్కువవుతుందని దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు చెబితే నిర్మాత చంద్రశేఖర్ డి. రెడ్డిగారు బడ్జెట్ గురించి ఆలోచించవద్దని భరోసా ఇచ్చారు. ఖర్చు పెట్టిన దానికి తగ్గట్లే బిజినెస్ జరగడం, కలెక్షన్లు రావడం, ఈ సినిమాని కొనుక్కున్న వాళ్లంతా సంతోషంగా ఉండటం చాలా హ్యాపీ. ఈ సినిమా కోసం భీమనేనిగారు చాలా కష్టపడ్డారు. స్పూఫింగ్ (పేరడీ) కోసం వంద సినిమాల్ని ఎంపిక చేసుకోవడం, వాటిలోంచి ఈ సినిమాకి పనికివచ్చే అంశాల్ని ఎంచుకోవడం సామాన్య విషయం కాదు అన్నారు.

    ఇక ఇది స్ఫూఫింగ్ సినిమా అయినా ఏ హీరో బాడీ లాంగ్వేజ్‌నీ నేను అనుకరించలేదు. నా బాడీ లాంగ్వేజ్‌తోనే ఆ ఐటమ్స్ చేయమని భీమనేని సూచిస్తే, అలాగే చేశా. అది బాగా వర్కవుట్ అయ్యింది. ఈ సినిమాని చాలామంది హీరోలు చూశారు. వాళ్లంతా ఎంజాయ్ చేశారు. అందరూ హీరోల అభిమానులూ ఈ సినిమాని ఆదరిస్తున్నారు. 'మడత కాజా' తర్వాత శ్రీవసంత్ ఈ సినిమాకి పనిచేశాడు. ఐదు పాటలకి ఐదు భిన్నమైన బాణీలిచ్చాడు. భాను, ప్రేమ్‌రక్షిత్, నిక్సన్ నా చేత బాగా డాన్సులు చేయించారు. ఒకప్పుడు డాన్సు చెయ్యడమంటే కష్టంగా అనిపించేది. ఇప్పుడు వాటిని బాగా ఆస్వాదిస్తున్నా అన్నారు.

    English summary
    
 Allari Naresh happy with his latest Sudigaadu movie collections. His market value has increased with Sudigaadu movie. This has happened for the first in Allari Naresh's career. The film is a spoof on all the mass Telugu films and superstars.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X