»   » అల్లరి నరేష్ ‘ఇంట్లో దెయ్యం నాకేం భయం’ (టీజర్)

అల్లరి నరేష్ ‘ఇంట్లో దెయ్యం నాకేం భయం’ (టీజర్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఒకప్పుడు వరుస కామెడీ చిత్రాలతో బాక్సాఫీసు వద్ద సందడి చేసే అల్లరి నరేష్‌ ఈ మధ్య చాలా స్లో అయ్యాడు. ఆయన చేసిన కొన్ని రోటీన్ కామెడీ సినిమాలు నిరాశ పరచడంతో తను కూడా రూటు మార్చాడు. ప్రస్తుతం హారర్ కామెడీల జోరు నడుస్తున్న నేపథ్యంలో జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో 'ఇంట్లో దెయ్యం నాకే భయం' సినిమాతో ప్రేక్షకులు ముందుకు రాబోతున్నాడు.

గతంలో జి.నాగేశ్వర రెడ్డి తో అల్లరి నరేష్ చేసిన సీమశాస్త్రి', 'సీమటపాకాయ్‌' చిత్రాలు మంచి విజయ సాధించాయి. దీంతో ఇంట్లో దెయ్యం నాకేం భయం సినిమాపై మంచి అంచనాలున్నాయి. బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ శ్రీ వెంకటేశ్వర సినీచిత్ర పతాకంపై ఈ సినిమాను నిర్మిస్తున్నరు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ రిలీజ్ చేసారు.

ఈ సందర్భంగా నిర్మాత బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ మాట్లాడుతూ.. ''అత్తారింటికి దారేది, నాన్నకు ప్రేమతో చిత్రాల తర్వాత మా బేనర్‌లో వస్తున్న ఫుల్‌ లెంగ్త్‌ ఎంటర్‌టైనర్‌ ఇది. ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్‌తోపాటు హార్రర్‌ టచ్‌తో అందర్నీ అలరించే చిత్రంగా ఇది రూపొందుతుంది. మా బేనర్‌లో ఇది మరో సూపర్‌హిట్‌ సినిమా అవుతుంది'' అన్నారు.

దర్శకుడు జి.నాగేశ్వరరెడ్డి మాట్లాడుతూ.. ''అల్లరి నరేష్‌తో చేసిన సీమశాస్త్రి, సీమటపాకాయ్‌ పెద్ద హిట్‌ అయ్యాయి. ఈ చిత్రం మా కాంబినేషన్‌లో హ్యాట్రిక్‌ మూవీ అవుతుంది. ఎంటర్‌టైన్‌మెంట్‌తోపాటు హార్రర్‌ మిక్స్‌ అయిన ఫ్యామిలీ డ్రామా ఇది. భారీ చిత్రాలు నిర్మించే ఛత్రపతి ప్రసాద్‌గారి బేనర్‌లో ఓ మంచి సినిమా చేయడం చాలా సంతోషంగా వుంది'' అన్నారు.

అల్లరి నరేష్‌, రాజేంద్రప్రసాద్‌, కృతిక, మౌర్యాని, బ్రహ్మానందం, పోసాని కృష్ణమురళి, ప్రభాస్‌ శ్రీను, షకలక శంకర్‌, చమ్మక్‌ చంద్ర, చలపతిరావు, కాదంబరి కిరణ్‌, ధన్‌రాజ్‌, ప్రగతి, రజిత, అమిత్‌, టార్జాన్‌, జయవాణి, అపూర్వ, ఆజాద్‌ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి ఈ చిత్రానికి సంగీతం: సాయికార్తీక్‌, సినిమాటోగ్రఫీ: దాశరథి శివేంద్ర, ఎడిటింగ్‌: కోటగిరి వెంకటేశ్వరరావు, మాటలు: డైమండ్‌ రత్నబాబు, పాటలు: భాస్కరభట్ల, డాన్స్‌: రాజుసుందరం, గణేష్‌, దినేష్‌, ఫైట్స్‌: సుంకర రామ్‌, ఆర్ట్‌: నారాయణరెడ్డి, సమర్పణ: భోగవల్లి బాపినీడు, నిర్మాత: బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: జి.నాగేశ్వరరెడ్డి.

English summary
Allari Naresh Latest Telugu Movie Intlo Dayyam Nakem Bhayam Official Teaser, exclusively on SVCC. #IntloDayyamNakemBhayam ft. Kruthika, Rajendra Prasad, Posani Krishna Murali, Srinivas Reddy, Shakalaka Shankar and Chalapathy Rao. Music composed by Sai Karthik and directed by G Nageswara Reddy. Movie is Produced by BVSN Prasad under Sri Venkateswara Cine Chitra banner.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu