»   »  ఇషా చావ్లాతో అల్లరి నరేష్ రొమాన్స్

ఇషా చావ్లాతో అల్లరి నరేష్ రొమాన్స్

Posted By:
Subscribe to Filmibeat Telugu
హైదరాబాద్: ఈ మధ్య వరుస ప్లాపులతో కాస్త వెనక బడిన కామెడీ హీరో అల్లరి నరేష్ త్వరలో...ఓ తమిళ రీమేక్ చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. 'కలగలుపు' అనే తమిళ చిత్రానికి రీమేక్‌గా తెరకెక్కుతున్న ఈచిత్రం షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది.

ఈ చిత్రంలో అల్లరి నరేష్ సరసన ఇషా చావ్లా హీరోయిన్‌గా సెలక్టయినట్లు తెలుస్తోంది. గతంలో ఇషా చావ్లా ప్రేమకావాలి, పూల రంగడు, శ్రీమన్నారాయణ, మిస్టర్ పెళ్లి కొడుకు లాంటి చిత్రాల్లో నటిస్తోంది. 'కలగలుపు' రీమేక్‌గా రూపొందుతున్న తాజాగా చిత్రం పూర్తి కామెడీ ఎంటర్టెనర్‌గా తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది.

ఈ చిత్రానికి ఇ. సత్తిబాబు దర్శకత్వం వహిస్తున్నారు. రిలయన్స్ ఎంటర్టెన్మెంట్స్‌తో సంయుక్తంగా అంబికా కృష్ణ ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు. విజయ్ సంగీతం అందిస్తున్నారు. కెరీర్లో తొలిసారిగా అల్లరి నరేష్ ఈ చిత్రంలో ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఇషా చావ్లా ఫుడ్ ఇన్స్ స్పెక్టర్ పాత్రలో నటిస్తోంది.

అల్లరి నరేష్ గత సినిమాల్లా రొటీన్‌గా కాకుండా డిఫరెంటుగా ఈచిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ముఖ్యంగా అల్లరి నరేష్ సినిమాల నుంచి ప్రేక్షకులు ఏం కోరుకుంటున్నారనే అంశాలపై ఫోకస్ చేసి వారిని మెప్పించే విధంగా వినోదాత్మకంగా ఈచిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. వేసవిలో సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

English summary

 Allari Naresh has started working for a new movie which is the official remake of the Tamil flick ‘Kalagalupu’. The movie is being directed by E. Sattibabu and Vijay Ebenzer will be scoring the music. Naresh will be romancing Isha Chawla in this film.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu