»   »  ‘జేమ్స్ బాండ్’ : అల్లరి నరేష్ కొత్త చిత్రం ఫస్ట్ లుక్ (ఫొటో)

‘జేమ్స్ బాండ్’ : అల్లరి నరేష్ కొత్త చిత్రం ఫస్ట్ లుక్ (ఫొటో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ :అల్లరి నరేష్ కొత్త సినిమాకి ‘జేమ్స్ బాండ్' అనే టైటిల్ ని ఖరారు చేసి ఫస్ట్ లుక్ ని వదిలారు. అలాగే ఈ సినిమాకి ట్యాగ్ లైన్ గా ‘నేను కాదు నా పెళ్ళాం' అని కూడా పెట్టారు. అల్లరి నరేష్ సరసన పోటుగాడు ఫేం సాక్షి చౌదరి హీరోయిన్ గా కనిపించనుంది. ఏకె ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర నిర్మిస్తున్న ఈ సినిమా ద్వారా శ్రీను వైట్ల దగ్గర పనిచేసిన సాయి కిషోర్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. రీసెంట్ గా ‘బందిపోటు'గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన అల్లరి నరేష్ ఈ సినిమాని పూర్తి ఫన్ తో సిద్దం చేస్తున్నాడు. ఈ ఫస్ట్ లుక్ మీరూ ఓ లుక్కేయండి.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

''అల్లరి నరేష్‌ గత సినిమాల మాదిరిగానే వినోదాల దారిలో సాగే చిత్రమిది. సినిమా పేరు వింటేనే బోలెడెంత నవ్వులు విరుస్తున్నాయి. సినిమా ఆద్యంతం నవ్వించేందుకు అల్లరి నరేష్‌ సిద్ధమవుతున్నారు'' అంటోంది చిత్రబృందం.

Allari Naresh JamesBond Movie Firstlook

అల్లరి నరేష్ కెరీర్లో ఇది 49వ సినిమా. కెరీర్లో 50 సినిమాలు పూర్తయిన తర్వాతే అల్లరి నరేష్ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఎలాగైనా ఈ సంవత్సరమే 50వ సినిమా పూర్తి చేసి పెళ్లి పీటలెక్కబోతున్నాడు అల్లరి నరేష్. కుటుంబ సభ్యులు అతడి కోసం సంబంధాలు చూసే పనిలో తలమునకలై ఉన్నారు. అల్లరి నరేష్ అభిరుచికి తగిన అమ్మాయిని వెతికే పనిలో ఉన్నారు.


హీరోయిన్ విషయానికి వస్తే... మంచు మనోజ్ ‘పోటుగాడు' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన హీరోయిన్ సాక్షి చౌదరి. కొంత కాలం గ్యాప్ తర్వాత ఈ అందాల భామ తెలుగులో ఈ అవకాశం సొంతం చేసుకుంది.
రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో సాక్షి హుషారైన అమ్మాయి పాత్రను పోషిస్తుంది. అల్లరి నరేష్ ఎత్తుకు సరిపడా అందమైన అమ్మాయి కోసం వెతకగా, సాక్షి అయితే బాగుంటుందని ఫిల్మ్ మేకర్స్ భావించారు అని యూనిట్ సన్నిహిత వర్గాలు తెలిపాయి.

Allari Naresh – JamesBond Movie Firstlook

ఈ చిత్రాన్ని ఎ.కె.ఎంటర్‌టైన్మెంట్స్‌ పతాకంపై సుంకర రామబ్రహ్మం నిర్మిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ రీసెంట్ గా రామోజీ ఫిల్మ్‌ సిటీలో జరిగింది. ప్రత్యేకంగా రూపొందించిన పబ్‌ సెట్‌లో అల్లరి నరేష్‌ తదితరులపై పాట చిత్రీకరించారు. ప్రసన్న కుమార్‌ నృత్య రీతులు సమకూర్చారు.

English summary
Allari Naresh New Movie James Bond Title First Look Poster. Sakshi Chowdary is the heroine. more details about the movie need to be revealed.
Please Wait while comments are loading...