»   » రాత్రి 12 నుంచి 12.40 మధ్య అల్లరి నరేష్

రాత్రి 12 నుంచి 12.40 మధ్య అల్లరి నరేష్

Posted By:
Subscribe to Filmibeat Telugu

రాత్రి 12 నుంచి 12.40 గంటల వరకూ జరిగే సంఘటన సమాహారమే అల్లరి నరేష్ హీరోగా చేసిన 'ఆకాశరామన్న' చిత్రమని నిర్మాత మన్యం రమేష్ చెప్పారు. అలాగే ఈ చిత్రం విశేషాలను వివరిస్తూ...28 రాత్రుల్లో షూటింగ్ పూర్తి చేశామని, స్క్రీన్ ప్లే బేస్ట్ మూవీగా ఈ చిత్రం రూపొందిందనీ, సినిమాలోని 17 క్యారెక్టర్లు వేటికవే ప్రాధాన్యం కలిగి కథను నడిపించడంలో కీలక పాత్ర పోషిస్తాయనీ అన్నారు. అల్లరి నరేష్, శివాజీ, రాజీవ్ కనకాల, మీరాజాస్మిన్, గౌరీ పండిట్ ప్రధాన పాత్రల్లో విభిన్నమైన కథాంశంతో ఈ సినిమా రూపొందింది అన్నారు. టైటిల్ కు తగ్గట్టే హిలేరియస్ కామెడీతో ఉత్కంఠభరితంగా సినిమా ఉంటుందనీ, ముఖ్యంగా సినిమా ప్రారంభాన్ని ఎవరూ మిస్ కాకూడదనీ చెప్పారు. ఇక తమ చిత్రానికి చక్రి సంగీతం, ఆయన అందించిన రీరికార్డింగ్, సాయిశ్రీరాం మెస్మరైజింగ్ ఫోటోగ్రఫీ, ఆర్టిస్టుల పెర్ ఫారమన్స్ హైలైట్స్ అవుతాయన్నారు. ఇక ఆకాశరామన్న ఎవరో తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందేనని చెప్పారు. ప్లాష్ న్యూస్ తీసిన అశోక్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈనెల 12న విడుదలకు సిద్ధమైంది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu