»   »  బాలకృష్ణ, బ్లడీఫూల్ అంటూ అల్లరి నరేష్ (వీడియో)

బాలకృష్ణ, బ్లడీఫూల్ అంటూ అల్లరి నరేష్ (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సినిమాల్లో ఏదో హీరోకు సెటైరో మరొకటో వేస్తే అందరి దృష్టీ ఆ సినిమాపై పడుతుంది. అది చిన్న సినిమా దర్శకులు ఉపయోగించుకుంటున్నారు. తాజాగా అల్లరి నరేష్ హీరోగా ఎ టీవీ సమర్పణలో ఎ.కె.ఎంటర్ టైన్మెంట్స్ ఇండియా ప్రై.లి. బ్యానర్ పై రూపొందుతోన్న చిత్రం ‘జేమ్స్ బాండ్'. . ‘నేను కాదు నా పెళ్లాం' ట్యాగ్ లైన్ చిత్రంలో బాలకృష్ణని గుర్తు చేస్తూ ఓ డైలాగు పెట్టారు.

అల్లరి నరేష్ ఫోన్ లో.... నేను బాలకృష్ణను మాట్లాడుతున్నా అంటే అవతలి నుంచి జీవా....ఏ బాలకృష్ణ అంటే బ్లడీ ఫూల్ అని ... అల్లరి నరేష్ గర్జించటంతో ...ఓ బాలయ్య బాబా ...మీరా సార్ అని గుర్తు పడతాడు. అలాగే...సప్తగిరి చేత...నిన్ను పరామర్శించటానికి పవన్ కల్యాణ్ వస్తాడా అనే డైలాగు వాడారు. ఈ డైలాగులు ఉన్న ఈ ట్రైలర్ పై మీరూ ఓ లుక్కేయండి.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

సాయి కిషోర్‌ దర్శకత్వంలో అల్లరి నరేష్‌, సాక్షి చౌదరి జంటగా నటించిన 'జేమ్స్‌ బాండ్‌' చిత్రం ఆడియో రిలీజ్‌ హైదరాబాద్‌లో అట్టహాసంగా జరిగింది. స్థానిక రావినారాయణ రెడ్డి ఫంక్షన్‌హాల్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సినీనటులు శ్రీకాంత్‌, నాని, తనీష్‌, సినీ దర్శకుడు శ్రీనువైట్ల తదితరులు పాల్గొన్నారు. ఈ సినిమాకు అనిల్‌ సుంకర నిర్మాతగా వ్యవహరించారు.

Allari Naresh's James Bond Movie new Trailer


ఈ సందర్భంగా... చిత్ర నిర్మాత మాట్లాడుతూ ‘'మా బ్యానర్ లో వస్తున్న నాలుగో చిత్రం. మంచి ఎంటర్ టైనర్. ప్రస్తుతం సినిమా దాదాపు చిత్రీకరణను పూర్తి చేసుకుంది. మన్మథుడు లాంటి భర్తకు పవర్ ఫుల్ మాఫియా డాన్ లాంటి భార్య దొరికితే ఎలా ఉంటుందనేదే కాన్సెప్ట్. సాయికిషోర్ గారు చక్కగా డైరెక్ట్ చేస్తున్నారు. సినిమాలో ఆరు పాటలుంటాయి. అన్నీ డిఫరెంట్ సాంగ్స్. పాటలు బాగా వచ్చాయి. ప్రస్తుతం బ్యాగ్రౌండ్ స్కోర్ జరుగుతుంది.సాయి కార్తీక్ అద్భుతైమన సంగీతాన్నందించారు. '' అన్నారు.

ఆశిష్ విద్యార్థి, చంద్రమోహన్, జయప్రకాష్ రెడ్డి, రఘుబాబు, కృష్ణభగవాన్, పోసాని తదితరులు ఇతర తారాగణం. ఈ చిత్రానికి మాటలు: శ్రీధర్ సీపాన, పాటలు: రామజోగయ్య శాస్త్రి, విశ్వ, భువనచంద్ర, ఆర్ట్ డైరెక్టర్: కృష్ణ మాయ, డ్యాన్స్: రాజసుందరం, గాయత్రి రఘురాం, ప్రసన్న, ఎడిటింగ్: ఎం.ఆర్.వర్మ, కెమెరా: దాము నర్రావు, సంగీతం: సాయి కార్తీక్, కో ప్రొడ్యూసర్: అజయ్ సుంకర, ఎగ్జిక్యూయూటివ్ ప్రొడ్యూసర్: కిషోర్ గరికిపాటి, ప్రొడ్యూసర్: రామబ్రహ్మం సుంకర, స్క్రీన్ ప్లే-దర్శకత్వం: సాయికోశోర్ మచ్చ.

English summary
Allari Naresh and Sakshi Chowdary pairedup for the film, ‘James Bond’, which is being directedby Sai Kishore Macha. ‘Nenu Kaadhu Naa Pellam’ is the slogan of this film. Ramabrahmam Sunkar is producing this film under A.K.Entertainments Pvt.ltd standard and A TV is showing it.
Please Wait while comments are loading...