»   »  'భాయ్' దర్శకుడు నెక్ట్స్ ఖరారు...డిటేల్స్

'భాయ్' దర్శకుడు నెక్ట్స్ ఖరారు...డిటేల్స్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : నాగార్జున 'భాయ్' చిత్రంతో డిజాస్టర్ ఫలితం అందుకున్న దర్శకుడు వీరభధ్రమ్ తన తదుపరి చిత్రానికి సర్వం సిద్దం చేసుకుంటున్నారు. అల్లరి నరేష్‌ హీరోగా వీరభద్రమ్‌ దర్శకత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకోనుంది. ఈ చిత్రానికి భగవాన్‌, పుల్లారావు నిర్మాతలుగా వ్యవహరిస్తారు. రకుల్‌ ప్రీత్‌సింగ్‌ని హీరోయిన్ గా ఎంచుకొన్నట్టు సమాచారం.

ఈ మధ్యే నరేష్‌కి కథ వినిపించి ఓకే చేయించుకున్నారు దర్శకుడు. నరేష్‌ శైలిలోనే ఆద్యంతం వినోదాలు పంచే చిత్రమిదని తెలుస్తోంది. ఏప్రిల్‌లో ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది. శ్రీధర్‌ సీపాన సంభాషణలు అందిస్తారు. పూర్తి వివరాలు త్వరలో తెలుస్తాయి.

గతంలో వీరిద్దరూ 'అహ నా పెళ్లంట' సినిమాకు కలిసి పనిచేశారు. దాంతో ఈ కాంబినేషన్ తో బిజినెస్ వర్గాల్లో క్రేజ్ వస్తుందని భావిస్తున్నారు. మొదట వీరభధ్రమ్..గోపిచంద్ కాంబినేషన్ లో చిత్రం అని వార్తలు వచ్చాయి. కానీ గోపీచంద్ ఆసక్తి చూపకపోవటంతో సినిమా పట్టాలు ఎక్కలేదు.

English summary
Veerabhadram, who recently had a big failure with “Bhai” starring Nagarjuna has narrated a story to Allari Naresh and the actor is more than impressed to do it. The movie said to be an out and out comedy entertainer.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu