For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  పవన్ తో పోటీకి సై అంటున్న కామెడీ హీరో

  By Srikanya
  |

  హైదరాబాద్: ఈ దసరా సీజన్ వరస రిలీజ్ లతో మోతక్కిపోనుంది. ఈ సీజన్ లో అక్టోబర్ 11న పవన్ కళ్యాణ్ తన కెమెరామెన్ గంగతో రాంబాబుతో వస్తున్నారు. ఆ తర్వాత అక్టోబర్ 12న నాగార్జున తన ఢమరుకం రెడీ చేస్తున్నారు. వీటితో పాటు లక్ష్మి ప్రసన్న కూడా తన గుండెల్లో గోదారి చిత్రాన్ని సైతం ఈ దసరాకే రిలీజ్ కు తెస్తోంది. అయితే వీరందరితో పాటూ తాను పోటీకి దిగుతానంటున్నాడు అల్లరి నరేష్. తన తాజా చిత్రం యముడుకి మొగడుని ఈ దసరాకే వస్తున్నాడు. దాంతో ఇవన్ని ఎలా ఉన్నా ఒక్కసారిగా అందరి దృష్టీ సుడిగాడుతో మంచి ఊపు మీద ఉన్న అల్లరి నరేష్ పై పడింది.

  ఇక యముడికి మొగుడు విషయానికి వస్తే... ప్రెండ్లీ మూవీస్ పతాకంపై నిర్మిస్తున్న 'యముడికి మొగుడు' ఓ సోషియో ఫాంటసీ చిత్రం. ఇ.సత్తిబాబు దర్శకత్వంలో చంటి అడ్డాల నిర్మించిన ఈ చిత్రంలో రీచాపనయ్ కథానాయికగా నటిస్తోంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత మాట్లాడుతూ గతంలో వచ్చిన సోషియోఫాంటసీ చిత్రాలైన యముడు సిరీస్‌లో మరో చిత్రం ప్రేక్షకులను అలరించడానికి వస్తోందని, 11 భారీ సెట్లతో ఈ చిత్రాన్ని గ్రాఫిక్స్ రూపొందించామని, కోటి పాటలు హైలైట్‌గా నిలిచే ఈ చిత్రం పూర్తి కామెడీ ఎంటర్‌టైనర్‌గా అలరిస్తుందని తెలిపారు.

  నరేష్‌ మాట్లాడుతూ, గతంలో చిరంజీవి చిత్రం టైటిల్‌తో తాను చిత్రం చేయడం ఆనందంగా ఉందన్నారు. ఆయన నటించిన మరో చిత్రం 'అల్లుడా మజాకా'లోని 'అత్తో అత్తమ్మ కూతురో' పాపులర్‌ సాంగ్‌ను ఈ చిత్రంలో రీమిక్స్‌ చేశానని తెలిపారు. నిర్మాత మాట్లాడుతూ, ఈ చిత్రం తాజా షెడ్యూల్‌ను గత పదిరోజులుగా పాలకొల్లు పరిసర ప్రాంతాల్లో జరుపుతున్నామన్నారు. ఇందులో భాగంగా గోదావరి గట్టుపై ప్రత్యేకంగా నిర్మించిన సెట్లో గత మూడురోజులుగా హీరోహీరోయిన్లపై ఓ పాటను చిత్రీకరిస్తున్నామని చెప్పారు.సెప్టెంబర్‌లో ఆడియోను, దసరాకు సినిమాను విడుదల చేస్తామని అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ, కథకు అన్నివిధాలా సరిపోయే టైటిల్‌ ఇది. ఇంతవరకు ఏ చిత్రంలో చూపించని విధంగా యువడితోపాటు యముడి భార్య, కొడుకు వంటి పాత్రలను ఇందులో చూపించబోతున్నామని చెప్పారు.

  ఇందులో యమునిగా షయాజీ షిండే, అతని భార్యగా రమ్యకృష్ణ నటిస్తోందని, సినీయర్ హాస్య నటీనటులతో ఆద్యంతం వినోదంతో రూపొందిస్తున్నారు. సీనియర్ నరేష్, గిరబాబు, చంద్రమోహన్, తనకెళ్ల భరణి, ఏవీఎస్, చలపతిరావు, రఘుబాబు, కృష్ణ భగవాన్, భరత్, సుధ, సత్యకృష్ణ, హేమ, సన, రజిత, చిట్టిబాబు, పృథ్వీ, సారిక రామచంద్రరావు ఇతర ముఖ్య తారాగణం. కథ: జయసిద్ధు, మాటలు: క్రాంతిరెడ్డి సకినాల, సంగీతం: కోటి, ఛాయా గ్రహణం: కె. వీరేంద్రబాబు, ఎడిటింగ్: గౌతంరాజు, కళ: కిరణ్ కుమార్, నిర్మాత: చంటి అడ్డాల, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: ఇ. సత్తిబాబు.

  English summary
  Pawan Kalyan’s ‘Cameraman Gangatho Rambabu’ is being planned to be released on 11th October. On the other hand, King Nagarjuna’s ‘Damarukam’ is expected to release on 12th October. Lakshmi Manchu has recently, confirmed that her next project, ‘Gundello Godari’ will be released for Dasara. One more movie to be added in the above list is, Allari Naresh’s ‘Yamudiki Mogudu’.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X