twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    శ్రీరెడ్డి ఇష్యూ: రూ. 5 కోట్లు ఎక్కడివి? రామ్ గోపాల్ వర్మ వెనక ఎవరున్నారు?

    By Bojja Kumar
    |

    కాస్టింగ్ కౌచ్ మీద పోరాటం చేస్తున్న శ్రీరెడ్డి ఇష్యూలో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కల్పించుకుని ఇష్యూ పక్కదారి పట్టించి ఈ మొత్తం వ్యవహారంలో పవన్ కళ్యాణ్ టార్గెట్ అయ్యేలా చేయడం హాట్ టాపిక్ అయింది. వర్మ ప్రభావంతో పవన్ కళ్యాణ్ మీద మాటల దాడి అనంతరం తనకు ఎదురైన చేదు అనుభవాలతో రియలైజ్ అయిన శ్రీరెడ్డి.... తనతో ఇలా చేయించింది రామ్ గోపాల్ వర్మే అని జనాలకు తెలిసేలా చెప్పే లోపే వర్మ తెలివిగా తానే విషయం బయట పెట్టి పవన్ కళ్యాణ్‌కు, ఆయన అభిమానులకు సారీ చెబుతూ సేఫ్ గేమ్ ఆడాడటం గమనార్హం.

    మెగా ఫ్యామిలీ మీద కోపంతోనే వర్మ ఇలా చేశాడని, పవన్ కళ్యాణ్ ఇమేజ్‌ను, మెగా ఫ్యామిలీ ప్రతిష్టను మరింత దిగజార్చే ప్రయత్నంలో భాగంగానే ఇలాంటి పన్నాగాలు పన్నాడని అల్లు అరవింద్ గురువారం ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో వెల్లడించారు. రామ్ గోపాల్ వర్మను నీచుడిగా, నికృష్టుడిగా పేర్కొంటూ తనదైన శైలిలో ఫైర్ అయ్యారు అరవింద్.

    Allu Aravind about RGV settlements in Sri Reddy issue

    సురేష్ బాబు కొడుకు విషయంలో శ్రీరెడ్డికి డబ్బు సెటిల్మెంట్ చేయడానికి వర్మ ప్రయత్నించాడు, సురేష్ బాబు తాను ఇలాంటి సెటిల్మెంట్లు చేయను, న్యాయబద్దంగానే వెళతాను అని చెప్పినా..... వర్మ తన ప్రయత్నాలు కొనసాగించారు. ఆమెకు రూ. 5 కోట్లు ఆఫర్ చేశాడు. రామ్ గోపాల్ వర్మ ఆర్థిక పరిస్థితి ఏమిటో తనకు తెలుసని, అతడికి అంత డబ్బు ఎక్కుడిది? అనే సందేహాలు అల్లు అరవింద్ వ్యక్తం చేశారు. అల్లు అరవింద్ ఈ అంశం లేవనెత్తడంతో అభిమానుల్లో సైతం దీనిపై అనుమానాలు మొదలయ్యాయి.

    రామ్ గోపాల్ వర్మ వెనక ఏవైనా రాజకీయ పార్టీ అండ ఉందా? పవన్ కళ్యాణ్ ప్రతిష్ట దెబ్బతీసి ఆయన్ను పొలిటికల్‌గా తొక్కేసేందుకు వర్మను సదరు పార్టీ వాడుకుందా? వారి ద్వారానే వర్మ రూ. 5 కోట్లు శ్రీరెడ్డికి ఆఫర్ చేసి ఆమెను పవన్ కళ్యాణ్‌కు వ్యతిరేకంగా ప్రయోగించాలని ప్రయత్నం చేశారా? అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఏది ఏమైనా వర్మ ప్లాన్ విఫలం అవ్వడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

    English summary
    Allu Aravind about RGV settlements in Sri Reddy issue. Popular director Ram Gopal Varma says sorrry to Pawan Kalyan in Sri Reddy Contravercy. He said I was influenced the Sri reddy to scold Pawan Kalyan. In this context, Varma tweeted that My sincere apologies once again to PawanKalyan and all his fans and also his family members.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X