»   » అబుదాబిలో అల్లు అర్జున్ ...అస్మైక యోగ... తస్మైక భోగ ,హరీష్ శంకర్ కల నిజమైంది

అబుదాబిలో అల్లు అర్జున్ ...అస్మైక యోగ... తస్మైక భోగ ,హరీష్ శంకర్ కల నిజమైంది

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ :వరుస విజయాలతో దూసుకుపోతున్న స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ ప్రస్తుతం నటిస్తున్న చిత్రం 'దువ్వాడ జగన్నాథమ్‌'. రీసెంట్ గా రిలీజైన టీజర్ రికార్డ్ స్థాయి వ్యూస్ సాదించడంతో సినిమా మరింతగా జనాల్లోకి వెళ్లి క్రేజ్ ఇంకాస్త పెరిగింది. ఇప్పటికే 70శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని అనుకున్న సమయానికి రిలీజ్ చేయడానికి టీమ్ శరవేగంగా, ఎక్కడా గ్యాప్ ఇవ్వకుండా వరుస షెడ్యూల్స్ ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షెడ్యూల్ దుబాయిలో అబుదాబిలో జరుగుతోంది.

ప్రస్తుతం అబుదాబిలో అల్లు అర్జున్‌, పూజా హెగ్డేలపై 'అస్మైక యోగ.. తస్మైక భోగ.. రస్మైక రాగ హిందోళం' అనే పాటని తెరకెక్కిస్తున్నారు. రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించారు. ''ప్రస్తుతం పాట షూటింగ్ జరుగుతోంది. అల్లు అర్జున్‌ డ్యాన్స్‌ చేస్తుంటే కళ్లారా చూడడం ఓ గొప్ప అనుభూతి..'' అంటూ హరీష్‌ శంకర్‌ ట్వీట్‌ చేశారు.

ఈ నెల 9 వరకూ అక్కడే చిత్రీకరణ సాగుతుంది. ఆ తరవాత చిత్రబృందం స్వదేశం తిరిగి వస్తుంది. ఈ పాటల్లో అల్లు అర్జున్ వేయబోయే స్టెప్స్ అభిమానులను అమితంగా ఆకట్టుకుంటాయని, సినిమాకి మరింత బలాన్ని చేకూరుస్తాయని వినికిడి. తాజాగా అల్లు అర్జున్ అబుదాబి సెట్స్ లో ఉన్న తనను అభిమానులు వచ్చి కలుసుకోవచ్చని ఆఫర్ కూడా ప్రకటించాడు.

ఇక ఈ సినిమా టీజర్‌ ఇటీవలె విడుదలైంది. అయితే బన్నీ పూర్తి మేకోవర్ లో కనిపిస్తున్న ఈ సినిమాకు ఫస్ట్ లుక్ తోనే అందరి దృష్టిని ఆకర్షించిన డీజే టీం ఇప్పుడు టీజర్ తో రికార్డ్ ల వేట మొదలు పెట్టింది.

బన్నీ తొలిసారి బ్రాహ్మణ యువకుడి పాత్రలో కనిపిస్తుండడంతో అందరూ ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో టీజర్‌ విడుదలైంది. బ్రాహ్మణుడి గెటప్‌లో అల్లు అర్జున్ కనిపించిన ఈ టీజర్‌లో హీరోయిన్ పూజాహెగ్డే ముద్దుపెట్టుకున్న సన్నివేశం కనిపిస్తుంది. ఈ సందర్భంగా అల్లు అర్జున్ 'ఇలాఇలా ముద్దులు పెట్టేసి సభ్యసమాజానికి ఏం మెసేజ్ ఇద్దామని' అంటూ చెప్పిన డైలాగ్ అందరికీ నచ్చింది.

టీజర్ మంచి ఆదరణ పొందుతోందని నిర్మాత దిల్‌రాజు తెలిపారు. తమ సంస్థ నుండి సినిమా అంటేనే ప్రేక్షకులలో భారీ అంచనాలు వుంటాయని, అలాగే అల్లు అర్జున్ తమ సంస్థలో చేస్తున్న హ్యాట్రిక్ మూవీగా డి.జె నిలుస్తుందని నిర్మాత తెలిపారు. ఇటీవల విడుదలైన ఫస్ట్‌లుక్‌కు మంచి స్పందన వచ్చిందని, అలాగే నేడు విడుదల చేసిన టీజర్‌కు కూడా ప్రేక్షకులనుండి ట్రెమండస్ రెస్పాన్స్ లభించిందని తెలిపారు.

సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయని, ప్రేక్షకులకు అంచనాలకు తగ్గట్టుగానే సినిమాను ప్రెస్టేజియస్‌గా రూపొందించామని ఆయన అన్నారు. ఈ చిత్రానికి కెమెరా:ఐనాక బోస్, సంగీతం:దేవిశ్రీ ప్రసాద్, ఎడిటింగ్:చోటా కె.ప్రసాద్, స్క్రీన్‌ప్లే:రమేశ్‌రెడ్డి, దీపక్‌రాజ్, నిర్మాతలు:రాజు, శిరీష్, కథ, మాటలు, దర్శకత్వం:హరీశ్ శంకర్.ఎస్.

English summary
Director Harish Shankar had a dream – to watch Allu Arjun dance live on the sets. And thanks to his latest film, DJ (Duvvada Jagannadham), the wish is finally coming true after all these years.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu