»   » గీతా ఆర్ట్స్ లో పవన్ కళ్యాణ్ సినిమా కన్ఫర్మ్..ఆ దర్శకుడునే...?

గీతా ఆర్ట్స్ లో పవన్ కళ్యాణ్ సినిమా కన్ఫర్మ్..ఆ దర్శకుడునే...?

Posted By:
Subscribe to Filmibeat Telugu

గతంలో గీతా ఆర్ట్స్ బ్యానర్ పై పవన్ కళ్యాణ్ హీరోగా సినిమాలు వచ్చి విజయవంతమైన సంగతి తెలిసిందే. అయితే తాజాగా వివి వినాయిక్, పవన్ కాంబినేషన్ లో సినిమా చేస్తానని అల్లు అరవింద్ మెగా ఫ్యాన్స్ కి మాట ఇచ్చేసారు. ఈ సంఘటన బద్రీనాధ్ ఆడియో పంక్షన్ లో చోటు చేసుకుంది. అల్లు అరవింద్ మాట్లాడుతున్నప్పుడు.. అభిమానులు..పవన్, వినాయిక్ కాంబినేషన్ సినిమా కావాలంటూ గట్టిగా నినాదాలు చేసారు. వెంటనే అల్లు అరవింద్ స్పందిస్తూ.. నేను రెడిగా ఉన్నాను.. గీతా ఆర్ట్స్ పై ఆ కాంబినేషన్ తో సినిమా చేస్తాను అన్నారు. దానికి పవన్ అభిమానులు కేరింతలు కొట్టారు. వివి వినాయిక్ మొహంలోనూ ఆనందం విరిసింది. అందులోనూ ఆయన గత కొద్ది రోజులుగా పవన్ కళ్యాణ్ హీరోగా సినిమా చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలా అనుకోని విధంగా స్టేజీపై అల్లు అరవింద్ ప్రకటిచటం ఊహించని పరిణామం అయింది. ఇక పవన్ కళ్యాణ్ ప్రస్తుతం షాడో షూటింగ్ కోసం కలకత్తాలో ఉన్నారు. అందుకనే ఈ ఆడియో పంక్షన్ హాజరు కాలేకపోయారు.

English summary
Allu Aravind was reacting to the fans- said "I am ready to produce a film in their combination on 'Geetha Arts'". Though Allu Aravind simply said a dialogue and moved aside.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu