»   » అందుకు అల్లు అరవింద్ అమ్మగారే కారణం...పవన్ కళ్యాణ్

అందుకు అల్లు అరవింద్ అమ్మగారే కారణం...పవన్ కళ్యాణ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

నేను ఈ రోజు ఇలా వేదికపై నిలుచున్నానంటే అందుకు కారణం మా అత్తయ్య. అల్లు అరవింద్‌ అమ్మగారైన ఆమె నన్ను కల్యాణి అని పిలిచేవారు. నేను ఆరో తరగతిలో ఉన్నప్పుడే కల్యాణిని సినిమాల్లోకి తీసుకెళ్లాలి అంటూ ఉండేవారు అంటూ ఉద్వేగంగా మాట్లాడారు పవన్ కళ్యాణ్. సోమవారం రాత్రి హైదరాబాద్‌లో 'తీన్‌మార్‌' పాటల్ని విడుదల చేశారు. తొలి సీడీని పార్లమెంట్‌ సభ్యురాలు బొత్స ఝాన్సీ ఆవిష్కరించి పవన్‌కల్యాణ్‌కి అందజేశారు. ఈ సందర్భంగా పవన్ ఇలా స్పందించారు. అలాగే...సమాజానికి మనం ఉపయోగపడాలనే స్ఫూర్తిని నింపిన వ్యక్తి మా అమ్మగారు. రోజూ సంధ్య వేళ దీపం పెట్టి దండం పెట్టుకొనేవారు. ఎవరికి దండంపెడుతున్నావంటే బల్బు కనిపెట్టిన థామస్‌ ఆల్వా ఎడిసన్‌కి అని చెప్పేవారు అన్నారు. ఇక నేను చేసే ప్రతి సినిమా అభిమానులను దృష్టిలో ఉంచుకొనే ఉంటుంది. వాళ్ల సంతృప్తే నాకు ముఖ్యం. అలా అని విచ్చలవిడిగా సినిమాలు చేయటమంటే నాకు చాలా భయం. నేను చేసే ప్రతి సినిమా సమాజానికి ఎంతో కొంత ఉపయోగపడాలని కోరుకొంటాను అన్నారు.

English summary
It was Allu Aravind's mother who wanted me to become an actor when I was 6 years old. She used to call me Kalyani.It is my mother Anjana Devi who taught us about social commitment when we were kids....Pawan
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X