»   » అల్లు అర్జున్ కూతురికి పేరు పెట్టారు..దాని అర్దం వింటే ఆశ్చర్యపోతారు

అల్లు అర్జున్ కూతురికి పేరు పెట్టారు..దాని అర్దం వింటే ఆశ్చర్యపోతారు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: వరస హిట్ లతో , విభిన్నమైన స్టైల్స్‌తో తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకున్న హీరో ఎవరూ అంటే... అల్లు అర్జున్ అనే చెప్పాలి‌. కేవలం తెలుగులోనే కాదు మలయాళంలోనూ బన్నీకి అభిమానులు ఉన్నారు. ఈ సంవత్సరం ఆయనకు స్పెషల్‌. ఓ ప్రక్కన వరస హిట్స్... మరో ప్రక్కన అల్లుఅర్జున్‌-స్నేహారెడ్డి దంపతులకు పాప పుట్టింది.

ఈ సందర్భంగా అల్లు అర్జున్‌ దంపతులు తమ బుల్లిపాపతో దిగిన ఫొటోను అభిమానులతో పంచుకున్నారు. ఆ పాపకు 'అల్లు అర్హ' అని పేరు పెట్టారట. హిందూ మతం ప్రకారం 'అర్హ' అంటే శివునికి ఉన్న పేర్లలో ఒకటని, అదే విధంగా ఇస్లాంలో 'శాంతి, నిర్మలమైన' అని అర్థం వస్తుందట.

అంతేకాదు ఇంగ్లీష్‌లో 'అర్జున్‌' పేరులోని మొదటి రెండు అక్షరాలను స్నేహా పేరులోని చివరి రెండు అక్షరాలను కలిపి 'అర్హ'గా పెట్టినట్లు అల్లు అర్జున్‌ తెలిపారు.

అల్లు అర్జున్ తాజా చిత్రం విషయానికి వస్తే... అల్లు అర్జున్, హరీష్‌శంకర్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం డీజే (దువ్వాడ జగన్నాథమ్). ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు నిర్మిస్తున్నారు. హరీష్‌ శంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'దువ్వాడం జగన్నాథం'లో అల్లు అర్జున్‌ ఓ బ్రాహ్మణ పాత్రలో నటిస్తున్నాడని ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది.

ఈ పాత్ర దాదాపుగా 'అదుర్స్‌'లోని చారి పాత్రనే పోలి ఉంటుందట. పూర్తి ఎంటర్‌టైనింగ్‌గా సాగుతుందట. 'గబ్బర్‌సింగ్‌' తర్వాత ఆ స్థాయి విజయం అందుకోలేకపోయిన హరీష్‌ ఈ సినిమాతో ఆ సినిమాని దాటే హిట్ కొట్టాలనే పట్టుదలతో పనిచేస్తున్నారట.

హరీష్‌శంకర్ మాట్లాడుతూ.... దిల్‌రాజుగారి బ్యానర్‌లో వస్తున్న 25వ సినిమా ఇది. దిల్‌రాజుతో తన అనుబంధం 'గబ్బర్‌సింగ్‌' నుంచి కొనసాగుతుందన్నారు. 'ఆర్య' సినిమా వచ్చినప్పటి నుంచి అల్లుఅర్జున్‌తో సినిమా చేయాలని అనుకున్నా.. ఇప్పటికి ఆ కోరిక తీరిందని వెల్లడించారు.

English summary
Allu Arjun and Sneha Reddy have named their daughter Allu Arha. Announcing the news on Twitter, Allu wrote, "Our newly arrived angel ?ll? ?rha. Hindu meaning : Lord Shiva . Islamic meaning : Calm& Serene. "AR" jun & Sne "HA" together ARHA #AlluArha."
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu