»   » డీజే‌కు ముందే అల్లు అర్జున్ కీలక ప్రకటన.. ప్రిన్స్ మహేశ్‌తో అమీ తుమీ..

డీజే‌కు ముందే అల్లు అర్జున్ కీలక ప్రకటన.. ప్రిన్స్ మహేశ్‌తో అమీ తుమీ..

Posted By:
Subscribe to Filmibeat Telugu

స్లైలిష్ స్టార్ అల్లు అర్జున్ సినిమాల వేగం పెంచాడు. ఓ వైపు దువ్వాడ జగన్నాథం సినిమా రిలీజ్‌కు ఏర్పాట్లు చేస్తూనే మరో సినిమాను సెట్‌పైకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాడు అల్లు అర్జున్. తాజా సమాచారం ప్రకారం అల్లు అర్జున్ తన తదుపరి చిత్రాన్ని జూన్ 14వ తేదీ ఉదయం 8.30 గంటలకు ప్రకటించే అవకాశం ఉంది. అల్లు అర్జున్ నటిస్తున్న తాజా చిత్రం దువ్వాడ జగన్నాథం జూన్ 23న విడుదలకు సిద్ధమవుతున్నది. ఈ చిత్రంలో స్టైలిష్ స్టార్ సరసన పూజా హెగ్డే నటిస్తున్నది.

విభిన్న పాత్రల్లో అల్లు అర్జున్

విభిన్న పాత్రల్లో అల్లు అర్జున్

యాక్షన్ చిత్రంగా రూపొందుతున్న దువ్వాడ జగన్నాథం చిత్రంలో బ్రహ్మణుడిగా, డాన్‌గా రెండు పాత్రల్లో అల్లు అర్జున్ కనిపించనున్నాడు. ఈ చిత్రంలోని గుడిలో ఒడిలో పాట తమ మనోభావాలను కించపరిచే విధంగా ఉందంటూ బ్రహ్మణ సంఘాలు నిరసన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దర్శకుడు హరీష్ శంకర్ వివరణ ఇవ్వడంతో ఆ వివాదం సద్ధుమణిగింది. రాక్‌స్టార్ దువ్వాడ జగన్నాథం పాటలు, టీజర్‌పై అనూహ్యమైన స్పందన రావడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.


దిల్ రాజుకు 25వ చిత్రం

దిల్ రాజుకు 25వ చిత్రం

ప్రముఖ నిర్మాత దిల్ రాజుకు నిర్మాణపరంగా దువ్వాడ జగన్నాథం చిత్రం 25వది. ఈ చిత్రానికి సంబంధించిన ఆడియో ఆవిష్కరణ వేడుక జూన్ 11న ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో అల్లు అర్జున్ కుమారుడు అయాన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. తండ్రి అల్లు అర్జున్‌తోపాటు వేదికపైకి వచ్చిన ఆయన్ అభిమానులకు రెండు చేతులెత్తి అభివాదం చేయడం స్టైలిష్ స్టార్‌ను కూడా ఆశ్చర్యంలో ముంచెత్తింది.


డైరెక్టర్‌గా వక్కంతం వంశీ

డైరెక్టర్‌గా వక్కంతం వంశీ

ఇలాంటి విశేషాలతో ముందుకెళ్తున్న అల్లు అర్జున్ తన తదుపరి చిత్రానికి కొత్త దర్శకుడిని పరిచయం చేస్తున్నారు. సినీ కథా రచయిత వక్కంతం వంశీ డైరెక్టర్‌గా స్టైలిష్ స్టార్ చిత్రంతో టాలీవుడ్‌లో రంగ ప్రవేశం చేయనున్నారు. ఈ చిత్రానికి నా పేరు సూర్య, నా ఇల్లు ఇండియా అనే టైటిల్ ప్రచారంలో ఉంది. ఈ చిత్రాన్ని సెట్స్‌పైకి తీసుకెళ్లి సంక్రాంతి బరిలో నిలపాలనే ప్లాన్‌తో ముందుకెళ్తున్నారు. ఈ చిత్రంలో కన్నడ నటి రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తున్నట్టు సమాచారం. చిత్ర షూటింగ్ తేదీలను, టైటిల్‌ను అల్లు అర్జున్ జూన్ 14న ప్రకటిస్తారనే వార్త ఫిలింనగర్‌లో ప్రచారం అవుతున్నది.


సంక్రాంతి బరిలో ప్రిన్స్‌తో

సంక్రాంతి బరిలో ప్రిన్స్‌తో

ఈ సంక్రాంతి రేసులో ప్రిన్స్ మహేశ్‌బాబు, అల్లు అర్జున్ నిలువనున్నారు. మహేశ్‌బాబు తన కెరీర్‌లో 24వ చిత్రంగా తెరకెక్కే చిత్రాన్ని సంక్రాంతి బరిలో దించడానికి ప్రణాళికను సిద్ధం చేసుకొన్నారు. అలాగే శంకర్ దర్శకత్వంలో వచ్చే రోబో 2.0 చిత్రం కూడా సంక్రాంతి బరిలో నిలువనున్నది. వచ్చే సంక్రాంతికి తెలుగు చిత్రాల మధ్య భారీ పోటీ నెలకొనే పరిస్థితి కనిపిస్తున్నది.English summary
Allu Arjun‘s upcoming movie Duvvada Jagannadham may not have hit theatres yet but talks of his next are alreayd doing the rounds. As per the latest update, Allu Arjun’s next will be announce don June 14 at 8:30 in the morning. The middle of the week will sure begin on an interesting note. The Telugu superstar will soon be seen in Harish Shankar’s Duvvada Jagannadham. Allu Arjun has teamed up with Pooja Hegde for the first time. Their chemsitry is another talking point.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu