»   » అల్లు అర్జున్ 'బద్రీనాథ్‌' ప్రారంభం తేదీ

అల్లు అర్జున్ 'బద్రీనాథ్‌' ప్రారంభం తేదీ

Posted By:
Subscribe to Filmibeat Telugu

గీతా ఆర్ట్స్‌ పతాకంపై అల్లు అరవింద్‌ నిర్మిస్తున్న 'బద్రీనాథ్‌' చిత్రం ఈ నెల 25 న హైదరాబాద్ లో ప్రారంభంకానుంది. వివివినాయిక్ దర్శకత్వంలో తయారుకానున్న ఈ చిత్రంలో అల్లు అర్జున్ హీరోగా చేస్తున్నారు. అతని సరసన హ్యాపీ గర్ల్ తమన్నా చేస్తోంది. చిన్ని కృష్ణ చిరకాలం విరామం తర్వత కథ అందిస్తున్న ఈ చిత్రంపై మంచి అంచనాలే ఉన్నాయి. భారీ బడ్జెట్ తో గ్రాఫిక్స్ కు ప్రాధాన్యత ఇచ్చే ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తూంటే రవివర్మన్ ఛాయాగ్రహణం అందిస్తున్నారు. ఇక ఈ చిత్రం ముహూర్తపు కార్యక్రమం చాలా నిరాడంబరంగా చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.

వి.వి.వినాయక్‌...అదుర్స్ చిత్రం తర్వాత చేస్తున్న చిత్రం ఇదే. అలాగే అల్లు అర్జున్ వరుడు చిత్రం ఈ నెల 31 వ తేదీన రిలీజవుతోంది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu