»   » నిర్మాతగా మారుతున్న అల్లు అర్జున్

నిర్మాతగా మారుతున్న అల్లు అర్జున్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: హీరోగా స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్న తర్వాత క్రమక్రమంగా నిర్మాణ రంగంలోకి అడుగులు వేయడం అనేది టాలీవుడ్లో కొత్తేమీ కాదు. ఈ మధ్య కాలంలో మహేష్ బాబు, నితిన్ లాంటి వారు ఈ రంగంలోకి వచ్చారు. త్వరలో రామ్ చరణ్ కూడా సొంత నిర్మాణ సంస్థలు మొదలు పెట్టబోతున్నాడు.

తాజాగా ఈ లిస్టులో అల్లు అర్జున్ కూడా చేరిపోయాడని తెలుస్తోంది. తెలుగులో సూపర్ హిట్టయిన భలేభలే మగాడివోయ్ చిత్రాన్ని కన్నడలో రీమేక్ చేయాలని, తానే నిర్మాతగా బాధ్యతలు చూసుకోవాలని అల్లు అర్జున్ ప్లాన్ చేస్తున్నాడట. ఇప్పటికే తెలుగు, మళయాలం పరిశ్రమలో హీరోగా పాతుకుపోయాడు. తమిళంలోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. ఇపుడు కన్నడలో నిర్మాతగా ఎంట్రీ ఇస్తున్నాడు.

Allu Arjun

అల్లు అర్జున్ నటిస్తున్న ‘సరైనోడు' వివరాల్లోకి వెళితే...
అల్లు అర్జున్ హీరో గా బోయపాటి శ్రీను దర్శకత్వంలో 'సరైనోడు' టైటిల్ తో ఓ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం ఏప్రియల్ 8, 2016 న విడుదల చేయటానికి తేదీ ని ఖరారు చేసినట్లు సమాచారం. అయితే ఈ విషయమై అధికారిక ప్రకటన ఏమీ లేదు.

రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంలో అల్లు అర్జున్ ..పవర్ ఫుల్ పోలీస్ అధికారిగా కనిపించనున్నారని సమాచారం. పవర్‌ఫుల్ రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో అల్లు అర్జున్ పాత్ర చిత్రణ భిన్నకోణాల్లో సాగుతుందని తెలిసింది. బోయపాటి, అల్లు అర్జున్ కాంబినేషన్‌లో తొలిసారిగా రానున్న ఈ చిత్రంపై ఇప్పటికే అభిమానుల్లో భారీ అంచనాలేర్పడ్డాయి.

బోయపాటి, అల్లు అర్జున్ కాంబినేషన్ లో సినిమా రాబోతుందని ఎప్పటినుంచో ఇండస్ట్రీలో వినిపిస్తున్నప్పటికి... కార్యరూపం దాల్చటానికి టైమ్ పట్టింది.. తొలిసారి బన్నీ, బోయపాటి కాంబినేషన్ ఫ్యాన్స్ కి కిక్కివ్వబోతోంది... ఫస్ట్ టైమ్ వీరిద్దరి కలయికలో వస్తున్నఈ ప్రాజెక్ట్ పై భారీ అంచానాలు నెలకొన్నాయి.... ఈ సినిమాలో స్టైలిష్ స్టార్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ ఫస్ట్ టైమ్ జతకట్టింది... గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు.

English summary
Film Nagar source said that, Allu Arjun turn as producer with Bahle Bhale Magadivoy Kannada remake.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu