For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  అల్లు అర్జున్-అకీరా నందన్ బర్త్‌డే సెలబ్రేషన్స్(ఫోటోలు)

  By Bojja Kumar
  |

  హైదరాబాద్: ఈ రోజు(ఏప్రిల్ 8) స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పుట్టి రోజు తో పాటు, పవన్ కళ్యాణ్ తనయుడు అకీరా నందన్ పుట్టిన రోజు కూడా కావడంతో మెగా అభిమానులు రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. కేక్ కట్ చేసి మిఠాయిలు పంచడంతో పాటు, పేదలకు దుస్తుల పంపీణీ కార్యక్రమం చేపట్టారు.

  రాజమండ్రిలో మెగా అభిమానులు పేద మహిళలకు చీరలు పంపిణీ చేయడంతో పాటు, పేద విద్యార్థులకు దుస్తులు అందజేసారు. అల్లు అర్జున్ ఇలాంటి పుట్టిన రోజులు మరెన్నో జరుపుకోవాలని, స్టైలిష్ స్టార్‌గా మరిన్ని విజయవంతమైన సినిమాల్లో నటించి ప్రేక్షకులను ఎంటర్టెన్ చేయాలని ఆకాంక్షించారు.

  మరో వైపు 'ఎవడు' షూటింగులో ఉన్న అల్లు అర్జున్ యూనిట్ సభ్యుల ఆధ్వర్యంలో అక్కడే కేక్ కట్ చేసిన వేడుక జరుపుకున్నాడు. ఈ కార్యక్రమంలో దర్శకుడు వంశీ పైడిపల్లి, నిర్మాతలు దిల్ రాజు, బండ్ల గణేష్, అల్లు అరవింద్, నటి జయసుధ, సాయి కుమార్ తదితరులు పాల్గొన్నారు.

  అల్లు అర్జున్ 1983 ఏప్రెల్ 8న తమిళనాడులోని చెన్నైలో జన్మించారు.

  అల్లు అర్జున్ అలనాటి మేటి హాస్యనటులు స్వర్గీయ పద్మశ్రీ అల్లు రామలింగయ్యగారి నట వారసుడు, మనవడు.

  మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ రెండవ కుమారుడు.

  మెగాస్టార్, పద్మభూషణ్, డాక్టర్ చిరంజీవికి, నాగబాబుకీ, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కీ స్వయానా మేనల్లుడు, అలాగే యువ హీరో రామ్ చరణ్ కి బావ అవుతాడు అల్లు అర్జున్.

  అల్లు అర్జున్ చిన్నప్పటి నుంచీ మంచి డ్యాన్సర్.

  అల్లు అర్జున్ లోని ఈ ప్రతిభను గమనించిన చిరంజీవి 2001 లో తను హీరోగా నటించిన "డాడీ" చిత్రంలో ఒక చిన్న డ్యాన్స్ బిట్ చేసే అవకాశం కల్పించారు.

  2003 లోదర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన "గంగోత్రి" సినిమాతో పూర్తి స్థాయి హీరోగా తెలుగు సినీ పరిశ్రమలో ప్రవేశించారు అల్లు అర్జున్.

  ఆ తర్వాత ఆర్య, బన్నీ, హ్యాపీ, దేశముదురు, పరుగు, ఆర్య-2, వరుడు, వేదం, బద్రీనాథ్, జులాయి చిత్రాల్లో అల్లు అర్జున్ హీరోగా నటించారు. మెగాస్టార్ హీరోగా నటించిన "శంకర్ దాదా జిందాబాద్" చిత్రంలో అతిథి పాత్రలో నటించారు అల్లు అర్జున్.

  ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ‘ఇద్దరమ్మాయిలతో' చిత్రంలో నటిస్తున్నారు.

  2011లో మార్చ్ 6 వ తేదీన తను ప్రేమించిన స్నేహా రెడ్డితో అల్లు అర్జున్ వివాహం జరిగింది.

  అతని సినిమాలు మళయాళంలోకి అనువదింపబడ్డాయి. అల్లు అర్జున్ కి మన తెలుగులోనే కాకుండా మళయాళంలో కూడా చాలా మంచి ఫాలోయింగ్ ఉంది.

  అల్లు అర్జున్ కి ఆర్య చిత్రానికి నంది స్పెషల్ జ్యూరీ అవార్డు, పరుగు చిత్రానికి నంది స్పెషల్ జ్యూరీ అవార్డు, ఫిలిం ఫేర్ అవార్డు లభించాయి.

  ఇలాంటి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటుడిగా మంచి పేరు తెచ్చుకోవాలనీ, మరిన్ని ఘనవిజయాలు సాధించాలనీ ఆకాంక్షిద్దాం.

  అల్లు అర్జున్, అకీరా బర్త్ డే సెలబ్రేషన్స్.

  అల్లు అర్జున్, అకీరా బర్త్ డే సెలబ్రేషన్స్.

  అల్లు అర్జున్, అకీరా బర్త్ డే సెలబ్రేషన్స్.

  అల్లు అర్జున్ బర్త్ డే స్పెషల్ ఇద్దరమ్మాయిలతో వాల్ పేపర్స్.

  అల్లు అర్జున్ బర్త్ డే స్పెషల్ ఇద్దరమ్మాయిలతో వాల్ పేపర్స్.

  English summary
  Allu Arjun birthday celebrations held hyderabad and rajahmundry. Allu Arjun born on 8 April 1983. He is an Indian film actor known for his work in Telugu cinema. He has won two Filmfare Best Telugu Actor Award for Parugu and Vedam films as a excellent acting, two Nandi Special Jury Award for Arya and Parugu films won,one CineMAA Award for debut acting film Gangotri.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X