»   » ‘చెప్పను బ్రదర్’...పవన్ మీద బన్నీ కామెంట్స్ దుమారం!

‘చెప్పను బ్రదర్’...పవన్ మీద బన్నీ కామెంట్స్ దుమారం!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: అల్లు అర్జున్ 'సరైనోడు' బ్లాక్ బస్టర్ ఫంక్షన్ ఇటీవల విజయవాడలో జరిగిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా బన్నీ పవన్ కళ్యాణ్ గురించి చేసిన ఓ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ లా వ్యాపించింది. బన్నీ తీరుపై కొందరు ఫ్యాన్స్ గరం గరంగా ఉన్నారు.

బన్నీ కావాలని అన్నాడో.. లేదా ఫ్లోలో అన్నాడో గానీ పవర్ స్టార్ గురించి మాట్లాడను అని చెప్పడం ఇపుడు పెద్ద ఇష్యూ అయింది. సోషల్ మీడియా ద్వారా దీన్ని బాగా వ్యాప్తి చేస్తూ....బన్నీ తీరును ఎండగట్టే ప్రయత్నం చేస్తూ పెద్ద దుమారం రేపారు పవర్ స్టార్ ఫ్యాన్స్.

ఫేస్ బుక్, ట్విట్టర్ ఆలో అయితే #CheppanuBrother హ్యాష్ ట్యాగ్ టాప్ ట్రెండింగ్ లిస్టులో చేరిపోయింది. వేలాది మంది అభిమానులు హ్యాష్ ట్యాగ్ లో వాదోపవాదాలు జరుపుతున్నారు. చెప్పను బ్రదర్ పేరుతో ఫేస్ బుక్ లో ఓ పేజీ కూడా క్రియేట్ చేసారు. కొంతమంది అల్లు అర్జున్ కు సక్సెస్ తలకెక్కింది అని మండిపడితే, మరికొంతమంది పవన్ పేరు నిజంగానే చెప్పాల్సిన అవసరం లేదని బన్నీ సపోర్ట్ గా నిలిచారు. బన్నీ కెరీర్ 'చెప్పను బ్రదర్' కి ముందు, 'చెప్పను బ్రదర్' కి తర్వాత అంటూ రాసుకోవాల్సి వస్తుందని వార్నింగ్ ఇస్తున్నారు.

మెగా హీరోలకు సంబంధించిన ఏ సినీ ఫంక్షన్ జరిగినా పవన్ ఫ్యాన్స్ 'పవర్ స్టార్.. పవర్ స్టార్' అని అరవడం....సీరియస్ గా మాట్లాడుతున్న వారిని డిస్ట్రబ్ చేయడం లాంటివి చేయడం కొత్తేమీ కాదు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తీరు చూసిన విసిగి పోయిన వారిలో చిరంజీవితో పాటు నాగబాబు కూడా ఉన్నారు. ఓ ఫంక్షన్లో అయితే నాగబాబు ఏకంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి వార్నింగే ఇచ్చారు.

బన్నీ కూడా ఇలాగే చిర్రెత్తిపోయారు. తాను సినిమా గురించి సీరియస్ గా మాట్లాడుతుంటే...పవన్ స్టార్ గురించి చెప్పాలని కొందరు ఫ్యాన్స్ గోల చేయడంతో 'నేను చెప్పను బ్రదర్' అంటూ చిర్రెత్తిపోయారు. ఈ మాటతో పవన్ కళ్యాణ్ అభిమానులకు బన్నీ ఎనిమీ అయ్యాడు.

సోషల్ మీడియాలో #CheppanuBrother దురమారం ఏ రేంజిలో ఉందో స్లైడ్ షోలో..

చెప్పను బ్రదర్

అల్లు అర్జున్ ఇలా ఎందుకు అనాల్సి వచ్చిందో ఈ వీడియోలో...

గతంలో జరిగిన సంఘటనలు..

గతంలో జరిగిన సంఘటనలు..

గతంలో వివిధ ఆడియో పంక్షన్లలో పవర్ స్టార్ ఫ్యాన్స్ గోల, రాజమౌళి, ప్రభాస్ లాంటి వారి నుండి వచ్చిన సమాధానం...

పవన్ కళ్యాణ్ కి పంచ్

పవన్ కళ్యాణ్ కి పంచ్

బన్నీ అభిమానులు ఇలా పవర్ స్టార్ కే పంచ్ ఇచ్చారు.

కోపంగా..

కోపంగా..

పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ బన్నీ మీద ఎంత కోపంగా ఉన్నరో అంచనా వేయడానికి ఈ ట్విట్టర్ పోస్టే నిదర్శనం.

సెటైర్లు

సెటైర్లు

పవన్ ఫ్యాన్స్ అనవసరంగా గోల చేస్తున్నారంటూ బన్నీ ఫ్యాన్స్ కూడా అందుకు ధీటుగానే సమానం ఇస్తున్నారు సోషల్ మీడియాలో.

పవన్ ఫ్యాన్స్ కూడా..

పవన్ ఫ్యాన్స్ కూడా..

పవన్, బన్నీ ఫ్యాన్స్ మధ్య వాదోపవాదాలు ఓ రేంజిలో జరుగుతున్నాయి.

English summary
Surprisingly, Allu Arjun gave a shocking retort to them saying 'Cheppanu Brother'. Within no time Allu Arjun's words trended across India. Many observers opined that Allu Arjun had done a right job giving a fitting reply to the people who disturbed the function.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu