»   » అల్లు అర్జున్ చిన్నప్పుడు ఇలా...(ఫోటో)

అల్లు అర్జున్ చిన్నప్పుడు ఇలా...(ఫోటో)

By Srikanya
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  హైదరాబాద్ : అల్లు అర్జున్ అంటే డాన్స్ లు, తెరపై చిలిపిగా చెప్పే డైలాగులు గుర్తుకు వస్తాయి. జులాయిగా అదరకొట్టిన బన్నీ రేసుగుర్రంలా పరుగట్టడానికి రెడీ అవుతున్నాడు. రోజు రోజుకీ క్రేజ్ తెచ్చుకుని ఇండస్ట్రీలో చిన్నా పెద్ద డైరక్టర్స్ అంతా ఎదురుచూసేలా ఎదిగిన బన్నీ చిన్నప్పుడు ఎలా ఉండేవాడు అంటే...మీరు ప్రక్కన చూస్తున్న ఫోటోలాగ ఉండేవాడు. తన అభిమానులు కోసం ఫేస్ బుక్ లో షేర్ చేసిన ఈ ఫోటో ఇప్పుడు అంతటా ఓ రేంజిలో సర్కులేట్ అవుతోంది.

  ఇక అల్లు అర్జున్ సినిమాల విషయానికి వస్తే... సూపర్ హిట్ 'జులాయి' కాంబినేషన్‌ మరోసారి అలరించబోతోంది. అల్లు అర్జున్‌-త్రివిక్రమ్‌ కలయికలో ఓ చిత్రం రూపుదిద్దుకోనుంది. రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తారని సమాచారం. స్క్రిప్టు పనులు పూర్తయ్యాయి. త్వరలో ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లనుంది. ఇందులో అల్లు అరవింద్‌ కూడా నిర్మాణ భాగస్వామిగా చేరినట్టు సమాచారమ్‌. కథ ఇప్పటికే సిద్ధమైందట.

  మరో ప్రక్క 'రేసుగుర్రం' తుదిదశకు చేరుకొంది. ఈ చిత్రంలోని పాటల్ని ఈ నెల 14న విడుదల చేయబోతున్నారు. ఈ విషయాన్ని చిత్ర సంగీత దర్శకుడు తమన్‌ ట్విట్టర్‌ ద్వారా తెలియజేశారు. ఈ చిత్రంలో శ్రుతిహాసన్‌, సలోని హీరోయిన్స్. సురేందర్‌రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. నల్లమలుపు శ్రీనివాస్‌ (బుజ్జి), డా||కె.వెంకటేశ్వరరావు నిర్మాతలు. మార్చి 28న న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.

  సురేంద్రరెడ్డి మాట్లాడుతూ..."గెలుపు కోసం బరిలో దిగినవాడికి... లక్ష్యం మాత్రమే కనిపించాలి. ఎదురొస్తున్న సవాళ్లు, పరిగెట్టిస్తున్న పరిస్థితులు, చుట్టుముడుతున్న సమస్యలూ ఇవేమీ పట్టించుకోకూడదు. రేసులో నిలవాలన్నా, నిలిచి గెలవాలన్నా పోరాడాల్సిందే. ఆ యువకుడూ అదే చేశాడు. 'రేసు గుర్రం'లా దూసుకుపోయాడు. మరి విజయం అందిందా? లేదా? ఇంతకీ ఈ రేసు దేని కోసం? తెలియాలంటే మా సినిమా చూడాల్సిందే!" అన్నారు

  నిర్మాతలు మాట్లాడుతూ "బన్ని కెరీర్‌లో ఫుల్‌లెంగ్త్ ఎంటర్‌టైనర్‌గా నిలుస్తుంది. ఆద్యంతం నవ్వులు పండిస్తూనే ఉంటుంది. మా రేసుగుర్రం విశేషాలు ఇంకా తెలుసుకోవాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే. వినోదం, యాక్షన్‌ మేళవించిన కథ ఇది. టైటిల్‌కి తగ్గట్టే.. హుషారుగా సాగిపోతుంది'' అని అన్నారు. ఈ చిత్రానికి తమన్‌ సంగీతం అందిస్తున్నారు.

  Allu Arjun childhood Photo

  ఇద్దరమ్మాయిలతో... సినిమా బాక్సాఫీస్‌ వద్ద పరాజయం చెందిన తరువాత బన్ని చేస్తున్న సినిమా ఇది. ఈ సినిమాతో ఎలాగైనా హిట్‌ కొట్టాలని భావిస్తున్నాడు. అలాగే ఊసరవెల్లి సినిమా తరువాత సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో వస్తున్న సినిమా ఇది. ఇతనికీ ఈ సినిమా విజయం ఎంతో అవసరం ఉంది. ఎందుకంటే ఊసరవెల్లి అనుకున్న స్థాయిలో ప్రేక్షకులను అలరించలేకపోయింది.ఈ చిత్రంలో సలోని సెకండ్ హీరోయిన్‌గా కనిపించనుంది. ఈ చిత్రానికి కథ : వక్కతం వంశీ, సంగీతం : తమన్, సినిమాటోగ్రఫీ : మనోజ్ పరమహంస, ఎడిటింగ్ : గౌతం రాజు, నిర్మాతలు : నల్లమలుపు శ్రీనివాస్, వెంకటేశ్వర రావు, దర్శకత్వం : సురేందర్ రెడ్డి.

  English summary
  Allu Arjun was born 08 April 1983 in Chennai. Allu Arjun's nick name is Bunny and his Hobbies are music, Watching Films and Reading Books, his Favorite books names are Oh Life, Relax Please, his Favorite colors are Black and Silver and His Favorite Actress is Rani Mukherjee.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more