»   » బన్నీ లింగుసామి కే ఆ ఆఫర్ ఎందుకిచ్చినట్టు..?

బన్నీ లింగుసామి కే ఆ ఆఫర్ ఎందుకిచ్చినట్టు..?

Posted By:
Subscribe to Filmibeat Telugu

"హీరోల్లో రాజ్‌ కుమార్‌ ఫ్యామిలీ అంటే ఇష్టం. ఆ ఫ్యామిలీ హీరోలతో కలిసి పనిచేయడానికి నేను రెడీగా ఉన్నా. త్వరలోనే తెలుగు, తమిళంలో ఓ ద్విభాషా చిత్రం చేయబోతున్నాను. తెలుగు, తమిళం, కన్నడం, మలయాళంలో సినిమాలు చేస్తూ నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకోవాలన్నదే నా లక్ష్యం." 'సరైనోడు' చిత్రం విడుదల సందర్బంగా బెంగుళూర్ లో ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో అల్లు అర్జున్‌ చెప్పిన సంగతి తెలిసిందే..

బన్నీకి ఇతర రాష్ట్రాలోనూ అభిమానులు ఎక్కువ గానే ఉన్నారు. దీంతో అందరు అభిమానుల కోసం ఓ ద్విభాష చిత్రాన్ని చేయాలని బన్నీ ఎప్పట్నుంచో ప్రయత్నిస్తున్నాడు. ఆ కోరిక ఇప్పుడు కార్యరూపం దాల్చనుంది. దర్శకులు లింగుసామి, విక్రమ్ కుమార్‌లు అల్లు అర్జున్ కోసం చకచకా కథలు సిద్ధం చేశారు. గత కొంతకాలంగా వీరిద్దరితోనూ కథా చర్చలు జరుపుతున్న బన్నీ చివరికి విక్రమ్ కుమార్‌ ఇచ్చిన కథని కాదని లింగుసామికే ఓటేశాడని ఫిల్మ్‌నగర్ వర్గాలు చెబుతున్నాయి.

Allu Arjun chooses Lingusaami over Vikram kumar

ఇష్క్, మనం లాంటి విభిన్న కథలతో వరుస విజయాలను అందుకున్న విక్రమ్ కుమార్‌ని కాదని నిర్మాతగా మారి ఫ్లాప్ లలో ఉన్న లింగుసామి ని ఎన్నుకొవటం కాస్త వింతగానే అనిపించినా, లింగుసామి చెప్పిన లవ్ స్టోరీ బన్నీ కి బాగా కనెక్గ్ అయ్యిందట. దాంతొ వెంటనే పచ్చజండా ఊపేసాడట ఈ సరైనోడు. ఇక ఈ ఇద్దరి కాంబినేషన్ లో వచ్చే లవ్ స్టోరీ ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలి మరి....

English summary
Allu Arjun and Lingusamy to join hands for a Tamil-Telugu bilingual
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu