twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మాస్‌ సినిమా అంటే ఏమిటంటే...: అల్లు అర్జున్

    By Srikanya
    |

    హైదరాబాద్: అభిమానులను సంతృప్తిపరిస్తే చాలు.. విజయాలు అందుకోవచ్చు అనే లెక్కలు కూడా చిత్రసీమలో ఉన్నాయి. ఈ ఆలోచన పూర్తిగా తప్పు! మాస్‌ సినిమాకి ఇప్పుడు అర్థం మారిపోయింది. అందరికీ ఆమోదయోగ్యమైనదే మాస్‌ సినిమా. మూడు వర్గాల ప్రేక్షకుల కోసం సినిమాలు తీస్తారు. ఒకటి యువతరం, రెండు కుటుంబ ప్రేక్షకులు, మూడు అభిమానులు. ఏ ఇద్దరికి నచ్చకపోయినా... సినిమా ఆడనట్టే. అందరికీ నచ్చిన సినిమాని అభిమానులు తమ భుజాలపై మోసి.. మరింత పెద్ద సినిమా చేస్తారు అంటూ మాస్ సినిమా అంటే అర్దం వివరించారు అల్లు అర్జున్.

    అల్లు అర్జున్ ఇటీవలే 'జులాయి'గా తెరపైకి వచ్చారు. ఆ సినిమా డివైడ్ టాక్ తెచ్చుకున్నా కలెక్షన్స్ పరంగా బాగుంది. అలాగే మళయాళంలోనూ ఈ చిత్రం మంచి ఓపినింగ్స్ తెచ్చుకుంది. ఈ విషయమై మాట్లాడుతూ... ''నా సినిమాలు మలయాళంలోనూ ఆదరణ పొందడం సంతోషంగా ఉంది. అలాగని నేనేమీ అక్కడి హీరోలకు పోటీగా నిలుస్తున్నాను అనుకోను. నాకంటూ అక్కడో మార్కెట్‌ని ఏర్పరచుకోగలిగాను'' అన్నారు .

    ఇక 'జులాయి'తో మరో మెట్టు ఎక్కాను అన్నారు. ఆ మెట్టు త్రివిక్రమ్‌తో సినిమా చేయడమే... ఓ గొప్ప అనుభూతి. నన్ను నటుడిగా ఓ మెట్టుపైకి తీసుకెళ్లారు. సాధారణంగా వాణిజ్య సినిమాల్లో నటనకు పెద్ద ఆస్కారం ఉండదు. నటుడిగా నేను సంతృప్తిపడుతూ, నిర్మాతల్ని ఖుషి చేశానంటే అంత కంటే ఆనందం ఏముంది? ఇది వరకు నా పాత్రల్లో కాస్త చిన్నపిల్లాడి మనస్తత్వం కనిపిస్తుంది. 'జులాయి'లో మాత్రం నా పాత్రను చాలా మ్యాన్లీగా తీర్చిదిద్దారు అని వివరించారు.

    అలాగే...సినిమా ఒప్పుకొనేటప్పుడు హీరోగానే కాదు.. నిర్మాతగానూ ఆలోచిస్తా.. ఎందుకంటే నేనూ ఓ నిర్మాత కొడుకునే. నా మార్కెట్‌ ఏమిటో నాకు తెలుసు. ఓ సినిమా మొదలవ్వాలంటే దర్శకుడు, హీరో, నిర్మాత ముగ్గురి మధ్య సరైన సమన్వయం ఉండాలని భావిస్తాను. ఎక్కడ ఎంత ఖర్చుపెట్టాలి, మరెక్కడ తగ్గించుకోవాలి అనే విషయంలో ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవల్సిందే'' అన్నారు అల్లు అర్జున్‌. కథల ఎంపికలోనే కాదు నృత్యాల విషయంలోనూ ప్రత్యేక శ్రద్ధ వహిస్తాను అని చెప్పుకొచ్చారు.

    English summary
    Allu Arjun's latest movie Julayi, which opened to a thunderous response, has concluded the with a wonderful collection at the Box Office. According to trade reports, the film has raked in Rs 43 crores at the worldwide collections. The movie has beaten the first week collection record of Pawan Kalyan's Blockbuster flick Gabbar Singh.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X