»   » మన హీరో సినిమా ఆడాలి, పక్కోడి సినిమా పోవాలా? ‘డిజె’ మేకర్స్ ఆవేదన!

మన హీరో సినిమా ఆడాలి, పక్కోడి సినిమా పోవాలా? ‘డిజె’ మేకర్స్ ఆవేదన!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: తెలుగు సినిమా పరిశ్రమలో హెల్దీ కాంపిటీషన్ తగ్గిపోతోంది. హీరోలు బాగానే ఉన్నా... అభిమానుల కారణంగా పెద్ద చిక్కు వచ్చి పడింది. ఒక హీరో అభిమానులు మరో హీరో ఎదుగుదలను సహించడం లేదు. మన హీరో సినిమా మాత్రమే హిట్టవ్వాలి. పక్కోడి సినిమా నాశనం అయిపోవాలి అనే ధోరణి పెరుగుతోంది.

ఇంటర్నెట్, సోషల్ మీడియా వాడకం బాగా పెరిగిన తర్వాత ఈ విద్వేషం మరింత ఎక్కువైంది. పక్క హీరో సినిమా విడుదలైతే చాలు సినిమాపై నెగెటివ్ ప్రచారం చేయడం, సినిమా హిట్ కాకుండా, కలెక్షన్లు రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేయడం లాంటివి జరుగుతున్నాయి.


వారంలో 100 కోట్ల దిశగా 'డిజె'... థాంక్స్ మీట్లో హ్యాపీ మూమెంట్స్ (ఫోటోస్)


ఇలాంటివి కొంత కాలంగా జరుగుతున్నా.... నిర్మాతలు, హీరో, దర్శకుడు బహిరంగంగా మాట్లాడిన సందర్భాలు చాలా తక్కువ . అయితే అల్లు అర్జున్ 'డిజె' మూవీ విషయంలో ఇది మరీ ఎక్కువ కావడంతో 'డిజె' థాంక్స్ మీట్లో తమ మనసులోని ఆవేదనను వెల్లగక్కారు దర్శక నిర్మాతలు. ఇలాంటి పరిణామాలు మనకు మంచిది కాదని చెప్పే ప్రయత్నం చేశారు.


మనల్ని మనం తక్కువ చేసుకోవద్దు, అందరి సినిమాలు ఆడాలి

మనల్ని మనం తక్కువ చేసుకోవద్దు, అందరి సినిమాలు ఆడాలి

ఈరోజు సోష‌ల్ మీడియాలో మన‌ల్ని మ‌నం త‌క్కువ చేసుకుంటున్నారు. కానీ బాలీవుడ్‌వాళ్ళు డీజే సినిమా చూసి మెచ్చుకుంటున్నారు. ప్ర‌తి ఒక హీరో సినిమా బాగా ఆడాలి. ప్ర‌తి సినిమా ఒక‌దానిపై ఒక‌టి గ్రాస‌ర్ పెర‌గాలి. దాని వ‌ల్ల తెలుగు సినిమా స్టాండ‌ర్డ్ పెర‌గాలి. ఏ హీరో అభిమానులు మ‌రో హీరోను త‌క్కువ చేసుకోవ‌ద్దు. మ‌నం తెలుగువాళ్ళం. మన సినిమా స్టాండ‌ర్డ్‌ను పెంచండి. ఇదే నేను చేసే రిక్వెస్ట్‌... అని దిల్ రాజు వ్యాఖ్యానించారు.


కొంత నెగెటివిటీ ఉంది

కొంత నెగెటివిటీ ఉంది

సినిమాపై కొంత నెగ‌టివిటి ఉందని చెప్పిన బన్నీ.... నా పాజిటివిటీతో నెగిటివిటీని దాటుకుంటూ వెళ్ళాలనుకుంటున్నట్లు తెలిపారు. అన్నింటిని దాటుకుని ముందుకు వెళతాననే నమ్మకం ఉందన్నారు. బన్నీ నేరుగా విమర్శలు చేయక పోయినా ఇలా తన కామెంట్లతో నెగెటివ్ ప్రచారం చేస్తున్న వారిలో పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేసేలా చేశారు.


ఎన్నారైల కోసం అమెరికా టూర్

ఎన్నారైల కోసం అమెరికా టూర్

‘డిజె' మూవీ చాలా మంది ఎన్నారైల‌కు న‌చ్చింది. కాబ‌ట్టి యూనిట్ అంతా అమెరికాకు వెళ్లి వారంద‌రినీ క‌లుస్తామని ఈ సందర్భంగా అల్లు అర్జున్ వెల్లడించారు.


మార్నింగ్ డివైడ్ టాక్ వచ్చింది

మార్నింగ్ డివైడ్ టాక్ వచ్చింది

జూన్ 23న సినిమా రిలీజైన త‌ర్వాత అమెరికా నుండి ఉద‌యం మూడున్న‌రకు ఫోన్ చేసి ఫ‌స్టాఫ్ బావుంది. సెకండాఫ్ అలా అలా ఉంది. క్లైమాక్స్ బావుంద‌ని ఫోన్ చేశారు. నేను హ్యాపీగా ఫీల‌య్యాను. నెల్లూరు నుండి సెకండాఫ్ బావుంద‌ని అన్నారు. ఇలా యూనానిమ‌స్ టాక్ వ‌చ్చింది. మార్నింగ్ షో నుండి వ‌చ్చిన డివైడ్ టాక్ నుండి ఫ‌స్ట్ షో కు టాక్ మారిపోయింది. మేం అనుకున్న‌ట్లు సినిమా బ్లాక్‌బ‌స్ట‌ర్ అయ్యింది. నాలుగు రోజుల్లో 75 కోట్లు వసూలైంది. వారంలో 100 కోట్లు వస్తాయి. మా బ్యాన‌ర్‌లో 25వ సినిమా తొలి వారంలోనే 100 కోట్ల గ్రాస్ క‌లెక్ట్ చేసిందంటే ఇంత‌కు మించి సమాధానం ఏమీ లేదు... అని దిల్ రాజు తెలిపారు.


21 నెలల కష్టం, రక్తం ధారపోశారు

21 నెలల కష్టం, రక్తం ధారపోశారు

సినిమా కోసం హ‌రీష్ 21 నెల‌లు క‌ష్ట‌ప‌డ్డాడు. ఒక స‌క్సెస్‌ఫుల్ డైరెక్ట‌ర్‌గా ఉండి దాదాపు రెండు సంవత్స‌రాలు హ‌రీష్ ఈ సినిమా స‌క్సెస్ కోసం క‌ష్ట‌ప‌డ్డాడు. ఆ క‌ష్ట‌మేంటో నాకు, బ‌న్నికి తెలుసు. క్యారెక్ట‌ర్ అనుకున్న త‌ర్వాత నుండి బ‌న్ని ఏడాది పాటు బ్రాహ్మ‌ణ‌త్వం ఎలా ఉండాలి. డీజే క్యారెక్ట‌ర్ ఎంత స్ట‌యిలిష్‌గా ఉండాల‌ని వ‌ర్క్ చేసుకుంటూ వ‌చ్చాడు. ఇద్ద‌రూ క‌లిసి ప్ర‌తి సెక‌న్ ఇన్వాల్వ్‌మెంట్‌, పిల్ల‌ర్స్‌లా బ‌న్ని, హ‌రీష్ క‌ష్ట‌ప‌డ్డారు. ప్ర‌తి ద‌ర్శ‌కుడు, హీరో ఒక సంవ‌త్స‌రం నుండి ఏడాదిన్న‌ర పాటు వాళ్ల ర‌క్తం ధార‌పోసి ప‌నిచేస్తారని, వాళ్ల కష్టాన్ని గుర్తించి అయినా ఇలాంటి నెగెటివ్ ప్రచారాన్ని మానేయాలని దిల్ రాజు పరోక్షంగా సూచించారు.


లేని పోని కంపేరిజన్స్ వద్దు

లేని పోని కంపేరిజన్స్ వద్దు

సోష‌ల్ మీడియాలో లేని పోని కంపేరిజ‌న్స్ చేయొద్దు. అప్ప‌ట్లో డా.రాజ‌శేఖ‌ర్ చేసిన అంకుశం సినిమా సూప‌ర్‌డూప‌ర్ హిట్ అయ్యింది. అంకుశం వ‌చ్చింది క‌దా అని గ‌బ్బ‌ర్ సింగ్ సినిమా ఆగ‌లేదు. గ‌బ్బ‌ర్ సింగ్‌లో హీరో పోలీస్ క్యారెక్ట‌ర్ క‌దా అని మొన్న వ‌చ్చిన ప‌టాస్ ఆగ‌లేదు. ప‌టాస్ వ‌చ్చింది క‌దాని రాధ ఆగ‌లేదు. ఎంత మంది హీరోలు కాలేజ్ స్టూడెంట్‌గా, ఆటోడ్రైవ‌ర్స్‌గా ఇలా ఎన్నో క్యారెక్ట‌ర్స్ ఎంతో మంది చేసుంటారు. బ్రాహ్మ‌ణ క్యారెక్ట‌ర్ అనేది చాలా త‌క్కువ సినిమాల్లో వ‌చ్చింది. మైకేల్ మ‌ద‌న కామ‌రాజులో క‌మ‌ల్ హాస‌న్‌గారు, ముగ్గురు మొన‌గాళ్ళులో చిరంజీవిగారు, అదుర్స్ సినిమాలో ఎన్టీఆర్‌గారు ఇలా త‌క్కువ సినిమాల్లో రావ‌డం వ‌ల్ల కంపేరిజ‌న్ వ‌చ్చి ఉండొచ్చు... అని హరీష్ శంకర్ అభిప్రాయ పడ్డారు.


మా రోజుల్లో హెల్దీ కాంపిటీష‌న్ ఉండేది

మా రోజుల్లో హెల్దీ కాంపిటీష‌న్ ఉండేది

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో `మీ సినిమా విడుద‌లైతే హీరోల మ‌ధ్య తేడాలు బ‌య‌ట‌కు వ‌స్తాయేమో` అనే క్వ‌శ్చ‌న్ చేశారు. నేను చెప్పెదొక్క‌టే నేను హీరో వ‌ర్షిప్ నుండే ద‌ర్శ‌కుడిగా మారాను. నేను హైద‌రాబాద్‌లో చ‌దువుకునే రోజుల్లో హీరోల క‌టౌట్స్‌కు పాలాభిషేకం, హీరో క‌టౌట్స్‌కు దండలు వేయడం, కొబ్బ‌రికాయ‌లు కొడుతూ చేతి ర‌క్తం హీరోకు బొట్టు పెడుతూ పెరిగిన అభిమాని నేను. హీరోల‌ను అభిమానించే ద‌ర్శ‌కుల్లో నేను ప్ర‌థ‌ముణ్ణి. మా రోజుల్లో హెల్దీ కాంపిటీష‌న్ ఉండేది. కానీ ఈరోజు ఏమైంది. ఈరోజు నువ్వు ఫేస్‌బుక్‌లోకి రా చూసుకుందాం..ట్విట్ట‌ర్‌లో లాగిన్ అవుతావు క‌దా, చూసుకుందాం అంటున్నారు. ఈరోజు విమ‌ర్శ‌ల‌కు నేను స‌మాధానం చెప్ప‌ను. స‌మాధానం బాక్సాఫీస్ చెబుతుంది. నేను చెప్పాల్సిన అవ‌స‌రం లేదు... అని హరీష్ శంకర్ తెలిపారు.


రివ్యూలు రాసే వారిపై మండి పడ్డ హరీష్ శంకర్

రివ్యూలు రాసే వారిపై మండి పడ్డ హరీష్ శంకర్

ప్ర‌పంచంలోనే అతి పెద్ద ప్ర‌జాస్వామ్య దేశం మ‌న‌ది. సినిమా చూసి ఈ సినిమాలో ఇది బాలేదు అని చెప్ప‌వ‌చ్చు. కానీ రివ్యూలు అలా ఉండ‌వు. ఈ డైరెక్ట‌ర్‌కు క‌ళ్లు నెత్తికెక్కాయ‌ని రాస్తారు. అస‌లు డైరెక్ట‌ర్‌ను విమ‌ర్శించ‌డానికి వారెవ‌రు. ప్రేక్ష‌కుడు క‌థా వ‌స్తువును విమ‌ర్శించ‌వ‌చ్చు. అంతే కానీ ఈ ద‌ర్శ‌కుడికి పొగ‌రు, క‌ళ్ళు నెత్తికెక్కాయ‌ని అంటారు. గ‌బ్బ‌ర్ సింగ్ హిట్ త‌ర్వాత కొంద‌రు నా అట్యిట్యూడ్ మారింద‌ని అన్నారు కానీ, నా అట్యిట్యూడ్ వ‌ల్లే గ‌బ్బ‌ర్‌సింగ్ వ‌చ్చింది. గబ్బ‌ర్‌సింగ్ వ‌ల్ల నాకు అట్యిట్యూడ్ రాలేదు... అని హరీష్ శంకర్ అన్నారు.


మ‌రొక‌రి రివ్యూ చూసి నిర్ణ‌యం తీసుకోవ‌ద్దు

మ‌రొక‌రి రివ్యూ చూసి నిర్ణ‌యం తీసుకోవ‌ద్దు

ప్రేక్ష‌కుడు డ‌బ్బులు పెట్టి సినిమాకు వెళ్లే ముందు సినిమా తాలుకా టీజ‌ర్ వ‌స్తుంది. పోస్ట‌ర్‌, ట్రైల‌ర్‌, ఆడియో విడుద‌ల‌వుతుంది. మీకు న‌చ్చితే మీ స్వంత రివ్యూ మీరే ఇవ్వండి. అంతే త‌ప్పు మ‌రొక‌రి రివ్యూ చూసి నిర్ణ‌యం తీసుకోవ‌ద్దు... అని ప్రేక్షకులకు హరీష్ శంకర్ సూచించారు.


నాన్ బాహుబ‌లి రికార్డ్స్‌ను కొట్టుకుంటూ డీజే

నాన్ బాహుబ‌లి రికార్డ్స్‌ను కొట్టుకుంటూ డీజే

ఈ సినిమాకు వ‌చ్చిన డివైడ్ టాక్‌ను ప‌క్క‌న పెట్టి, నాన్ బాహుబ‌లి రికార్డ్స్‌ను కొట్టుకుంటూ డీజే సినిమా వెళుతుంది. ఈ సినిమా టాప్‌లో ఏ ప్లేస్ ఉంటుందనేది కాలం స‌మాధానం చెబుతుంది.... అని హరీష్ శంకర్ అన్నారు.


రెవెన్యూలే కనపడలాలి, రివ్యూలు కాదు

రెవెన్యూలే కనపడలాలి, రివ్యూలు కాదు

మంచి సినిమా తీసిన‌ప్పుడు రెవెన్యూలు క‌న‌ప‌డాలే త‌ప్ప‌, రివ్యూలు క‌న‌ప‌డ‌కూడ‌ద‌ని నిరూపించిన ప్రేక్ష‌క దేవుళ్ళ‌కు న‌మ‌స్కారం. దిల్‌ రాజుగారు నాపై, మా హీరోపై న‌మ్మ‌కంతో మూడు రెట్టు ఖ‌ర్చు పెట్టి సినిమా చేసినందుకు ఆయ‌న‌కు థాంక్స్ చెప్పిన త‌క్కువే. ఆయ‌నకు సినిమాల‌పై ఉన్న ప్యాష‌న్‌కు ఆయ‌న‌కు నా పాదాభివంద‌నం. ఆయన సినిమా కోసం ఎంత తపన పడ్డారో తెలుసు అని హరీష్ శంకర్ తెలిపారు.English summary
Allu Arjun, Dil Raju, Harish sensational comments at DJ Thank You Meet. Duvvada Jagannadham DJ Movie Thank You Meet Function held at JRC Convention Centre, Jubilee Hill, Hyderabad.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu