»   » అల్లు అర్జున్ రాకతో పులకరించిన పాలకొల్లు!

అల్లు అర్జున్ రాకతో పులకరించిన పాలకొల్లు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో బుధవారంనాడు సందడి సృష్టించారు. పాలకొల్లు అల్లు అర్జున్ స్వగ్రామం కావడంతో ఆయన ప్రేక్షకులు, సొంత జనాల మధ్య శ్రీ తేజ థియేటర్లో'వరుడు' చిత్రాన్ని తిలకించారు. చాలా రోజుల తర్వాత అల్లు అర్జున్ అక్కడికి రావడంతో అభిమానులు భారీ ఎత్తున సందడి చేశారు. అంతే కాకుండా అడుగడుగునా పూలదండలతో ఆహ్వానం పలుకుతూ అల్లు అర్జున్ ను చూసేందుకు జనం ఎగబడ్డారు. తనను చూడటానికి జనం ఒక్కసారిగా తరలి రావడంతో ఎప్పుడు ఇంత ఆనందం పొందలేదనీ అల్లు అర్జున్ తెలిపారు.

దిల్ రాజుతో కలిసి అల్లు అర్జున్ తను నటించిన 'వరుడు" సినిమాను తిలకించారు. సినిమా చూసిన తర్వాత ఆయన మాట్టాడుతూ, అసలైన ఆనందం ఎలా ఉంటుందో ఈరోజే తెలుసుకొన్నానీ ఇకపై తన ప్రతి సినిమాకు ఇక్కడకు వచ్చి అభిమానుల మధ్య కూర్చొని ఆనందిస్తాననీ తెలియజేశాడు. తమ అభిమాన నటుని ప్రసంగం విన్న అభిమానులు సంతోషంతో సంబరాలు చేసుకుంటూ కేరింతలు కొట్టారు. సినిమా బాగుందనీ మంచి విజయం సాధిస్తుందనీ వారు తెలిపారు. మరిన్నీ సినిమాలతో మమ్మల్నీ అలరించాలనీ అల్లు అర్జున్ ను వారు కోరారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu