twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఏపీ వ్యాప్తంగా పలు చోట్ల పుష్ప థియేటర్ మీద బన్నీ ఫాన్స్ దాడి.. ఒక్కో చోట ఒక్కో కారణం..అసలు ఏమైందంటే?

    |

    ఎన్నో అంచనాల నడుమ విడుదలైన అల్లు అర్జున్, సుకుమార్ ల 'పుష్ప' సినిమా థియేటర్స్‌లో దుమ్ము రేపుతుంది. ఇప్పటికే విడుదలైన పాటలు అన్ని భాషల్లో సూపర్‌హిట్‌ కావడం, బన్నీ- సుకుమార్‌ హ్యాట్రిక్‌ కాంబినేషన్‌ కావడంతో అంచనాలు మరింత పెరిగాయి. విడుదలైన అన్ని ప్రాంతాల్లో పుష్ప పాజిటివ్‌ టాక్‌తో దూసుకెళ్తున్న ఈ సినిమా ఆడుతున్న థియేటర్స్ మీద ఎటాక్ చేశారని అంటున్నారు. ఆ వివరాల్లోకి వెళితే

    సరిపోదన్నట్లు

    సరిపోదన్నట్లు

    ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న టికెట్ రేట్ల తలనొప్పి థియేటర్ల యజమానులకు సరిపోదన్నట్లుగా , ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని చోట్ల పుష్ప బెనిఫిట్ షోను ప్రదర్శించనందుకు అభిమానులు థియేటర్‌పై రాళ్లు రువ్వారు. హైకోర్టు నుంచి సానుకూల తీర్పు వస్తుందని ఆశిస్తూ కొన్ని థియేటర్లు బెనిఫిట్ షోల టిక్కెట్లను విక్రయించాయి.

    బెనిఫిట్ షోలు రద్దు

    బెనిఫిట్ షోలు రద్దు

    అయితే ఆ తర్వాత తీర్పు రాకపోవడంతో థియేటర్లు బెనిఫిట్ షోలు రద్దు చేయాల్సి వచ్చింది. డబ్బు వాపస్ ఇస్తామని చెప్పినా ఆగ్రహించిన అభిమానులను శాంతింపజేయలేకపోయారు. అందులో భాగంగానే ఆదోనిలో గురువారం రాత్రి ఓ థియేటర్‌పై అభిమానులు రాళ్లు రువ్వారు. హిందూపురంలో కూడా ఇలాంటి దృశ్యాలు కనిపించాయి. అనంతపురం జిల్లా హిందూపురంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. అల్లు అర్జున్ నటించిన 'పుష్ప' సినిమా బెనిఫిట్ షో వేస్తామని చెప్పి బాలాజీ థియేటర్ యాజమాన్యం డబ్బులు వసూలు చేసిందని.. అయితే బెనిఫిట్ షో వేయలేదంటూ అభిమానులు ఆందోళనకు దిగారు.

    థియేటర్‌పై రాళ్లు రువ్వారు

    థియేటర్‌పై రాళ్లు రువ్వారు

    బాలాజీ థియేటర్ యాజమాన్యం బెనిఫిట్ షో కోసం ఒక్కొక్కరి నుంచి రూ. 500 వసూలు చేసిందని అభిమానులు ఆరోపించారు. ఈ మేరకు థియేటర్ వద్ద బోర్డు కూడా ఏర్పాటు చేశారని ఆరోపించారు. శుక్రవారం ఉదయం సినిమా థియేటర్ వద్దకు వెళ్లిన అభిమానులకు నిరాశ ఎదురైంది. థియేటర్ యాజమాన్యం బెనిఫిట్ షో వేయకపోవడంతో అభిమానుల ఆగ్రహం కట్టలు తెచ్చుకుంది. దీంతో పలువురు అభిమానులు థియేటర్‌పై రాళ్లు రువ్వారు. ఈ విషయం తెలిసిన పోలీసులు రంగంలోకి దిగి అభిమానులను చెదరగొట్టారు.

    పోలీసులు రంగ ప్రవేశం చేసి

    పోలీసులు రంగ ప్రవేశం చేసి

    మరో పక్క తిరుపతిలో ఎస్వీ థియేటర్ యాజమాన్యంపై అల్లు అర్జున్ అభిమానులు నిరసన వ్యక్తం చేస్తూ థియేటర్‌పై రాళ్లు రువ్వారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి వారిని అదుపు చేసేందుకు లాఠీచార్జి చేయాల్సి వచ్చింది. ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని చోట్ల ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. ప్రభుత్వం సహకరించక పోవడంతో ఈ విషయంలో తాము నిస్సహాయంగా ఉన్నామని థియేటర్‌ యాజమాన్యాలు చెబుతున్నాయి.

     తిరుపతిలో థియేటర్‌పై దాడి

    తిరుపతిలో థియేటర్‌పై దాడి

    ఇక "మేము అన్ని వైపుల నుండి టార్గెట్ చేయబడ్డాం'', థియేటర్ వ్యాపారంలో ఇది అత్యంత చెత్త సమయం, "అని థియేటర్ యాజమాన్యాలు అంటున్నారు. సౌండ్ క్వాలిటీ సరిగా లేదని అభిమానులు ఫిర్యాదు చేయడంతో తిరుపతిలోని ఓ థియేటర్‌పై దాడి జరిగింది. వాస్తవానికి ఇది సినిమాకు సంబంధించిన సమస్య అని థియేటర్ యాజమాన్యం చెబుతోంది. అయినా వినకుండా అభిమానులు దాడి చేశారు.

    కేరళ ఫ్యాన్స్‌

    కేరళ ఫ్యాన్స్‌

    ఇక మరో పక్క పుష్ప రిలీజ్‌ కోసం కేరళ ఫ్యాన్స్‌ ఎంతగానో ఎదురుచూశారు. కానీ సాంకేతిక కారణాల వల్ల పుష్ప ఫైనల్‌ ప్రింట్‌ రావడంలో ఆలస్యమైంది. దీంతో సమస్యను పరిష్కరించి శనివారం నాడు పుష్ప మలయాళ వెర్షన్‌ను రిలీజ్‌ చేయనున్నారు. అప్పటివరకు కేర‌ళ‌లోని థియేట‌ర్ల‌లో పుష్ప త‌మిళ వెర్ష‌న్‌ను ప్ర‌ద‌ర్శించ‌నున్నారని తెలుస్తోంది.

    English summary
    Allu Arjun Fans Attack Pushpa Theaters In Andhra Pradesh.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X