»   » అల్లు అర్జున్ కొత్త రికార్డ్...మిగతా హీరోల్లో టెన్షన్

అల్లు అర్జున్ కొత్త రికార్డ్...మిగతా హీరోల్లో టెన్షన్

Posted By:
Subscribe to Filmibeat Telugu
Allu Arjun
హైదరాబాద్ : అల్లు అర్జున్ మరో రేర్ ఫేట్ చేసాడు. సౌత్ హీరోల్లో తనకంటూ మరోసారి ఎక్కువ మంది ఫ్యాన్ ఫాలోయింగ్ సోషల్ నెట్ వర్కింగ్ సైట్స్ లో ఉందని ప్రూవ్ చేసుకున్నాడు. అల్లు అర్జున్ ఫేస్‌బుక్‌ పేజీకి ఉన్న లైకుల సంఖ్య 25 లక్షల మైలురాయిని దాటింది. ఈ విషయాన్ని ఫేస్ బుక్ టీమ్ నిర్దారించింది. ఇదే ఇప్పుడు సినీ సర్కిల్స్ లో ఫ్యాన్స్ లోనూ హాట్ టాపిక్ గా మారింది. బన్నీ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. ఈ నేపధ్యంలో మిగతా హీరోలు తమ పేస్ బుక్ పేజీలు వంక దృష్టి సారిస్తున్నారని తెలుస్తోంది. ఇన్నాళ్లూ పెద్దగా పట్టించుకోని ఈ విషయమై వారు తమ దైన రికార్డులు క్రియేట్ చెయ్యాలనే ఆలోచనలో ఉన్నట్లు చెప్పుకుంటన్నారు.

యూత్ లో...నీ ఫేస్‌బుక్‌ పేజీకి లైకులెన్ని? ఇప్పుడు ఎక్కడ విన్నా ఇదే మాట. సినిమా వాళ్ల విషయానికొస్తే ఈ మాట మరీ ఎక్కువగా వినిపిస్తోంది. ఒక్కో పేజీకి లక్షల్లో లైక్స్‌ ఉంటున్నాయి. ఇప్పుడు అల్లు అర్జున్‌ ఫేస్‌బుక్‌ పేజీకి ఉన్న లైకుల సంఖ్య 25 లక్షల మైలురాయిని దాటింది. ఇటీవల అల్లు అర్జున్‌ పేజీకి ఫేస్‌బుక్‌ టీమ్‌ వెరిఫైడ్‌ గుర్తింపు ఇచ్చింది. దీని తర్వాత లైక్స్‌ సంఖ్య మరింత పెరిగింది. అన్నట్లు... అల్లు అర్జున్‌ కొత్త సంవత్సరం వేడుకల్ని ఆస్ట్రేలియాలో జరుపుకోబోతున్నారు.

అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న కొత్త చిత్రం 'రేసు గుర్రం'. సురేందర్‌రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. వీరిద్దరి కలయికలో వస్తున్న తొలి సినిమా ఇదే. నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి), డా.కె.వెంకటేశ్వరరావు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ క్రేజీ కాంబినేషన్ పై మంచి అంచనాలే ఉన్నాయి.

ఇద్దరమ్మాయిలతో... సినిమా బాక్సాఫీస్‌ వద్ద పరాజయం చెందిన తరువాత బన్ని చేస్తున్న సినిమా ఇది. ఈ సినిమాతో ఎలాగైనా హిట్‌ కొట్టాలని భావిస్తున్నాడు. అలాగే ఊసరవెల్లి సినిమా తరువాత సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో వస్తున్న సినిమా ఇది. ఇతనికీ ఈ సినిమా విజయం ఎంతో అవసరం ఉంది. ఎందుకంటే ఊసరవెల్లి అనుకున్న స్థాయిలో ప్రేక్షకులను అలరించలేకపోయింది.ఈ చిత్రంలో సలోని సెకండ్ హీరోయిన్‌గా కనిపించనుంది. ఈ చిత్రానికి కథ : వక్కతం వంశీ, సంగీతం : తమన్, సినిమాటోగ్రఫీ : మనోజ్ పరమహంస, ఎడిటింగ్ : గౌతం రాజు, నిర్మాతలు : నల్లమలుపు శ్రీనివాస్, వెంకటేశ్వర రావు, దర్శకత్వం : సురేందర్ రెడ్డి.

English summary

 Allu Arjun has reached one more milestone. He is the first South Indian Hero to have 2.5 million followers on social networking site Facebook. Apart from AP, Allu Arjun enjoys good following in Karnataka and Kerala. That's the reason why he is ahead of rest of the regional heroes down South and he is the most loved Young Hero in the South.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu